TG LAWCET | ఐసెట్‌ను మించి.. లాసెట్‌కు పెరుగుతున్న దరఖాస్తులు
TG LAWCET | రాష్ట్రంలో న్యాయవిద్య (Law) అభ్యసించాలనుకునే వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. ఐసెట్, ఎడ్‌సెట్ వంటి ప్రవేశ పరీక్షలకు దరఖాస్తుల సంఖ్య తగ్గుతుంగా, లాసెట్‌కు (TG LAWCET) అప్లికేషన్లు వెల్లువెత్తుతున్నాయి.
TG LAWCET | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో న్యాయవిద్య (Law) అభ్యసించాలనుకునే వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. ఐసెట్, ఎడ్‌సెట్ వంటి ప్రవేశ పరీక్షలకు దరఖాస్తుల సంఖ్య తగ్గుతుంగా, లాసెట్‌కు (TG LAWCET) అప్లికేషన్లు వెల్లువెత్తుతున్నాయి. ఏప్రిల్ 21 నాటికి 63,213 దరఖాస్తులు రాగా, ఐసెట్‌కు ఇప్పటివరకు 54,176 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తు గడువు ఈ నెల 30 వరకు ఉండటంతో లాసెట్ అప్లికేషన్స్ మరింత పెరగవచ్చని అధికారులు చెబుతున్నారు. దీంతో తొలిసారిగా ఐసెట్ దరఖాస్తులను లాసెట్ అధిగమించింది.
ఐసెట్ తగ్గుతున్న ఆదరణ..
సాధారణంగా డిగ్రీ పూర్తి చేసినవారు ఎంబీఏ, ఎంసీఏ వైపు మొగ్గు చూపుతారు. దీంతో ఈ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఐసెట్‌కు (ICET) అత్యధిక దరఖాస్తులు వస్తుంటాయి. ఆ తర్వాత ఎడ్‌సెట్‌కు ఎక్కువ మంది అప్లయ్ చేసుకునేవారు. అయితే గత ఐదేండ్లుగా డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ చేసినవారు కూడా న్యాయవిద్య వైపు చూస్తున్నారు. లా అభ్యసించడానికి ఎలాంటి వయో పరిమితి లేకపోవడంతో 60 ఏండ్లు పైబడినవారితోపాటు ఇంజినీర్లు, డాక్టర్లు కూడా న్యాయవిద్యను అభ్యసిస్తున్నారు. దీంతో లాసెట్ దరఖాస్తులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.
గతేడాది ఐసెట్‌కు 71,746 మంది పోటీపడగా.. ఈసారి ఇప్పటివరకు 54,176 మందే చేసుకున్నారు. మొత్తంగా గతేడాది కంటే 10 వేల వరకు తగ్గవచ్చని, డిగ్రీలో చేరే వారి సంఖ్య తగ్గుతుండటమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఇక ఎడ్‌సెట్‌కు గత ఏడాది 38,754 దరఖాస్తులు అందగా.. ఈసారి ఇప్పటివరకు 31,581 మంది దరఖాస్తు చేశారు.
ఆలస్య రుసుంతో..
రూ. 500 ఫైన్ తో ఏప్రిల్ 15 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. రూ.1000 ఫైన్ తో ఏప్రిల్ 25, రూ. 2 వేల ఫైన్ తో మే 5 వరకు అవకాశం ఉంటుంది. ఇక రూ.4000 ఫైన్ మే 10, రూ. 10 వేల ఆలస్య రుసుంతో మే 13 వరకు ఛాన్స్ ఉంటుంది. ఇక అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ మే 3 నుంచి అందుబాటులోకి వస్తుంది. మే 12న హాల్ టికెట్లు విడుదలవుతాయి.
మే 18న పరీక్ష
- మే 18న మూడేండ్ల ఎల్ఎల్ బీ ఎంట్రెన్స్ పరీక్ష ఉంటుంది. ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు మరో సెషన్ ఉంటుంది.
- ఇక ఎల్ఎల్ బీ ఐదేండ్ల కోర్సుతో పాటు ఎల్ఎల్ఎం ఎంట్రెన్స్ పరీక్షను సాయంత్రం 4 నుంచి 05.30 గంటల మధ్య నిర్వహిస్తారు.
- లాసెట్ ప్రాథమిక కీ మే 23న విడుదల చేస్తారు. వాటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే మే 25 వరకు స్వీకరిస్తారు. జూన్ 5న ఫలితాలు ప్రకటిస్తారు.
తాజావార్తలు
- ●Sreeleela | శ్రీలీల, సాయిపల్లవి తమిళ మూవీ థియేటర్లలోకి వచ్చేది అప్పుడే - రజనీకాంత్‌కు పోటీగా!
- ●Talasani Srinivas Yadav | ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలి.. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్
- ●Rainfall | హైదరాబాద్‌లో లోటు వర్షపాతం.. దంచికొడుతున్న ఎండలు
- ●TGPSC | టీజీపీఎస్సీ నిర్లక్ష్యం.. రోడ్లపై ఓఎంఆర్ షీట్లు ప్రత్యక్షం
- ●Ramchander Rao | సీఎం రేవంత్ రాజీనామా చేయాల్సిందే : రామచందర్ రావు
- ●Girls Missing | సంగారెడ్డి జిల్లాలో నలుగురు బాలికలు అదృశ్యం

Sreeleela | శ్రీలీల, సాయిపల్లవి తమిళ మూవీ థియేటర్లలోకి వచ్చేది అప్పుడే - రజనీకాంత్‌కు పోటీగా!

Talasani Srinivas Yadav | ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలి.. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్

Rainfall | హైదరాబాద్‌లో లోటు వర్షపాతం.. దంచికొడుతున్న ఎండలు

TGPSC | టీజీపీఎస్సీ నిర్లక్ష్యం.. రోడ్లపై ఓఎంఆర్ షీట్లు ప్రత్యక్షం






