త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Apache Helicopter Gunship | హ‌ర్మూజ్ స‌మీపంలో కూలిన యూఎస్ అపాచీ హెలికాప్ట‌ర్‌

Apache Helicopter Gunship | ఇరాన్‌తో మూడు నెల‌ల‌కుపైగా సాగుతున్న యుద్ధంలో అగ్ర‌రాజ్యం అమెరికాకు మ‌రో షాక్ త‌గిలింది. హ‌ర్మూజ్ జ‌ల‌సంధి (Strait Of Hormuz) స‌మీపంలో యూఎస్ ఆర్మీకి (US Army) చెందిన అపాచీ హెలికాప్ట‌ర్ గ‌న్‌షిప్ (Apache Helicopter Gunship) కూలిపోయింది.

D

International | Published On Jun 9, 2026, 11.19 am IST

Apache Helicopter Gunship | హ‌ర్మూజ్ స‌మీపంలో కూలిన యూఎస్ అపాచీ హెలికాప్ట‌ర్‌
Advertisement

Apache Helicopter Gunship | ఇరాన్‌తో మూడు నెల‌ల‌కుపైగా సాగుతున్న యుద్ధంలో అగ్ర‌రాజ్యం అమెరికాకు మ‌రో షాక్ త‌గిలింది. హ‌ర్మూజ్ జ‌ల‌సంధి (Strait Of Hormuz) స‌మీపంలో యూఎస్ ఆర్మీకి (US Army) చెందిన అపాచీ హెలికాప్ట‌ర్ గ‌న్‌షిప్ (Apache Helicopter Gunship) కూలిపోయింది. అయితే, అందులోని ఇద్ద‌రు సిబ్బందిని అమెరికా ద‌ళాలు ర‌క్షించాయి. ఈ మేర‌కు న్యూయార్క్‌ టైమ్స్ నివేదించింది. అయితే, హెలికాప్ట‌ర్ కూలిపోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను మాత్రం స‌ద‌రు ప‌త్రిక వెల్ల‌డించ‌లేదు. ఇరాన్ జ‌రిపిన కాల్పుల వ‌ల్ల అది కూలిపోయిందా..? లేక ఏదైనా సాంకేతిక స‌మ‌స్య త‌లెత్తిందా..? అన్న‌దానిపై స్ప‌ష్ట‌త లేద‌ని స‌ద‌రు నివేదిక తెలిపింది.

ప్రపంచ ఇంధన సరఫరాలో ఐదవ వంతు వాటాను కలిగి ఉన్న అత్యంత కీలకమైన హ‌ర్మూజ్ జలసంధిని ఇరాన్ సమర్థవంతంగా మూసివేయడాన్ని అడ్డుకోవడానికి అమెరికా సైన్యం అపాచీలతో పాటు ఆయుధాలు కలిగిన MQ-9 రీపర్ డ్రోన్‌లను, F/A-18, F-35 యుద్ధ విమానాలను ఉపయోగిస్తోంది. హెల్‌ఫైర్ క్షిపణులతో సన్నద్ధమై ఉండే AH-64 అపాచీ గన్‌షిప్ ఈ ప్రాంతంలో పనిచేస్తున్న అత్యంత అధునాతన విమానాల్లో ఒకటి. చిన్న చిన్న బోట్ల ద్వారా జ‌రిగే దాడుల‌ను అడ్డుకోవ‌డానికి, డ్రోన్‌ల‌ను కూల్చివేయ‌డానికి అమెరికా ఈ గ‌న్‌షిప్‌ను ఉప‌యోగిస్తోంది.

అమెరికన్ సైన్యం (US Army) ప్రధాన ఆయుధ సంపత్తిలో బోయింగ్ AH-64 అపాచీ (Boeing AH-64 Apache) అత్యంత శక్తివంతమైన, అధునాతనమైన దాడి హెలికాప్టర్ (గన్‌షిప్). వీటిని ఆకాశంలో ఎగిరే యుద్ధట్యాంకులుగా పిలుస్తారు. ఈ హెలికాప్ట‌ర్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గన్‌షిప్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి MQ-9 రీపర్ డ్రోన్‌లు, F-15E ఫైటర్ జెట్‌లు, MC-130J కమాండో II స్పెషల్ ఆపరేషన్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో సహా కనీసం 42 అమెరికన్ సైనిక విమానాలను ఇరాన్ ధ్వంసం చేసింది. అయితే, ఈ యుద్ధంలో అపాచీ హెలికాప్టర్ కూలిపోవడం ఇదే మొదటిసారి.

Also Read..

ట్రంప్ వల్లే ప్రజాస్వామ్యానికి ముప్పు.. అందరికీ ఓటు హక్కు ఉండకూడదు: RGV సెన్సేషనల్ ట్వీట్!

డీకేకి త‌గ్గ‌ని త‌ల‌నొప్పి.. శాఖ‌ల కేటాయింపుల‌పై కొన‌సాగుతున్న మంత్రుల అల‌క‌.. ఢిల్లీకి క్యూ

ఓటీటీలోకి అక్ష‌య్‌కుమార్ లేటెస్ట్ హార‌ర్ కామెడీ మూవీ - పెళ్లి కూతుళ్ల‌ను ఎత్తుకుపోయే ద‌య్యం క‌థ‌

Advertisement
Advertisement