PM Modi | ఉగ్రవాదానికి భారత్ ఎన్నటికీ తలవంచదు.. పహల్గామ్ మృతులకు ప్రధాని నివాళి
PM Modi | ఉగ్రవాదానికి భారత్ ఎన్నటికీ తలవంచదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జమ్ము కశ్మీర్‌లోని మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గామ్‌లో ఉగ్రదాడి ఘటనకు నేటికి ఏడాది పూర్తైన సందర్భంగా ఆ దాడిలో మరణించిన వారికి నివాళులర్పించారు.
India Will Never Bow To Terror PM Modi Honours Victims A Year After Pahalgam Attack
PM Modi | జమ్ము కశ్మీర్‌లోని మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గామ్‌లో ఉగ్రదాడి ఘటనకు నేటికి ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నివాళులర్పించారు. ఈ ఉగ్రదాడి దేశం మొత్తాన్ని కలచివేసిందన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
"గతేడాది ఇదే రోజున పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులను స్మరించుకుంటున్నాను. విషాద ఘటనను, అందులో మరణించిన వారిని ఈ దేశం ఎన్నటికీ మరువదు. ఈ దాడిలో ఆత్మీయులను కోల్పోయి బాధలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. దుఃఖంలోనూ దేశం మొత్తం ఐక్యంగా నిలబడాలి. ఉగ్రవాదానికి భారత్ ఎన్నటికీ తలవంచదు. ఉగ్రవాదుల కుట్రలు ఎప్పటికీ ఫలించవు" అని ప్రధాని మోదీ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.
Also Read..
హైదరాబాద్ నుంచి 8 కొత్త రైళ్లు.. వచ్చే నెల నుంచి సేవలు ప్రారంభం..
డిపోల నుంచి కదలని బస్సులు.. ప్రయాణికులకు తప్పని అవస్థలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






