త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Flipkart | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026.. అక్టోబర్ 9 నుంచి భారీ సేల్..

Flipkart | ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వార్షిక షాపింగ్ పండుగ ది బిగ్ బిలియన్ డేస్ 2026ను మరోసారి నిర్వహించనున్నట్లు ప్రకటించింది. సాధారణ వినియోగదారుల కోసం ఈ సేల్ అక్టోబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్, వీఐపీ, బ్లాక్ సభ్యులతోపాటు ఫ్లిప్‌కార్ట్ కార్డు వినియోగదారులకు 24 గంటల ముందుగానే, అంటే అక్టోబర్ 8 నుంచే ఎర్లీ యాక్సెస్ అందుబాటులోకి రానుంది.

S

Business | Published On Sep 16, 2026, 5.20 pm IST

Flipkart | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026.. అక్టోబర్ 9 నుంచి భారీ సేల్..
Advertisement

Flipkart | ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వార్షిక షాపింగ్ పండుగ ది బిగ్ బిలియన్ డేస్ 2026ను మరోసారి నిర్వహించనున్నట్లు ప్రకటించింది. సాధారణ వినియోగదారుల కోసం ఈ సేల్ అక్టోబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్, వీఐపీ, బ్లాక్ సభ్యులతోపాటు ఫ్లిప్‌కార్ట్ కార్డు వినియోగదారులకు 24 గంటల ముందుగానే, అంటే అక్టోబర్ 8 నుంచే ఎర్లీ యాక్సెస్ అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది ప్రచార థీమ్‌ను కొనసాగిస్తూ లక్ బదల్ సక్తా హై, యహాన్ కుచ్ భీ హో సక్తా హై అనే క్యాంపెయిన్‌ను ఫ్లిప్‌కార్ట్ తీసుకొచ్చింది. ఈ ప్రచారానికి సంబంధించిన ప్రధాన ప్రకటనలో టైమ్-లూప్ కాన్సెప్ట్‌ను ఉపయోగించారు. సాధారణ యువకుడు ఒకే రోజులో వరుసగా ఎదురయ్యే దురదృష్టకర సంఘటనలను ఎదుర్కొంటుంటాడు. ఆ రోజు మళ్లీ మళ్లీ పునరావృతమవుతుండగా, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో చేసే కొనుగోళ్లు అతని పరిస్థితులను అదృష్టంగా మార్చే విధంగా కథ సాగుతుంది.

సినీ, క్రీడా ప్ర‌ముఖుల‌తో ప్ర‌చారం..

ఈ ప్రకటనలో ప్రముఖ సినీ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కనిపించనున్నారు. భారత క్రికెటర్ రోహిత్ శర్మ, నటుడు జాకీ ష్రాఫ్, నటి శ్రీలీల, కమెడియన్ సమయ్ రైనా, నటి అనీత్ పడా ఈ ప్రచారంలో భాగమయ్యారు. బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా వినియోగదారులకు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ ప్రొడక్ట్స్ సహా వివిధ విభాగాల్లో ప్రత్యేక డిస్కౌంట్లు అందించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. పలు బ్యాంకులు, చెల్లింపు సంస్థలు, ప్రముఖ బ్రాండ్లతో కలిసి ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై గరిష్ఠంగా 10 శాతం వరకు తక్షణ డిస్కౌంట్లు లభించనున్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు, సూపర్ మనీ, పేటీఎం ద్వారా క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలను కూడా అందించనుంది.

ప్ర‌త్యేక డీల్స్‌, ఆఫ‌ర్లు..

ఈ ఏడాది బిగ్ బిలియన్ డేస్‌కు శామ్‌సంగ్ గెలాక్సీ, ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రధాన భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఏసర్, జేబీఎల్, అరిస్టోక్రాట్, టీసీఎల్ సంస్థలు అసోసియేట్ భాగస్వాములుగా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ తన ప్రత్యేక సేల్ ఫార్మాట్లను కూడా కొనసాగించనుంది. ప్రైస్ క్రాష్, బిగ్ బిలియన్ డేస్ స్పెషల్స్, టిక్ టాక్ డీల్స్, బ్రాండ్ అవర్స్, రష్ అవర్స్, డబుల్ డిస్కౌంట్స్ వంటి ప్రత్యేక ఆఫర్ల ద్వారా వినియోగదారులను ఆకర్షించనుంది.

Advertisement
Advertisement