త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Womens Reservation Bill | మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుపై రాహుల్ Vs రిజుజు.. ఎక్స్ వేదిక‌గా మాట‌ల యుద్ధం

Womens Reservation Bill | మహిళా రిజర్వేషన్ల అమలు అంశంపై కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజుజు (Kiren Rijiju ) మ‌ధ్య మాట‌ల యుద్ధం చోటు చేసుకుంది. మ‌న దేశంలో మ‌హిళ‌ల‌కు త‌మ శ‌క్తిని వ‌క్తీక‌రించేందుకు వారికి అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌ని రాహుల్ పేర్కొన్నారు. దీనిపై కిర‌ణ్ రిజుజు త‌న‌దైశ శైలిలో స్పందించారు. రాహుల్ మ‌న‌సు మారిన‌ట్లుందే అంటూ సెటైర్లు వేశారు.

D

National | Published On Aug 8, 2026, 1.12 pm IST

Womens Reservation Bill | మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుపై రాహుల్ Vs రిజుజు.. ఎక్స్ వేదిక‌గా మాట‌ల యుద్ధం
Advertisement

Womens Reservation Bill | త్రినేత్ర‌.న్యూస్ : మహిళా రిజర్వేషన్ల అమలు అంశంపై కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజుజు (Kiren Rijiju ) మ‌ధ్య మాట‌ల యుద్ధం చోటు చేసుకుంది. మ‌న దేశంలో మ‌హిళ‌ల‌కు త‌మ శ‌క్తిని వ‌క్తీక‌రించేందుకు వారికి అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌ని రాహుల్ పేర్కొన్నారు. మహిళలు కేవలం రాజకీయాలు, వ్యాపారాల్లో రాణించ‌డ‌మే కాకుండా.. తమ సొంత ఇళ్లలోనూ, సమాజంలోనూ ఎలాంటి భయం లేకుండా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకునే వాతావరణం ఉండాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. దేశం అభివృద్ధి చెందాలంటే మహిళలు తమ ఆలోచనలను స్వేచ్ఛగా వ్యక్తం చేయాలని, తమకు నచ్చిన రంగాల్లో ముందుకు సాగేందుకు అవకాశం ఉండాలని పేర్కొన్నారు. మహిళలు తమను తాము వ్యక్తపరచుకోలేని ఏ దేశమూ విజయం సాధించలేదని, వారి భాగస్వామ్యం లేకపోతే దేశం అసంపూర్ణంగా ఉండిపోతుందని చెప్పుకొచ్చారు. ఈ మేర‌కు ఇన్‌స్టా వేదిక‌గా ఓ వీడియో సందేశం విడుద‌ల చేశారు.

రాహుల్ మ‌న‌సు మారిన‌ట్లుందే..

రాహుల్‌ వీడియోపై కేంద్ర పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కిర‌ణ్ రిజుజు త‌న‌దైశ శైలిలో స్పందించారు. రాహుల్ మ‌న‌సు మారిన‌ట్లుందే అంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎట్ట‌కేల‌కు సానుకూల సందేశం వ‌చ్చిన‌ట్లుంది అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లుకు హ‌స్తం పార్టీ బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని ఆశిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా ట్వీట్ పెట్టారు.

మిస్ట‌ర్ రిజుజు.. ఆ విష‌యం మీకంటే ఎవ‌రికి బాగా తెలుస్తుంది..

రిజుజు ట్వీట్‌పై కాంగ్రెస్ అగ్ర‌నేత వెంట‌నే స్పందించారు. ఈ మేర‌కు కౌంట‌ర్ ఇచ్చారు. 2023లోనే కాంగ్రెస్‌ పూర్తి మద్దతుతో బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని గుర్తుచేశారు. మూడేళ్లు గడిచినా చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. "మిస్ట‌ర్ రిజుజు.. పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల మంత్రిగా ఈ విష‌యం మీకంటే బాగా ఎవ‌రికి తెలుస్తుంది..? 2023లోనే కాంగ్రెస్ పూర్తి మ‌ద్ద‌తుతో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు ఏక‌గ్రీవంగా ఆమోదం పొందింది" అని పేర్కొన్నారు. ఈ చ‌ట్టం ఆమోదం పొంది మూడేళ్లు గ‌డిచాయిన అన్నారు. అయినా ఇప్ప‌టి వ‌ర‌కూ ఎందుకు అమ‌లు చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు. అదే స‌మ‌యంలో మ‌హిళా బిల్లును డీలిమిటేష‌న్‌తో ముడిపెట్ట‌డాన్ని తీవ్రంగా ఖండించారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును ఎలాంటి ష‌ర‌తులూ లేకుండా అమ‌లు చేయాల‌ని ఈ సంద‌ర్భంగా రాహుల్ డిమాండ్ చేశారు.

Also Read..

లాయ‌ర్ ఇంట్లో రెండోసారి భారీ చోరీ.. రూ.3.15 కోట్లతో పరార్‌

భార‌త్‌పై 100 శాతం టారిఫ్‌లు.. కీల‌క బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం

బ‌స్సు బోల్తా.. ఏడుగురు మృతి

Advertisement
Advertisement