RBI | లోన్ రికవరీ పేరుతో వేధింపులకు చెక్.. ఏజెంట్లకు ఆర్‌బీఐ కొత్త రూల్స్..
RBI | భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) రుణాల రికవరీ, రికవరీ ఏజెంట్ల నియామకానికి సంబంధించిన సవరించిన మార్గదర్శకాల అమలు గడువును మరోసారి పొడిగించింది. తొలుత అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించిన ఈ నిబంధనలు ఇప్పుడు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది.
RBI | భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) రుణాల రికవరీ, రికవరీ ఏజెంట్ల నియామకానికి సంబంధించిన సవరించిన మార్గదర్శకాల అమలు గడువును మరోసారి పొడిగించింది. తొలుత అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించిన ఈ నిబంధనలు ఇప్పుడు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. రికవరీ ఏజెంట్లకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (ఐఐబీఎఫ్) ధ్రువీకరణ తప్పనిసరి చేసే నిబంధన పరిధిలో ఇప్పటివరకు లేని నియంత్రిత సంస్థలకు (రెగ్యులేటెడ్ ఎంటిటీస్) ఒక సంవత్సరం గడువు ఇచ్చింది. ఈ కాలంలో తమ రికవరీ ఏజెంట్లకు ఐఐబీఎఫ్ సర్టిఫికేషన్ పూర్తి చేయించాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఈ మార్పులు ముసాయిదా మార్గదర్శకాలపై వివిధ వర్గాల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిశీలించిన తర్వాత తీసుకున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. కొత్త నిబంధనలను అమలు చేయడానికి అవసరమైన సాంకేతిక, కార్యాచరణ మార్పులు, వ్యవస్థల అప్‌డేట్‌లు, రికవరీ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వడానికి మరింత సమయం అవసరమని రుణదాతలు సూచించడంతో అమలు తేదీని పొడిగించినట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం కొత్త మార్గదర్శకాల అమలు సాఫీగా జరిగేందుకు సహాయపడుతుందని పేర్కొంది.
సర్టిఫికేషన్ తప్పనిసరి..
అయితే కొత్తగా నియమించే రికవరీ ఏజెంట్ల విషయంలో సర్టిఫికేషన్ నిబంధనలో ఎలాంటి సడలింపు ఇవ్వలేదు. రికవరీ ఏజెంట్లు విధుల్లో చేరిన తర్వాత ఐఐబీఎఫ్ సర్టిఫికేషన్ పొందేలా అనుమతించాలని వచ్చిన సూచనలను ఆర్‌బీఐ తిరస్కరించింది. రుణగ్రహీతలతో మాట్లాడే ముందు రికవరీ ఏజెంట్లకు అవసరమైన పరిజ్ఞానం ఉండాలనే ఉద్దేశంతో ఈ నిబంధనను తీసుకొచ్చినట్లు తెలిపింది. సరైన శిక్షణ లేదా సర్టిఫికేషన్ లేని వ్యక్తులు రుణగ్రహీతలతో వ్యవహరిస్తే వారికి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుందని ఆర్‌బీఐ అభిప్రాయపడింది. ఈ మార్గదర్శకాలు రికవరీ పనులు చేసే బ్యాంకు లేదా సంస్థల సొంత ఉద్యోగులకు, క్రమం తప్పకుండా ఈఎంఐలు వసూలు చేసే ఏజెంట్లకు, అలాగే నోటీసులు జారీ చేయడం లేదా కోర్టుల్లో ప్రాతినిధ్యం వహించడం వంటి సేవలు అందించే న్యాయ సంస్థలకు వర్తించవని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. వీరు సాధారణంగా రుణగ్రహీతలతో ప్రత్యక్షంగా వ్యవహరించరని పేర్కొంది.
మొబైల్ లాకింగ్‌పై కీలక మార్పులు..
ఇక రుణంతో కొనుగోలు చేసిన మొబైల్ పరికరాలపై సాంకేతిక పరిమితుల విషయంలోనూ ఆర్‌బీఐ కీలక మార్పులు చేసింది. పరికరాన్ని లాక్ చేసే విధానం ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీ సంస్థ లేదా ఆపరేటింగ్ సిస్టమ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ధ్రువీకరించాలని వచ్చిన సూచనను ఆమోదించింది. అలాగే విధించే పరిమితులు రుణగ్రహీత ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలకు ఆటంకం కలిగించకుండా ఉండేలా నిబంధనలు చేర్చింది. పరికరాన్ని తప్పుగా పరిమితం చేసినా లేదా సాధారణ స్థితికి తీసుకురావడంలో ఆలస్యం జరిగినా చెల్లించాల్సిన పరిహారం గరిష్టంగా మంజూరైన రుణ మొత్తానికి మాత్రమే పరిమితమవుతుందని స్పష్టం చేసింది. అలాగే ముసాయిదాలో ఉన్న క్యూరింగ్ ఆఫ్ డిఫాల్ట్ అనే పదానికి రుణదాత బకాయిలను పూర్తిగా వసూలు చేయడమే అర్థమని స్పష్టత ఇచ్చింది.

60 రోజులు దాటితేనే పరిమితులు..
మొబైల్ పరికరాలపై పరిమితులు విధించే విధానంలో కూడా దశలవారీ విధానాన్ని అనుసరించాలని ఆర్‌బీఐ పేర్కొంది. రుణం గడువు దాటి 30 రోజులు పూర్తయి, నోటీసులు ఇచ్చినప్పటికీ చెల్లింపు జరగనప్పుడే పరిమితుల ప్రక్రియ ప్రారంభించవచ్చని తెలిపింది. పూర్తి స్థాయి పరిమితులు మాత్రం రుణం గడువు దాటి 60 రోజులు అయిన తర్వాత మాత్రమే అమలు చేయాలని పేర్కొంది. ప్రారంభంలోనే పూర్తిగా పరికరాన్ని నిలిపివేయకుండా క్రమంగా పరిమితులు విధించాలని సూచించింది. అలాగే ఇన్‌కమింగ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, అత్యవసర ఎస్‌వోఎస్ వంటి కీలక సేవలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయకూడదని స్పష్టం చేసింది. రికవరీ ఏజెంట్ల ధ్రువీకరణకు సంబంధించిన నిబంధనల్లో కూడా మార్పులు చేసింది. రికవరీ ఏజెంట్ల గత చరిత్రను (యాంటిసిడెంట్ వెరిఫికేషన్) నియంత్రిత సంస్థ లేదా రికవరీ ఏజెన్సీ ఏదైనా నిర్వహించేందుకు అనుమతించింది.
రికవరీ ఏజెన్సీల వివరాలను చెప్పాల్సిందే..
అలాగే ప్రతి వ్యక్తిగత రికవరీ ఏజెంట్ వివరాలను వెబ్‌సైట్‌లో ప్రచురించాలన్న ప్రతిపాదనను ఆర్‌బీఐ ఉపసంహరించుకుంది. ఈ విభాగంలో ఉద్యోగుల మార్పిడి ఎక్కువగా ఉండటంతో కార్యాచరణ పరమైన ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంది. అయితే గుర్తింపు పొందిన రికవరీ ఏజెన్సీల వివరాలను మాత్రం రుణదాతలు తమ వెబ్‌సైట్‌లో ప్రచురించాల్సిందేనని, ఏ మార్పు జరిగినా ఏడు క్యాలెండర్ రోజులలోపు జాబితాను అప్ చేయాలని ఆదేశించింది. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం కింద అమలు చేసే రుణాల నుంచి కాంట్రాక్టు ఆధారిత స్వాధీనం నిబంధనలను మినహాయించాలని వచ్చిన సూచనలను కూడా ఆర్‌బీఐ తిరస్కరించింది. ఈ నిబంధనలు ఇప్పటికే ఉన్న చట్టపరమైన వ్యవస్థకు అనుబంధంగా పనిచేస్తాయని, భద్రతా ఆస్తి స్వాధీనం వంటి కీలక అంశాలు రుణ ఒప్పందాల్లో స్పష్టంగా ఉండి రుణగ్రహీతలకు ముందుగానే తెలియజేయాలనే ఉద్దేశంతో వాటిని కొనసాగిస్తున్నట్లు వివరించింది.
సంబంధిత వార్తలు

UPI | యూపీఐ ఖర్చులను ఎవరు చెల్లించాలి.. పేమెంట్స్ కౌన్సిల్ ఏం చెప్పింది..?
ఆగస్టు 8, 2026

Stock Markets | చమురు ధరల ఆందోళనతో కుదేలైన మార్కెట్లు.. సెన్సెక్స్, నిఫ్టీ మళ్లీ నష్టాల్లో..
ఆగస్టు 7, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి.. స్వల్ప లాభాల్లో ముగిసిన సూచీలు..
ఆగస్టు 6, 2026
తాజావార్తలు
- ●Harish Rao | 2 లక్షల ఉద్యోగాలిస్తే.. 150 హైడ్రా పోస్టుల కోసం వేలాది మంది నిలబడాల్సి వచ్చేదా?
- ●HYDRAA | ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి.. హైడ్రా ఉద్యోగర్థుల పట్ల అధికారుల ఫైర్
- ●Lawyers House Loots | లాయర్ ఇంట్లో రెండోసారి భారీ చోరీ.. రూ.3.15 కోట్లతో పరార్
- ●పదవుల మోజు పక్కనపెట్టండి.. పునాదులు తవ్వండి: ఢిల్లీ వేదికగా కమలనాథుల నయా ‘మిషన్ 2028’!
- ●Amazon Great Freedom Sale 2026 | అమెజాన్ గ్రేట్ ఫ్రీడం సేల్ షురూ.. భారీ డిస్కౌంట్ ధరలకు ఫోన్లు..
- ●US Senate | భారత్‌పై 100 శాతం టారిఫ్‌లు.. కీలక బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం

Harish Rao | 2 లక్షల ఉద్యోగాలిస్తే.. 150 హైడ్రా పోస్టుల కోసం వేలాది మంది నిలబడాల్సి వచ్చేదా?

HYDRAA | ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి.. హైడ్రా ఉద్యోగర్థుల పట్ల అధికారుల ఫైర్

Lawyers House Loots | లాయర్ ఇంట్లో రెండోసారి భారీ చోరీ.. రూ.3.15 కోట్లతో పరార్

పదవుల మోజు పక్కనపెట్టండి.. పునాదులు తవ్వండి: ఢిల్లీ వేదికగా కమలనాథుల నయా ‘మిషన్ 2028’!



