త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | బ‌ల‌ప‌డుతున్న సెంటిమెంట్‌.. స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌లు..

Gold And Silver Prices Today | అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో పెట్టుబ‌డిదారుల సెంటిమెంట్ కాస్త మెరుగుప‌డ‌డంతో బంగారం, వెండి ధ‌ర‌లు మంగ‌ళ‌వారం స్వ‌ల్పంగా పెరిగాయి. అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధ‌ర 0.07 శాతం పెరిగి 4,332 డాల‌ర్ల వ‌ద్ద ఉండ‌గా, వెండి ధ‌ర 0.34 శాతం పెరిగి 67.9 డాల‌ర్ల వ‌ద్ద ఉంది.

S

Business | Published On Jun 9, 2026, 11.05 am IST

Gold And Silver Prices Today | బ‌ల‌ప‌డుతున్న సెంటిమెంట్‌.. స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌లు..
Advertisement

Gold And Silver Prices Today | అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో పెట్టుబ‌డిదారుల సెంటిమెంట్ కాస్త మెరుగుప‌డ‌డంతో బంగారం, వెండి ధ‌ర‌లు మంగ‌ళ‌వారం స్వ‌ల్పంగా పెరిగాయి. అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధ‌ర 0.07 శాతం పెరిగి 4,332 డాల‌ర్ల వ‌ద్ద ఉండ‌గా, వెండి ధ‌ర 0.34 శాతం పెరిగి 67.9 డాల‌ర్ల వ‌ద్ద ఉంది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 62 పాయింట్లు పెరిగి 1,54,846 వ‌ద్ద ఉండ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 990 పాయింట్లు ప‌త‌న‌మై 2,45,399 వ‌ద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు భారీగా పెర‌గ్గా, వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.15,316 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,22, 528 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,53,160 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.15,31,600 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.14,700 పెరిగింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,040 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,12,320గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,40,400 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,04,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.13,500 పెరిగింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,487 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.91,896గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,14,870 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,48,700గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.11వేలు పెరిగింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,60,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,600గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు. హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,70,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,700 గా ఉంది.

Advertisement
Advertisement