DK Shivakumar | డీకేకి తగ్గని తలనొప్పి.. శాఖల కేటాయింపులపై కొనసాగుతున్న మంత్రుల అలక.. ఢిల్లీకి క్యూ
DK Shivakumar | కర్ణాటక కాంగ్రెస్‌లో అసమ్మతి జ్వాలలు కొనసాగుతున్నాయి. సుదీర్ఘ పోరాటం తర్వాత సీఎం కుర్చీలో కూర్చున్న డీకే శివకుమార్‌కు (DK Shivakumar) నేతల తీరు తలనొప్పిగా మారింది. కేబినెట్ పోర్ట్‌ఫోలియోల (Portfolio) కేటాయింపులపై రామలింగారెడ్డి సమస్య పరిష్కారమైందని డీకే ప్రకటించిన రెండు రోజులకే.. మరో ఇద్దరు మంత్రులు అలక మొదలు పెట్టారు.
DK Shivakumar | కర్ణాటక కాంగ్రెస్‌లో అసమ్మతి జ్వాలలు కొనసాగుతున్నాయి. సుదీర్ఘ పోరాటం తర్వాత సీఎం కుర్చీలో కూర్చున్న డీకే శివకుమార్‌కు (DK Shivakumar) నేతల తీరు తలనొప్పిగా మారింది. కేబినెట్ పోర్ట్‌ఫోలియోల (Portfolio) కేటాయింపులపై పలువురు సీనియర్ మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తనకు కేటాయించిన శాఖ (portfolio)పై సీనియర్ నేత, మంత్రి రామలింగారెడ్డి (Ramalinga Reddy) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రామలింగారెడ్డి సమస్య పరిష్కారమైందని డీకే ప్రకటించిన రెండు రోజులకే.. మరో ఇద్దరు మంత్రులు శాఖల కేటాయింపులపై అలక మొదలు పెట్టారు. ఈ మేరకు వారు కాంగ్రెస్ అధిష్టానం వద్ద లాబీయింగ్ చేయడానికి ఢిల్లీబాట పట్టడం డీకేకి కొత్త తలనొప్పిగా మారింది.
కృష్ణ బైరేగౌడకు (Krishna Byre Gowda) బెంగళూరు అభివృద్ధి శాఖను కేటాయించారు. బెంగళూరు వాటర్ సప్లై (BWSSB), మెట్రో వంటి విభాగాలు ఆయనకు అప్పగించినప్పటికీ.. కీలకమైన బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ (BDA), బీఎంఆర్‌డీఏ (BMRDA) శాఖలను డీకే తన వద్దే ఉంచుకున్నారు. దీంతో బైరేగౌడ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన అధికారికంగా ఆ శాఖ బాధ్యతలు కూడా చేపట్టలేదు. ఈ సమస్యను అధిష్టానం వద్దే తేల్చుకుంటానని చెప్పి ఆయన ఢిల్లీ పయనమయ్యారు. మరోవైపు, సీనియర్ నేత కేహెచ్ మునియప్పకు ఆహార, పౌరసరఫరాల శాఖ కేటాయించడంపై ఆయన బహిరంగంగానే నిరాశ వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీకి తన ఆవేదనను తెలియజేశారు. ఆయన కూడా ప్రస్తుతం ఢిల్లీకి వెళ్లినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నెల 3న కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. డీకేతోపాటూ 13 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్ విస్తరణ ఇంకా పూర్తి కాలేదు. కేబినెట్‌లో ఇంకా 21 ఖాళీలు ఉన్నాయి. దీంతో మంత్రిపదవులు దక్కించుకునేందుకు పలువురు ఆశావహులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ (MLA Rizwan Arshad) కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కోసం ఆయన కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపేందుకు ఢిల్లీ చేరుకున్నారు. ఇలా అసమ్మతి మంత్రులు, ఆశావహులు వరుసగా ఢీల్లీ బాట పడుతండటం డీకేకి పెద్ద తలనొప్పిగా మారింది.
Also Read..
ఆర్ అండ్ బీ ఈఎన్‌సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు
యాపిల్‌లో కొత్త శకం.. ఏఐతో అప్ డేట్ అయిన సిరి.. కొత్త ఓఎస్‌లలో యాపిల్ ఇంటెలిజెన్స్..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

IAS Fouzia Taranum | ముస్లిం అయినంత మాత్రాన ‘పాకిస్థానీ’ అంటారా? బీజేపీ ఎమ్మెల్సీకి కర్ణాటక హైకోర్టు అక్షింతలు
ఆగస్టు 8, 2026

Lord Uday Nagaraju | కర్ణాటక సీఎంతో లార్డ్ ఉదయ్ నాగరాజు భేటీ..
ఆగస్టు 8, 2026

Chemical Leak | కర్ణాటక కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. మృతుల్లో నారాయణపేట వాసి..
ఆగస్టు 5, 2026
తాజావార్తలు
- ●Keerthy Suresh | నానితో కీర్తిసురేష్ బాక్సాఫీస్ వార్ - ప్యారడైజ్‌కు పోటీగా మహానటి తమిళ మూవీ రిలీజ్
- ●కర్ణాటక ‘పోటు’.. గాంధీభవన్‌లో ‘స్క్రిప్ట్’ మార్పు? రేవంత్ యూత్ ఫార్ములాపై ఏఐసీసీ లో సస్పెన్స్!
- ●Allam Narayana | బెల్టులు, లాగులు, తొండలు.. ఒక ముఖ్యమంత్రి భాష కాదిది.. ఇట్లాంటి భాష రాజకీయాల్లో చూల్లే
- ●SpaceX Starship | హిందూ మహాసముద్రంలో చిక్కుకుపోయిన స్పేస్ఎక్స్ 'స్టార్‌షిప్'.. రికవరీ కష్టమేనా?
- ●Komatireddy Venkat Reddy | సాగు నీరు ఇవ్వలేం.. ప్రజలకు ధైర్యం చెప్పండి
- ●Traffic Diversions | బోనాల వేళ హైదరాబాద్‌లో రెండురోజులు ట్రాఫిక్ ఆంక్షలు.. వాహనదారులకు కీలక సూచనలు..!

Keerthy Suresh | నానితో కీర్తిసురేష్ బాక్సాఫీస్ వార్ - ప్యారడైజ్‌కు పోటీగా మహానటి తమిళ మూవీ రిలీజ్

కర్ణాటక ‘పోటు’.. గాంధీభవన్‌లో ‘స్క్రిప్ట్’ మార్పు? రేవంత్ యూత్ ఫార్ములాపై ఏఐసీసీ లో సస్పెన్స్!

Allam Narayana | బెల్టులు, లాగులు, తొండలు.. ఒక ముఖ్యమంత్రి భాష కాదిది.. ఇట్లాంటి భాష రాజకీయాల్లో చూల్లే

SpaceX Starship | హిందూ మహాసముద్రంలో చిక్కుకుపోయిన స్పేస్ఎక్స్ 'స్టార్‌షిప్'.. రికవరీ కష్టమేనా?



