Adobe | ఇక చాట్ జీపీటీలో ఫొటోషాప్.. అడోబ్ కొత్త ప్లగిన్.. ఎలా ఉపయోగించాలంటే..?
Adobe | ఫొటోషాప్‌ను ఇప్పటి వరకు యాప్ రూపంలో వాడుతూ వచ్చిన యూజర్లకు టెక్ సంస్థ అడోబ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఫొటోషాప్‌ను చాట్ జీపీటీ ఏఐ ప్లాట్‌ఫామ్‌లోనూ ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు అడోబ్ సంస్థ కొత్త ప్లగిన్‌ను లాంచ్ చేసింది. చాట్ జీపీటీ సంభాషణల్లోనే నేరుగా ఈ సదుపాయాన్ని యూజర్లు పొందవచ్చు.
Technology | Published On Aug 8, 2026, 1.36 pm IST
Adobe | ఫొటోషాప్‌ను ఇప్పటి వరకు యాప్ రూపంలో వాడుతూ వచ్చిన యూజర్లకు టెక్ సంస్థ అడోబ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఫొటోషాప్‌ను చాట్ జీపీటీ ఏఐ ప్లాట్‌ఫామ్‌లోనూ ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు అడోబ్ సంస్థ కొత్త ప్లగిన్‌ను లాంచ్ చేసింది. చాట్ జీపీటీ సంభాషణల్లోనే నేరుగా ఈ సదుపాయాన్ని యూజర్లు పొందవచ్చు. దీంతో ఫొటోల క్రియేషన్, ఎడిటింగ్ మరింత సులభతరం అవుతుంది. అలాగే పలు పీడీఎఫ్ టూల్స్‌ను కూడా అందించింది. దీని వల్ల పీడీఎఫ్ డాక్యుమెంట్లను క్రియేట్ చేయడంతోపాటు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. చాట్ జీపీటీలోని చాట్‌లలోనే నేరుగా ఫొటోలు, వీడియోలు, డిజైన్లు, డాక్యుమెంట్లను క్రియేట్ చేసేలా అడోబ్ ఈ కొత్త ప్లగిన్‌ను అందుబాటులోకి తెచ్చింది.
70కి పైగా టూల్స్ ఒకే ప్లగిన్‌లో..
ఈ అడోబ్ ప్లగిన్ చాట్‌జీపీటీ వర్క్, కోడెక్స్‌లో పనిచేస్తుంది. అడోబ్ క్రియేటివ్, ప్రొడక్టివిటీ సూట్‌లలోని 70కిపైగా టూల్స్‌ను ఒకే ప్లగిన్‌లో అందిస్తుంది. అడోబ్ ఎక్స్‌ప్రెస్, ఫొటోషాప్, ఫైర్‌ఫ్లై, ప్రీమియర్, అక్రోబాట్, లైట్‌రూమ్, ఇలస్ట్రేటర్, ఇన్‌డిజైన్, అడోబ్ స్టాక్‌తోపాటు ఇతర అడోబ్ సేవలు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. వినియోగదారులు అడోబ్ ప్లగిన్‌ను యాక్టివేట్ చేసి తమ అవసరాన్ని వివరించగానే, దానికి అనుగుణంగా అవసరమైన అడోబ్ టూల్స్‌ను ప్లగిన్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆటోమేటిక్‌గా ఎంపిక చేస్తుంది. ఫొటోలను ఎడిట్ చేయడం, ప్రచార వీడియోలు రూపొందించడం, మార్కెటింగ్ మెటీరియల్ డిజైన్ చేయడం, పీడీఎఫ్‌లు క్రియేట్ చేయడం వంటి పనులను ఇది నిర్వహిస్తుంది. మరింత అధునాతన ఎడిటింగ్, క్రియేటివ్ కంట్రోల్ లేదా సూక్ష్మ మార్పులు అవసరమైతే, వినియోగదారులు తమ పనిని ఆయా యాప్‌లలో కొనసాగించవచ్చు.
అనేక రకాల డాక్యుమెంట్లకు మద్దతు..
ఈ అడోబ్ ప్లగిన్ అనేక రకాల క్రియేటివ్, డాక్యుమెంట్ వర్క్‌ఫ్లోలకు మద్దతు ఇస్తుంది. ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను అప్‌లోడ్ చేసి, కావాల్సిన స్టైల్‌ను వివరించగానే మొత్తం ఫొటో సెట్‌కు ఒకే విధమైన లుక్‌ను అందిస్తుంది. పూర్తయిన ఫైళ్లను క్రియేటివ్ క్లౌడ్‌లో సేవ్ చేసి, ఎంపిక చేసిన చిత్రాలను ఉత్పత్తి లేదా ప్యాకేజింగ్ మాక్‌అప్‌లుగా కూడా మారుస్తుంది. వీడియోల విషయంలో ఎక్కువ నిడిని ఉన్న వీడియోలను హైలైట్ రీల్స్‌గా మార్చి, వాటిని యూట్యూబ్ షార్ట్స్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు అనుగుణంగా రూపొందిస్తుంది. డిజైన్‌ల కోసం వేల సంఖ్యలో అందుబాటులో ఉన్న టెంప్లేట్‌లను ఇంటరాక్టివ్ ప్రివ్యూలతో చూపిస్తుంది. వినియోగదారులు తమకు నచ్చిన టెంప్లేట్‌ను ఎంచుకుని, అందులోని టెక్స్ట్, రంగులను మార్చడం, సోషల్ మీడియా కోసం యానిమేషన్‌లు జోడించడం, చివరకు వాటిని షేర్ చేయడానికి లేదా ప్రింట్ చేయడానికి సిద్ధంగా ఉండే పీడీఎఫ్‌లుగా మార్చుకోవచ్చు.

అవసరం అయితే యాప్‌కు మారవచ్చు..
డాక్యుమెంట్ క్రియేషన్ లో స్ప్రెడ్‌షీట్ లేదా డేటాసెట్‌ను అప్‌లోడ్ చేసి కావాల్సిన ఫలితాన్ని వివరిస్తే, ఆ సమాచారాన్ని ఈ ప్లగిన్ ఫార్మాట్ చేసిన పీడీఎఫ్‌లుగా మారుస్తుంది. ఈవెంట్ బ్యాడ్జ్‌లు, క్యాటలాగ్‌లు, ఇన్ఫోగ్రాఫిక్‌లు తదితర డాక్యుమెంట్లను కూడా సృష్టిస్తుంది. ఈ ప్లగిన్‌లో అడోబ్ గతంలో విడుదల చేసిన చాట్‌జీపీటీ యాప్‌ల సామర్థ్యాలతో పాటు అడోబ్ ఎక్స్‌ప్రెస్, ఫొటోషాప్, ఫైర్‌ఫ్లై, ప్రీమియర్, అక్రోబాట్, లైట్‌రూమ్, ఇలస్ట్రేటర్, ఇన్‌డిజైన్, అడోబ్ స్టాక్ వంటి సేవల ఫీచర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అడోబ్ ఈ సందర్భంగా స్పందిస్తూ.. తమ యాప్‌లలోని ఏఐ ఏజెంట్లకు శక్తినిచ్చే అదే టూల్స్, సామర్థ్యాలను ఈ ప్లగిన్ కూడా ఉపయోగిస్తుందని తెలిపింది. వినియోగదారులు తమ ప్రాజెక్ట్‌ను చాట్‌జీపీటీలో ప్రారంభించి, అవసరమైనప్పుడు అధునాతన ఎడిటింగ్ కోసం అడోబ్ అప్లికేషన్‌లకు మారవచ్చని స్పష్టం చేసింది. చాట్‌జీపీటీతో పాటు క్లాడ్, కోపైలట్ వంటి ఏఐ చాట్‌బాట్ ప్లాట్‌ఫామ్‌లకు కూడా అడోబ్ తన టూల్స్‌ను విస్తరించినున్నట్లు తెలిపింది. భవిష్యత్తులో స్లాక్, జెమిని ఇంటిగ్రేషన్‌లను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.
ఎలా చేయాలి..
వినియోగదారులు చాట్‌జీపీటీలో అడోబ్ ప్లగిన్ సహాయంతో ఉత్పత్తి ఫొటోలను ఒకేసారి బ్యాచ్ ఎడిట్ చేసి, తర్వాత ప్రధాన చిత్రాన్ని ఫొటోషాప్‌లో తెరిచి వివిధ క్రియేటివ్ మార్పులు చేయడం, అనేక అసెట్‌లను కలపడం, లేయర్లు, మాస్క్‌లతో డిటెయిల్స్ ను మెరుగుపరచడం, తదుపరి ఎడిటింగ్‌ను పూర్తి చేయడం చేయవచ్చు. చాట్‌జీపీటీలో అడోబ్ ప్లగిన్‌ను ఉపయోగించాలంటే ముందుగా ప్లగిన్స్ విభాగానికి వెళ్లి అడోబ్ ప్లగిన్‌ను సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత కొత్త చాట్ ప్రారంభించి @Adobe అని టైప్ చేసి మెనూలో నుంచి అడోబ్‌ను ఎంపిక చేయాలి. లేదా + (ప్లస్) బటన్ ద్వారా ఇన్‌స్టాల్ చేసిన ప్లగిన్‌ల జాబితాలో నుంచి అడోబ్‌ను ఎంచుకోవచ్చు. వినియోగదారులు గెస్ట్‌గా కూడా అనేక అడోబ్ టూల్స్‌తో పనిని ప్రారంభించవచ్చు. అయితే అడోబ్ ఖాతాతో సైన్ ఇన్ చేస్తే క్రియేటివ్ క్లౌడ్ ఫైళ్ల యాక్సెస్, జనరేటివ్ ఏఐ ఫీచర్లు, వివిధ సెషన్‌లలో పనిని సేవ్ చేసుకునే సౌకర్యం వంటి అదనపు ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. అడోబ్ ప్లగిన్ చాట్‌జీపీటీ వెబ్ వెర్షన్‌తో పాటు చాట్‌జీపీటీ యాప్‌లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. వినియోగదారుల వినియోగాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని క్రియేటివ్, ప్రొడక్టివిటీ టూల్స్, కొత్త ప్రాసెసింగ్ పవర్ లను ఈ ప్లగిన్‌లో అందించనున్నట్లు అడోబ్ వెల్లడించింది.
సంబంధిత వార్తలు

OpenAI | చాట్‌జీపీటీ వాయిస్‌లో భారీ అప్డేట్.. ఇక మనిషిలా మాట్లాడే కొత్త మోడళ్లు..
జులై 11, 2026

Adobe | అడోబ్ క్రియేటివ్ క్లౌడ్‌కు భారీ అప్డేట్.. ఫోటో, వీడియో ఎడిటింగ్‌లో శక్తివంతమైన ఏఐ ఫీచర్లు..
జూన్ 17, 2026

ChatGPT | చాట్‌జీపీటీ ధరలు భారీగా తగ్గనున్నాయా? ఏఐ పోటీలో ఓపెన్ఏఐ కొత్త వ్యూహం..
జూన్ 13, 2026
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినప్పుడే హైదరాబాద్ ఆరోగ్యంగా ఉంటుంది
- ●Womens Reservation Bill | మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాహుల్ Vs రిజుజు.. ఎక్స్ వేదికగా మాటల యుద్ధం
- ●RBI | లోన్ రికవరీ పేరుతో వేధింపులకు చెక్.. ఏజెంట్లకు ఆర్బీఐ కొత్త రూల్స్..
- ●Harish Rao | 2 లక్షల ఉద్యోగాలిస్తే.. 150 హైడ్రా పోస్టుల కోసం వేలాది మంది నిలబడాల్సి వచ్చేదా?
- ●HYDRAA | ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి.. హైడ్రా ఉద్యోగర్థుల పట్ల అధికారుల ఫైర్
- ●Lawyers House Loots | లాయర్ ఇంట్లో రెండోసారి భారీ చోరీ.. రూ.3.15 కోట్లతో పరార్

Ponnam Prabhakar | పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినప్పుడే హైదరాబాద్ ఆరోగ్యంగా ఉంటుంది

Womens Reservation Bill | మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాహుల్ Vs రిజుజు.. ఎక్స్ వేదికగా మాటల యుద్ధం

RBI | లోన్ రికవరీ పేరుతో వేధింపులకు చెక్.. ఏజెంట్లకు ఆర్బీఐ కొత్త రూల్స్..

Harish Rao | 2 లక్షల ఉద్యోగాలిస్తే.. 150 హైడ్రా పోస్టుల కోసం వేలాది మంది నిలబడాల్సి వచ్చేదా?



