Ponnam Prabhakar | పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినప్పుడే హైదరాబాద్ ఆరోగ్యంగా ఉంటుంది
Ponnam Prabhakar | ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ప్రజలు తమ ఇళ్లలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే హైదరాబాద్ ఆరోగ్యంగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజలంతా ప్రతి శుక్రవారం ‘ఫ్రైడే–డ్రై డే’ పాటించాలని కోరారు. ఆగస్టు 11 నుంచి 21 వరకు స్పెషల్ మాన్సూన్ డ్రైవ్ లో భాగంగా IEC (ఇన్ఫర్మేషన్ , ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్) కార్యక్రమాన్ని మినిస్టర్ క్వార్టర్స్‌లో శనివారం ప్రారంభించినట్లు తెలిపారు.
- దోమల లార్వాలను గుర్తించి.. అవి పెరిగే నీటిని పారబోయండి
- ఆగస్టు 11 నుంచి 21 వరకు దోమల నివారణకు ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్
- ప్రతి శుక్రవారం ‘ఫ్రైడే–డ్రైడే’ పాటించాలి
- నగరవాసులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన
Ponnam Prabhakar | త్రినేత్ర.న్యూస్: ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ప్రజలు తమ ఇళ్లలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే హైదరాబాద్ ఆరోగ్యంగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజలంతా ప్రతి శుక్రవారం ‘ఫ్రైడే–డ్రై డే’ పాటించాలని కోరారు. ఆగస్టు 11 నుంచి 21 వరకు స్పెషల్ మాన్సూన్ డ్రైవ్ లో భాగంగా IEC (ఇన్ఫర్మేషన్ , ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్) కార్యక్రమాన్ని మినిస్టర్ క్వార్టర్స్‌లో శనివారం ప్రారంభించినట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో విస్తృత చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
ప్రజలు స్వీయ బాధ్యతతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. హైదరాబాద్ నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా జీహెచ్‌ఎంసీ ద్వారా పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇంటింటికీ వెళ్లి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రతి శుక్రవారం ‘ఫ్రైడే–డ్రైడే’ కార్యక్రమంలో భాగంగా ఇళ్లలో, పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించి దోమల లార్వాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డెంగీ వంటి వ్యాధులు రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించి తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ప్రజలు తమ ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినప్పుడే హైదరాబాద్ ఆరోగ్యంగా ఉంటుంది అని పేర్కొన్నారు.

వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమం. జీహెచ్‌ఎంసీ చేస్తున్న విజ్ఞప్తిని ప్రతి ఒక్కరూ పాటించి దోమల నివారణలో భాగస్వాములు కావాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
అంతకుముందు ఎంటమాలజీ విభాగం అధికారులు దోమల నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపడుతున్న కార్యక్రమాలను మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వివరించారు. దోమల నివారణకు ఉపయోగిస్తున్న వివిధ పరికరాలను మంత్రి పరిశీలించి, వాటి వినియోగం, పనితీరు తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. అమర్ సింగ్ నాయక్ మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ‘ఫ్రైడే–డ్రై డే’ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి IEC కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. దోమలను ఎలా నియంత్రించాలి, డెంగీ, టైఫాయిడ్, చికున్‌గున్యా వంటి వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.

ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారం ‘ఫ్రైడే–డ్రైడే’ కార్యక్రమం ద్వారా దోమల లార్వాలను గుర్తించి, అవి పెరిగే అవకాశం ఉన్న నీటి నిల్వలను తొలగించేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా అక్కడక్కడా నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను ప్రజలు వెంటనే గుర్తించి తొలగించాలని కోరారు. ఇళ్ల పరిసరాల్లో దోమల లార్వాలు కనిపిస్తే వాటిని గుర్తించి, ఆ నీటిని బయటకు పారబోయాలని సూచించారు.
ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు..
- ప్రతి శుక్రవారం ‘ఫ్రైడే–డ్రైడే’ కార్యక్రమం నిర్వహించడం
- ఇంటింటికీ వెళ్లి నీరు నిల్వ ఉండకుండా ప్రజలకు అవగాహన కల్పించడం
- దోమల లార్వాలు వృద్ధి చెందే ప్రాంతాలను గుర్తించి యాంటీ లార్వా ఆపరేషన్స్ నిర్వహించడం
- జీహెచ్‌ఎంసీ పరిధిలో విస్తృతంగా ఫాగింగ్ నిర్వహించడం
- దోమల నివారణపై కరపత్రాలను పంపిణీ చేయడం
- పాఠశాలల్లో విద్యార్థులకు దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం
- ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నిల్వ ఉన్న నీటిని తొలగించేలా ప్రజలకు సూచనలు చేయడం
కార్యక్రమంలో ఎంటమాలజీ, శానిటేషన్ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao | 2 లక్షల ఉద్యోగాలిస్తే.. 150 హైడ్రా పోస్టుల కోసం వేలాది మంది నిలబడాల్సి వచ్చేదా?
ఆగస్టు 8, 2026

HYDRAA | ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి.. హైడ్రా ఉద్యోగర్థుల పట్ల అధికారుల ఫైర్
ఆగస్టు 8, 2026

Wine Shops | మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రేపు వైన్ షాపులు బంద్
ఆగస్టు 8, 2026
తాజావార్తలు
- ●Womens Reservation Bill | మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాహుల్ Vs రిజుజు.. ఎక్స్ వేదికగా మాటల యుద్ధం
- ●RBI | లోన్ రికవరీ పేరుతో వేధింపులకు చెక్.. ఏజెంట్లకు ఆర్బీఐ కొత్త రూల్స్..
- ●Harish Rao | 2 లక్షల ఉద్యోగాలిస్తే.. 150 హైడ్రా పోస్టుల కోసం వేలాది మంది నిలబడాల్సి వచ్చేదా?
- ●HYDRAA | ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి.. హైడ్రా ఉద్యోగర్థుల పట్ల అధికారుల ఫైర్
- ●Lawyers House Loots | లాయర్ ఇంట్లో రెండోసారి భారీ చోరీ.. రూ.3.15 కోట్లతో పరార్
- ●పదవుల మోజు పక్కనపెట్టండి.. పునాదులు తవ్వండి: ఢిల్లీ వేదికగా కమలనాథుల నయా ‘మిషన్ 2028’!

Womens Reservation Bill | మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాహుల్ Vs రిజుజు.. ఎక్స్ వేదికగా మాటల యుద్ధం

RBI | లోన్ రికవరీ పేరుతో వేధింపులకు చెక్.. ఏజెంట్లకు ఆర్బీఐ కొత్త రూల్స్..

Harish Rao | 2 లక్షల ఉద్యోగాలిస్తే.. 150 హైడ్రా పోస్టుల కోసం వేలాది మంది నిలబడాల్సి వచ్చేదా?

HYDRAA | ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి.. హైడ్రా ఉద్యోగర్థుల పట్ల అధికారుల ఫైర్



