Opposition parties protest | పార్లమెంట్ ఆవరణలో అధికార, విపక్ష ఎంపీల ఆందోళన.. పోటాపోటీ నినాదాలు
Opposition parties protest | అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమి ఎంపీల నిరసనలతో పార్లమెంట్ ఆవరణ దద్దరిల్లింది. పార్లమెంట్ ఆవరణ (Parliament premises)లోని మకరద్వారం (Makar Dwar) ముందు ఎంపీలు ఆందోళనకు దిగారు.
Opposition parties protest | అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమి ఎంపీల నిరసనలతో పార్లమెంట్ ఆవరణ దద్దరిల్లింది. నీట్ పేపర్ లీక్ అంశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీల ఎంపీలు (INDIA alliance MPs) గురువారం ఉదయం పార్లమెంట్ ఆవరణ (Parliament premises)లోని మకరద్వారం (Makar Dwar) ముందు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
#WATCH | Delhi: Congress MP Priyanka Gandhi Vadra and others join the INDIA bloc protest at Makar Dwar inside the Parliament premises.
NDA MPs are also protesting in front of the INDIA alliance MPs. pic.twitter.com/v0XLwcT9P1
— ANI (@ANI) July 23, 2026
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనల్లో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్, కేసీ వేణుగోపాల్ సహా విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలంతా పాల్గొన్నారు. మరోవైపు ప్రధాని నివాసం ముందు రాహుల్ మెరుపు ధర్నాను నిరసిస్తూ ఎన్డీయే కూటమి ఎంపీలు (NDA MPs) పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపారు. విద్యార్థుల అంశాన్ని తప్పుదోవ పట్టిస్తూ ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఎన్డీయే కూటమి ఎంపీలు ఆరోపించారు. ఇరు వర్గాలు ఎదురెదురుగా పెద్ద ఎత్తున పోటాపోటీగా నినాదాలు చేశారు. వీరి నిరసనలతో పార్లమెంట్ ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
#WATCH | Delhi: Congress MPs Mallikarjun Kharge, Rahul Gandhi, Priyanka Gandhi Vadra, Samajwadi Party chief Akhilesh Yadav and others join the INDIA bloc protest at Makar Dwar inside the Parliament premises.
NDA MPs are also protesting in front of the INDIA alliance MPs pic.twitter.com/BvECIxVLpd
— ANI (@ANI) July 23, 2026
Also Read..
మెట్రో స్టేషన్లు క్లోజ్.. లంచ్ టైమ్‌కి సమస్య క్లియర్ కాకపోతే జోక్యం చేసుకుంటానన్న సీజేఐ
పోలీసులపై రాళ్లు విసురుతున్నది బీజేపీ గూండాలే.. అభిజీత్ దిప్కే సంచలన ఆరోపణలు
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●99TV Statesman Awards | నాయకుడు అనడానికి అర్హత ఫాలోవర్స్ కాదు.. క్యారెక్టర్
- ●Mandula Samuel | కాంగ్రెస్‌లకొస్తే నువ్ గెలుస్తవ్ సామేల్ అన్నడు.. నేన్ అబద్దమాడా
- ●Suriya | తెలుగు సింగర్‌గా హీరో సూర్య - విశ్వనాథ్ అండ్ సన్స్ వెడ్డింగ్ సాంగ్ రిలీజ్
- ●Dharmendra Pradhan Resignation | ఒకనాడు స్టూడెంట్ లీడర్‌గా పోరాటం.. నేడు అదే వ్యవహారంతో రాజీనామా: ధర్మేంద్ర ప్రధాన్ 'కర్మ' రిటర్న్స్!
- ●Minister Seethakka | లక్ష్యం సాధిస్తే సీఎం చేతుల మీదుగా సన్మానం: మంత్రి సీతక్క
- ●KTR | ప్రజాశక్తి ఎప్పుడూ గొప్పదే.. కేటీఆర్ ట్వీట్ వైరల్..!

99TV Statesman Awards | నాయకుడు అనడానికి అర్హత ఫాలోవర్స్ కాదు.. క్యారెక్టర్

Mandula Samuel | కాంగ్రెస్‌లకొస్తే నువ్ గెలుస్తవ్ సామేల్ అన్నడు.. నేన్ అబద్దమాడా

Suriya | తెలుగు సింగర్‌గా హీరో సూర్య - విశ్వనాథ్ అండ్ సన్స్ వెడ్డింగ్ సాంగ్ రిలీజ్

Dharmendra Pradhan Resignation | ఒకనాడు స్టూడెంట్ లీడర్‌గా పోరాటం.. నేడు అదే వ్యవహారంతో రాజీనామా: ధర్మేంద్ర ప్రధాన్ 'కర్మ' రిటర్న్స్!






