Swiggy | వినియోగదారులకు షాకిచ్చిన స్విగ్గీ.. ప్లాట్‌ఫాం ఫీజు పెంపు..
Swiggy | పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు, వంట గ్యాస్‌కు కొరత ఏర్పడడంతో దేశంలో అనేక హోటల్స్, రెస్టారెంట్లతోపాటు స్ట్రీట్ ఫుడ్స్, చిరు వ్యాపారులు కూడా ఆహార పదార్థాల ధరలను పెంచేశారు. కొన్ని చోట్ల ప్రత్యేకంగా గ్యాస్ చార్జిలను వసూలు చేస్తున్నారు.
Swiggy | పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు, వంట గ్యాస్‌కు కొరత ఏర్పడడంతో దేశంలో అనేక హోటల్స్, రెస్టారెంట్లతోపాటు స్ట్రీట్ ఫుడ్స్, చిరు వ్యాపారులు కూడా ఆహార పదార్థాల ధరలను పెంచేశారు. కొన్ని చోట్ల ప్రత్యేకంగా గ్యాస్ చార్జిలను వసూలు చేస్తున్నారు. ఇటీవలే ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తమ ప్లాట్‌ఫాం ఫీజును పెంచగా, ఇప్పుడు అదే కోవలో స్విగ్గీ కూడా ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచుతున్నట్లు ప్రకటించింది. స్విగ్గీ తన ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.14.99 నుంచి రూ.17.58కు పెంచినట్లు ప్రకటించింది. ఫీజు పెరుగుదల 17 శాతం కాగా ఇప్పటికే ప్లాట్‌ఫామ్‌లో ఇది వినియోగదారులకు దర్శనమిస్తోంది.
నిర్వహణ ఖర్చులను భరించేందుకే..
స్విగ్గీ ప్లాట్‌ఫాం నిర్వహణ, ఇతర ఖర్చులను భరించేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ సంస్థ వెల్లడించింది. ఖర్చులను భరించేందుకు ఈ పెంపు అనివార్యమని స్పష్టం చేసింది. జొమాటో ఇటీవలే ప్లాట్‌ఫామ్ ఫీజును 19 శాతం మేర పెంచిన విషయం తెలిసిందే. అయితే ఈ పెంపు వల్ల ఫుడ్ డెలివరీలపై వినియోగదారులకు అదనంగా రూ.2 భారం పడనుంది. ప్రస్తుతం స్విగ్గీ, జొమాటో రెండింటిలోనూ ప్లాట్‌ఫాం ఫీజులు జీఎస్టీతో కలిపి దాదాపు రూ.17.58 వద్ద సమానంగా ఉన్నాయి. గతంలో స్విగ్గీ చివరిసారిగా ప్లాట్‌ఫాం ఫీజును సెప్టెంబర్‌లో పెంచింది. అప్పట్లో అది 20 శాతం మేర పెరిగి రూ.14.99కు చేరింది. తాజా పెంపు పెరుగుతున్న ద్రవ్యోల్బణ పరిస్థితులు, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకోవడం గమనార్హం.
లాభాల్లో స్విగ్గీ షేర్లు..
స్విగ్గీ సంస్థ ప్లాట్‌ఫాం ఫీజును పెంచినప్పటికీ ఆ సంస్థ షేర్లు మాత్రం మంగళవారం మార్కెట్‌లో లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే మాత్రం ఇప్పటి వరకు షేర్ ధర దాదాపు 30 శాతం మేర పతనం అయింది. బ్లూమ్‌బర్గ్ డేటా ప్రకారం స్విగ్గీ షేర్లకు విశ్లేషకులు 23 మంది బై (కొనుగోలు) రేటింగ్ ఇవ్వగా, ముగ్గురు హోల్డ్ రేటింగ్ ఇచ్చారు. మరో ఇద్దరు సెల్ (అమ్మకం) రేటింగ్ ఇచ్చారు. సగటు 12 నెలల లక్ష్య ధర ప్రకారం సుమారు 59 శాతం వరకు ఈ కంపెనీ షేర్ ధర పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా జొమాటో షేర్లు కూడా 59 శాతం వరకు పెరిగే చాన్స్ ఉందని అంటున్నారు. ఈ కంపెనీని ట్రాక్ చేస్తున్న విశ్లేషకుల్లో 33 మందిలో 30 మంది బై (కొనుగోలు) రేటింగ్ ఇచ్చారు.
సంబంధిత వార్తలు

Flipkart | ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్‌కార్ట్.. జొమాటో, స్విగ్గీలకు భారీ షాక్..
జులై 24, 2026

Stock Markets | వరుసగా 5వ రోజు నష్టాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 4 నెలల్లో అతి పెద్ద పతనం..
జులై 24, 2026

Kavitha | రేట్ల విషయంలో పట్టిపీడిస్తున్న అగ్రిగేటర్లు.. ప్రభుత్వం గిగ్ వర్కర్స్ పక్షాన నిలబడాలి: కవిత
జులై 22, 2026
తాజావార్తలు
- ●Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ
- ●criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా
- ●Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట
- ●Tollywood | మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి కథను అందించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?
- ●Vaddiraju Ravichandra | పరీక్ష అంటే ఏండ్ల కష్టం.. అందుకే ప్రజా పరీక్షల సవరణ బిల్లుకు మద్దతిస్తున్నం
- ●KTR | యువ ఇంజినీర్ల ప్రతిభను క్రిమినల్ వేస్ట్ అని అవమానిస్తారా..? : రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ

criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా

Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట

Tollywood | మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి కథను అందించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?



