Harish Rao | 2 లక్షల ఉద్యోగాలిస్తే.. 150 హైడ్రా పోస్టుల కోసం వేలాది మంది నిలబడాల్సి వచ్చేదా?
Harish Rao | అధికారం కోసం విద్యార్థులను నిరుద్యోగులను నెత్తిన పెట్టుకున్నారని.. ఇప్పుడు ఉద్యోగం కోసం వస్తే కర్కశంగా వ్యవహరించడం దారుణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే.. ఈరోజు 150 డ్రైవర్ పోస్టుల కోసం వేలాది మంది నిరుద్యోగులు ఇలా క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చేదా? అని ప్రశ్నించారు.
- అధికారం కోసం నిరుద్యోగులను నెత్తిన పెట్టుకున్నరు.. ఉద్యోగం కోసం వస్తే కర్కశంగా వ్యవహరిస్తారా?
- ఉద్యోగం అడగడం, ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని నిలదీయడం నేరం కాదు
- నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి
- మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు డిమాండ్
Harish Rao | త్రినేత్ర.న్యూస్: అధికారం కోసం విద్యార్థులను నిరుద్యోగులను నెత్తిన పెట్టుకున్నారని.. ఇప్పుడు ఉద్యోగం కోసం వస్తే కర్కశంగా వ్యవహరించడం దారుణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే.. ఈరోజు 150 డ్రైవర్ పోస్టుల కోసం వేలాది మంది నిరుద్యోగులు ఇలా క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చేదా? అని ప్రశ్నించారు. నిరుద్యోగులపై అనుచితంగా, అసభ్యంగా మాట్లాడిన అధికారులపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. వారిని అవమానించినందుకు విద్యార్థి, నిరుద్యోగ లోకానికి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని శనివారం ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
నిరుద్యోగుల తప్పా? మీ ప్రభుత్వం తప్పా?
ఉద్యోగాలు ఇవ్వలేని ప్రభుత్వం కనీసం ఉద్యోగం కోసం వచ్చిన నిరుద్యోగులను గౌరవించడం నేర్చుకోవాలి. ఎన్నికల సమయంలో ఉద్యోగాలు ఇస్తామని హామీలు గుప్పించారు. ఇప్పుడు అదే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం రోడ్ల మీదకు వస్తే వారి పట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? హైడ్రాలో కేవలం 150 డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే వేలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు తరలివచ్చారు. ఇది నిరుద్యోగుల తప్పా? లేక ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైన మీ ప్రభుత్వం తప్పా? అని మాజీ మంత్రి నిలదీశారు.
యథా రాజా.. తథా అధికారులు..
ఇంజినీరింగ్ చదివిన విద్యార్థులను ముఖ్యమంత్రి స్థాయిలో “క్రిమినల్ వేస్ట్” అని అవమానించడం, ఉద్యోగాల కోసం వచ్చిన నిరుద్యోగులను అధికారులు దుర్భాషలాడటం చూస్తుంటే “యథా రాజా.. తథా అధికారులు” అన్న సామెత గుర్తుకొస్తోంది. అధికారుల నోటివెంట ఇలాంటి మాటలు రావడం మరింత బాధాకరం. ఉద్యోగం కోసం వచ్చిన యువతను గౌరవంగా చూడాల్సిన అధికారులు వారినే అవమానిస్తే ఇక ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తున్నట్టు? అని హరీశ్‌రావు దుయ్యబట్టారు.
యువతలో నిరాశ పెరుగుతోంది..
అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. 32 నెలలు దాటింది, ఆ హామీ ఏమైంది? నీ రెండు లక్షల ఉద్యోగాల హామీ బోగస్.. నీ జాబ్ క్యాలెండర్ బోగస్.. నిరుద్యోగులకు నువ్వు ఇచ్చిన హామీలు బోగస్. మీ పాలనలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతలో నిరాశ పెరుగుతోంది. నోటిఫికేషన్లు సక్రమంగా రాకపోవడంతో పీజీ, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్య చదివిన యువత కూడా చిన్నచిన్న పోస్టుల కోసం పోటీ పడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని ఆయన ధ్వజమెత్తారు.
ఉద్యోగాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదు. భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి ఏకంగా విద్యార్థులపైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారూ.. నిరుద్యోగులు మీపై జాలి అడగడం లేదు. మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడుగుతున్నారు. ఉద్యోగం అడగడం నేరం కాదు. ప్రశ్నించడం నేరం కాదు. ప్రభుత్వాన్ని నిలదీయడం నేరం కాదు అని హరీశ్ రావు ఫైరయ్యారు.
విద్యార్థులు, నిరుద్యోగులు అంటే మీ ప్రభుత్వానికి ఎందుకు ఇంత కక్ష రేవంత్ రెడ్డి?
అధికారం కోసం ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులను నెత్తిన పెట్టుకున్నారు. ఉద్యోగాలు ఇస్తామని హామీలు గుప్పించారు. ఇప్పుడు అదే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం రోడ్ల మీదకు వస్తే వారి పట్ల ఇంత కర్కశంగా… pic.twitter.com/pqY61bPPsI
— Harish Rao Thanneeru (@BRSHarish) August 8, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●RBI | లోన్ రికవరీ పేరుతో వేధింపులకు చెక్.. ఏజెంట్లకు ఆర్బీఐ కొత్త రూల్స్..
- ●HYDRAA | ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి.. హైడ్రా ఉద్యోగర్థుల పట్ల అధికారుల ఫైర్
- ●Lawyers House Loots | లాయర్ ఇంట్లో రెండోసారి భారీ చోరీ.. రూ.3.15 కోట్లతో పరార్
- ●పదవుల మోజు పక్కనపెట్టండి.. పునాదులు తవ్వండి: ఢిల్లీ వేదికగా కమలనాథుల నయా ‘మిషన్ 2028’!
- ●Amazon Great Freedom Sale 2026 | అమెజాన్ గ్రేట్ ఫ్రీడం సేల్ షురూ.. భారీ డిస్కౌంట్ ధరలకు ఫోన్లు..
- ●US Senate | భారత్‌పై 100 శాతం టారిఫ్‌లు.. కీలక బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం

RBI | లోన్ రికవరీ పేరుతో వేధింపులకు చెక్.. ఏజెంట్లకు ఆర్బీఐ కొత్త రూల్స్..

HYDRAA | ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి.. హైడ్రా ఉద్యోగర్థుల పట్ల అధికారుల ఫైర్

Lawyers House Loots | లాయర్ ఇంట్లో రెండోసారి భారీ చోరీ.. రూ.3.15 కోట్లతో పరార్

పదవుల మోజు పక్కనపెట్టండి.. పునాదులు తవ్వండి: ఢిల్లీ వేదికగా కమలనాథుల నయా ‘మిషన్ 2028’!





