Congress Whip | ఆ మూడురోజులు పార్లమెంట్‌కు రావాలి.. సభ్యులకు విప్ జారీ చేసిన కాంగ్రెస్
Congress Whip | వచ్చే వారం పార్లమెంట్‌లో కీలకమైన అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన ఎంపీలకు మూడు లైన్ల విప్ జారీ చేసింది. ఈ నెల 10, 11, 12 తేదీల్లో లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది.
Congress Whip | వచ్చే వారం పార్లమెంట్‌లో కీలకమైన అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన ఎంపీలకు మూడు లైన్ల విప్ జారీ చేసింది. ఈ నెల 10, 11, 12 తేదీల్లో లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ విప్ జైరామ్ రమేశ్ జారీ చేసిన విప్‌లో సభ్యులంతా ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు హాజరై.. పార్టీ వైఖరికి అనుగుణంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. లోక్‌సభలోని కాంగ్రెస్ ఎంపీలకు కూడా ఇదే తరహా మూడు లైన్ల విప్ జారీ అయ్యింది. వచ్చే వారం పార్లమెంట్‌లో కీలక బిల్లులు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నందున సభ్యుల హాజరుకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) సవరణ బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును కూడా కేంద్ర ప్రభుత్వం సభ ముందుకు తీసుకురావచ్చనే వార్తలున్నాయి. అయితే, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి వెల్లడించిన తాత్కాలిక ప్రభుత్వ కార్యక్రమాల జాబితాలో ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు, డీలిమిటేషన్‌కు సంబంధించిన బిల్లు ప్రస్తావన లేకపోవడం గమనార్హం. అయినప్పటికీ కీలక పరిణామాల నేపథ్యంలో సభ్యులందరూ సభలో అందుబాటులో ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!
సెప్టెంబర్ 22, 2026

Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. కనులపండువగా వెంకన్న బ్రహ్మోత్సవం..
సెప్టెంబర్ 22, 2026

Srimad Bhagavad Gita | మారిషస్‌లో ఆంగ్ల ‘శ్రీమద్భగవద్గీత’ ఆడియో ఆల్బమ్ ఆవిష్కరణ
సెప్టెంబర్ 22, 2026
తాజావార్తలు
- ●Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!
- ●Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. కనులపండువగా వెంకన్న బ్రహ్మోత్సవం..
- ●Srimad Bhagavad Gita | మారిషస్‌లో ఆంగ్ల ‘శ్రీమద్భగవద్గీత’ ఆడియో ఆల్బమ్ ఆవిష్కరణ
- ●Minister Damodar Rajanarsimha | రిమ్స్ అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ
- ●Brahmotsavam 2026 | కల్కి అలంకారంలో మలయప్ప స్వామి దివ్యదర్శనం.. అశ్వ వాహనంపై విహారం..!
- ●CM Revanth Reddy | తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణాలు : సీఎం రేవంత్‌రెడ్డి

Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!

Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. కనులపండువగా వెంకన్న బ్రహ్మోత్సవం..

Srimad Bhagavad Gita | మారిషస్‌లో ఆంగ్ల ‘శ్రీమద్భగవద్గీత’ ఆడియో ఆల్బమ్ ఆవిష్కరణ

Minister Damodar Rajanarsimha | రిమ్స్ అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ



