త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | కేసీఆర్‌కు ఉన్న‌ది 67 ఎక‌రాలు!

KCR | మాజీ సీఎం కేసీఆర్‌ భూములపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. కేసీఆర్‌ కుటుంబానికి ఉన్న భూముల మొత్తాన్ని ప్రస్తావిస్తూ సీఎం చేసిన వ్యాఖ్యలపై.. కేసీఆర్‌ వ్యక్తిగతంగా ఉన్న భూమి ఎంత? కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న భూమి ఎంత? అన్న చర్చ మొద‌లైంది.

P

Telangana | Published On Sep 16, 2026, 5.43 pm IST

KCR | కేసీఆర్‌కు ఉన్న‌ది 67 ఎక‌రాలు!
Advertisement

KCR | మాజీ సీఎం కేసీఆర్‌ భూములపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. కేసీఆర్‌ కుటుంబానికి ఉన్న భూముల మొత్తాన్ని ప్రస్తావిస్తూ సీఎం చేసిన వ్యాఖ్యలపై.. కేసీఆర్‌ వ్యక్తిగతంగా ఉన్న భూమి ఎంత? కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న భూమి ఎంత? అన్న చర్చ మొద‌లైంది. అసెంబ్లీలో ప్రస్తావించిన వివరాల్లో కేసీఆర్‌, ఆయన సతీమణి శోభ పేరిట ఉన్న‌ది కేవ‌లం 67.13 ఎకరాలు మాత్ర‌మే. అయితే, కేటీఆర్‌, కవిత, హరీశ్‌రావు, ఇతర కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న భూములను మొత్తం 439.30 ఎకరాలు భూమిని కేసీఆర్ వ్య‌క్తిగ‌త ఆస్తిగా చూపించేందుకు సీఎం రేవంత్ ప్ర‌య‌త్నం చేశార‌న్న విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

కేవ‌లం రాజ‌కీయంగా ఇరుకున పెట్టేందుకే గులాబీ పార్టీ చీఫ్‌కు భారీగా భూములున్నాయ‌ని ఆరోపించ‌డం కేవ‌లం రాజ‌కీయ క‌క్ష మాత్ర‌మేన‌నే వాద‌న‌లున్నాయి. ఇత‌ర కుటుంబ స‌భ్యుల పేరిట ఉన్న భూముల మొత్తాన్ని కేసీఆర్‌ వ్యక్తిగత భూమిగా పరిగణించడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వ్యక్తి పేరుపై ఉన్న ఆస్తి, కుటుంబంలోని ఇతర వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తి రెండూ ఒకటేనని చెప్పలేమని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా కేసీఆర్‌ వ్యక్తిగత ఆస్తికి సంబంధించిన లెక్కను పక్కనపెట్టి.. కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న భూములన్నింటినీ కలిపి చూపించడం వల్ల అసలు అంశం పక్కదారి పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత ఆస్తి విషయంలో స్పష్టమైన లెక్కను మాత్రమే ప్రస్తావించాలని, కుటుంబ సభ్యుల ఆస్తులను కేసీఆర్‌ సొంత భూములుగా ఎలా చూపిస్తారంటూ ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.

Advertisement
Advertisement