BHIM App | భీమ్ యాప్‌లో కొత్త ఫీచర్.. పిన్ లేకుండానే పేమెంట్స్ చేసుకోవచ్చు
BHIM App | యూపీఐ చెల్లింపులను మరింత సులభతరం, వేగవంతం చేసే దిశగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక ముందడుగు వేసింది. ఇందులో భాగంగానే ఎన్‌పీసీఐకు చెందిన NPCI BHIM సర్వీసెస్ లిమిటెడ్ (NBSL) భీమ్ పేమెంట్స్ యాప్‌లో (BHIM App) యూపీఐ లావాదేవీల కోసం బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
BHIM App | యూపీఐ చెల్లింపులను మరింత సులభతరం, వేగవంతం చేసే దిశగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక ముందడుగు వేసింది. ఇందులో భాగంగానే ఎన్‌పీసీఐకు చెందిన NPCI BHIM సర్వీసెస్ లిమిటెడ్ (NBSL) భీమ్ పేమెంట్స్ యాప్‌లో (BHIM App) యూపీఐ లావాదేవీల కోసం బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు ఫింగర్ ప్రింట్ లేదా ఫేషియల్ రికగ్నిషన్ ఉపయోగించి ఈజీగా పేమెంట్స్ చేసుకోవచ్చు.
అయితే, రూ. 5,000 వరకు జరిపే లావాదేవీలకు మాత్రమే ఈ ఫీచర్ వర్తిస్తుంది. రూ.5 వేలు దాటి జరిపే ఏ లావాదేవీలకైనా పిన్ అవసరం ఉంటుంది. UPI వ్యవస్థలో భద్రతా ప్రమాణాలను పాటిస్తూనే, రోజువారీ లావాదేవీలను మరింత సులభతరం చేయడం ఈ ఫీచర్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ సదుపాయం భీమ్ యాప్ వినియోగదారులకు డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేయనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్.. ఫింగర్‌ప్రింట్ లేదా ఫేషియల్ రికగ్నిషన్ సపోర్ట్ చేసే ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులోకి వచ్చింది.
ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే..
ముందుగా మన ఫోన్‌లో ఉన్న భీమ్ పేమెంట్స్ యాప్‌ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అక్కడ లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ కోసం యాక్టివేట్ బయోమెట్రిక్ ట్రాన్సాక్షన్ (Activate Biometric Transactions)పై క్లిక్ చేస్తే సరిపోతుంది. ఫింగర్ ప్రింట్, ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా రూ.5 వేల వరకూ ఈజీగా పేమెంట్స్ చేసుకోవచ్చు.
Also Read..
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. రీఫండ్, క్యాన్సిలేషన్ రూల్స్ మారాయి..
మద్యం సేవిస్తూ నడిరోడ్డుపై హల్‌చల్.. ముగ్గురు వైద్యులు అరెస్ట్
వినియోగదారులకు షాకిచ్చిన స్విగ్గీ.. ప్లాట్‌ఫాం ఫీజు పెంపు..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

UPI | ఇక యూపీఐలో ఇంటర్నెట్ లేకున్నా చెల్లింపులు.. త్వరలో కొత్త ట్యాప్ అండ్ పే ఫీచర్..
జులై 21, 2026

AI Payments | యూపీఐలో ఏఐ విప్లవం.. ఇక వినియోగదారుల అనుమతితో చెల్లింపులు చేయనున్న స్మార్ట్ ఏజెంట్లు..
జులై 13, 2026

PhonePe | ఫోన్‌పే యూజర్లకు షాక్.. వాలెట్ వాడకపోతే రూ.100 చార్జీలు కట్టాల్సిందే..
జూన్ 20, 2026
తాజావార్తలు
- ●Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ
- ●criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా
- ●Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట
- ●Tollywood | మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి కథను అందించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?
- ●Vaddiraju Ravichandra | పరీక్ష అంటే ఏండ్ల కష్టం.. అందుకే ప్రజా పరీక్షల సవరణ బిల్లుకు మద్దతిస్తున్నం
- ●KTR | యువ ఇంజినీర్ల ప్రతిభను క్రిమినల్ వేస్ట్ అని అవమానిస్తారా..? : రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ

criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా

Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట

Tollywood | మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి కథను అందించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?



