Kiren Rijiju | యువతకు సంబంధించిన అంశం.. రాజకీయం చేయొద్దు : కిరణ్ రిజుజు
Kiren Rijiju | నీట్ పేపర్ లీకేజీ అంశంపై (NEET paper leak issue) చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rijiju) పునరుద్ఘాటించారు.
Kiren Rijiju | నీట్ పేపర్ లీకేజీ అంశంపై (NEET paper leak issue) చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rijiju) పునరుద్ఘాటించారు. ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా ఈ చర్చలో పాల్గొనాలని ప్రతిపక్షాలను కోరారు. విద్యార్థులకు సంబంధించిన ఈ అంశంపై రాజకీయాలు చేయొద్దని వ్యాఖ్యానించారు.
ఇవాళ ఉదయం రాజ్యసభలో (Rajya Sabha) కిరణ్ రిజుజు మాట్లాడారు. నీట్ అంశంపై తక్షణమే చర్చను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చర్చకు ముందు షరతులు ఎందుకు పెడుతున్నారంటూ విపక్ష పార్టీలను ప్రశ్నించారు. "నీట్ అంశంపై చర్చ జరగాలని అందరూ డిమాండ్ చేశారు. ఈ చర్చకు ఎలాంటి షరతు ఉండకూడదు. ఒకవేళ షరతులు ఉంటే.. దీనిపై చర్చ చేపట్టడం మీకు ఇష్టంలేదని అర్థం. ఇది చాలా సున్నితమైన అంశం. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినది. కాబట్టి ఈ విషయంలో రాజకీయాలు చేయకూడదు. అంతా కలిసి ఈ అంశంపై ఈరోజే చర్చించుకుందాం. ఈ చర్చలో ఎలాంటి షరతులూ లేకుండా అందరూ పాల్గొనాలి" అని కిరణ్ రిజుజు పేర్కొన్నారు. యువత భవిష్యత్తు విషయంలో రాజీపడేది లేదని ప్రధాని స్పష్టంగా చెప్పారని ఈ సందర్భంగా కిరణ్ రిజుజు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోందని వ్యాఖ్యానించారు. అయితే, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే చర్చకు వస్తామంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెగేసి చెప్పారు.
#WATCH | Delhi: Rajya Sabha adjourned to meet again at 12 noon.
In the House, Parliamentary Affairs Minister Kiren Rijiju says, "All parties have demanded that NEET be discussed. Today, the entire NDA party has again demanded that NEET be discussed. I felt that yesterday, after… pic.twitter.com/PVupNyiYfz
— ANI (@ANI) July 23, 2026
#WATCH | Delhi: Rajya Sabha adjourned to meet again at 12 noon.
In the House, LoP Rajya Sabha, Mallikarjun Kharge says, "Today, Prime Minister has made a statement. This is an instigative statement. The Education Minister should resign only then we will be ready to have a… pic.twitter.com/lwHQHKPTK9
— ANI (@ANI) July 23, 2026
Also Read..
పార్లమెంట్ ఆవరణలో అధికార, విపక్ష ఎంపీల ఆందోళన.. పోటాపోటీ నినాదాలు
మెట్రో స్టేషన్లు క్లోజ్.. లంచ్ టైమ్‌కి సమస్య క్లియర్ కాకపోతే జోక్యం చేసుకుంటానన్న సీజేఐ
పోలీసులపై రాళ్లు విసురుతున్నది బీజేపీ గూండాలే.. అభిజీత్ దిప్కే సంచలన ఆరోపణలు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Jairam Ramesh | మెజారిటీ కోసం కుట్ర.. పార్లమెంటు వాయిదా ఆలస్యంపై జైరామ్ రమేష్ మండిపాటు
సెప్టెంబర్ 11, 2026

Mallikarjun Kharge | 24 రోజులైంది.. చర్యలేవి..? వేదిక శుద్ధీకరణపై నడ్డాకు ఖర్గే లేఖ
సెప్టెంబర్ 3, 2026

Mallikarjun Kharge | డీలిమిటేషన్‌పై చర్చించేందుకు ఆల్‌పార్టీ మీటింగ్ పెట్టండి.. ప్రధాని మోదీకి ఖర్గే లేఖ
ఆగస్టు 27, 2026
తాజావార్తలు
- ●Gold Mine Collapse | కుప్పకూలిన బంగారు గని.. 60 మంది మృతి
- ●Fact Check | ఫ్యాక్ట్ చెక్.. 9 ప్రభుత్వ బ్యాంకుల విలీనంపై గెజిట్.. కేంద్రం క్లారిటీ..
- ●Telangana Employee JAC Meeting | ఉద్యోగ సంఘాల జేఏసీతో ఈ నెల 18న ప్రభుత్వ కీలక సమావేశం
- ●KCR | కేసీఆర్‌కు ఉన్నది 67 ఎకరాలు!
- ●Oil Palm Cultivation Telangana | ఆయిల్‌పామ్ సాగులో తెలంగాణే టాప్
- ●Flipkart | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026.. అక్టోబర్ 9 నుంచి భారీ సేల్..

Gold Mine Collapse | కుప్పకూలిన బంగారు గని.. 60 మంది మృతి

Fact Check | ఫ్యాక్ట్ చెక్.. 9 ప్రభుత్వ బ్యాంకుల విలీనంపై గెజిట్.. కేంద్రం క్లారిటీ..

Telangana Employee JAC Meeting | ఉద్యోగ సంఘాల జేఏసీతో ఈ నెల 18న ప్రభుత్వ కీలక సమావేశం

KCR | కేసీఆర్‌కు ఉన్నది 67 ఎకరాలు!



