త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HYDRAA | ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి.. హైడ్రా ఉద్యోగ‌ర్థుల ప‌ట్ల అధికారుల ఫైర్‌

HYDRAA | హైడ్రా (HYDRAA) ఉద్యోగాల కోసం భారీగా త‌ర‌లివ‌చ్చిన నిరుద్యోగుల ప‌ట్ల అధికారులు దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. 150 డీఆర్ఎఫ్ అసిస్టెంట్‌, డ్రైవ‌ర్ పోస్టుల భ‌ర్తీకి హైడ్రా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ (HYDRAA Recruitment Drive) చేప‌ట్టింది.

G

Telangana | Published On Aug 8, 2026, 12.43 pm IST

HYDRAA | ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి.. హైడ్రా ఉద్యోగ‌ర్థుల ప‌ట్ల అధికారుల ఫైర్‌
Advertisement

HYDRAA | త్రినేత్ర‌.న్యూస్‌: హైడ్రా (HYDRAA) ఉద్యోగాల కోసం భారీగా త‌ర‌లివ‌చ్చిన నిరుద్యోగుల ప‌ట్ల అధికారులు దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. 150 డీఆర్ఎఫ్ అసిస్టెంట్‌, డ్రైవ‌ర్ పోస్టుల భ‌ర్తీకి హైడ్రా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ (HYDRAA Recruitment Drive) చేప‌ట్టింది. హైద‌రాబాద్ స‌రూర్‌న‌గ‌ర్ స్టేడియంలో ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ ప‌రీక్ష నిర్వ‌హిస్తున్న‌ది. సుమారు 6 వేల మంది వ‌ర‌కు నిరుద్యోగులు త‌ర‌లివ‌చ్చారు. దీంతో స్టేడియం వ‌ద్ద స్వ‌ల్ప ఉద్రిక్త‌త నెల‌కొంది. పోలీసులు అభ్య‌ర్థుల‌కు టోకెట్లు ఇవ్వ‌డంతో నంబ‌ర్ ప్ర‌కారం ఈవెంట్ నిర్వ‌హిస్తున్నారు. ఈక్ర‌మంలో అభ్య‌ర్థుల‌తో అధికారులు దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తిస్తామంటూ పరుష వ్యాఖ్య‌లు చేశారు.

6 వేల మందికి ఈవెంట్లు ఎట్ల నిర్వ‌హిస్తార‌ని ప్ర‌శ్నించారు. టోకెన్లు ఉన్న‌వారే ఇక్క‌డ ఉంటార‌ని, లేనివారు వెళ్లాలంటూ స్ప‌ష్టం చేశారు. మ‌ర్యాద చెబితే అర్ధం చేసుకోరం అంటూ చెప్పారు.

Advertisement
Advertisement