Lawyers House Loots | లాయర్ ఇంట్లో రెండోసారి భారీ చోరీ.. రూ.3.15 కోట్లతో పరార్
Lawyers House Loots | హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర (Kurukshetra)లో ఓ లాయర్ ఇంట్లో భారీ చోరీ తీవ్ర కలకలం (Lawyers House Loots) రేపింది. నలుగురు ముసుగు దొంగలు సీనియర్ అడ్వొకేట్ ఇంట్లోకి చొరబడి రూ.3.15 కోట్ల విలువైన నగదు, బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.
Lawyers House Loots | హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర (Kurukshetra)లో ఓ లాయర్ ఇంట్లో భారీ చోరీ తీవ్ర కలకలం (Lawyers House Loots) రేపింది. నలుగురు ముసుగు దొంగలు సీనియర్ అడ్వొకేట్ ఇంట్లోకి చొరబడి భారీగా నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఆ దొంగలు న్యాయవాది ఇంట్లో దొంగతనానికి పాల్పడటం ఇది రెండోసారి కావడం గమనార్హం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 10 గంటల సమయంలో మాస్కులు ధరించిన నలుగురు వ్యక్తులు కురుక్షేత్రలోని సీనియర్ న్యాయవాది బల్వంత్ సింగ్ వాలియా ఇంట్లోకి చొరబడ్డారు. ఆ సమయంలో లాయర్ ఇంట్లో లేరు. ఆయన భార్యను దుండగులు కాళ్లు, చేతులు కట్టేసి బంధించారు. అదే సమయంలో ఇంటికి వచ్చిన లాయర్‌ను కూడా తీవ్రంగా కొట్టి బంధించారు. డిజీ సేఫ్ లాకర్ తాళాలు ఇవ్వాలంటూ బెదిరించారు. దీంతో భయపడిపోయిన సదరు లాయర్ లాకర్ తాళాలు ఇచ్చేశాడు.
దీంతో దుండగులు అందులోని రూ. 17-20 లక్షల నగదు, 2 కేజీల బంగారు ఆభరణాలు, సుమారు 4 కిలోల వెండి ఆభరణాలు, విగ్రహాలు, లైసెన్స్ రివాల్వర్, కాట్రిడ్జ్‌లు, ఇతర విలువైన వస్తువులను దోచుకున్నారు. వెళ్తూ వెళ్తూ మరో రూ.80 లక్షలు కావాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన దొంగతం కూడా తామే చేసినట్లు దొంగలు లాయర్‌కు చెప్పారు. ఈ విషయం పోలీసులకు చెబితే చంపేస్తామంటూ బెదిరించారు. సీసీటీవీలను కూడా ధ్వంసం చేశారు. మళ్లీ వస్తాం అంటూ బెదిరించి అక్కడి నుంచి పారిపోయారు. ఈ విషయంపై సదరు లాయర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన వస్తువులు, బంగారం విలువ సుమారు రూ.3.15 కోట్ల వరకూ ఉంటుందని చెప్పారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read..
భారత్‌పై 100 శాతం టారిఫ్‌లు.. కీలక బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం
కార్పొరేషన్ సమరమే టార్గెట్.. 2028లో అధికార పీఠమే అల్టిమేట్ గోల్ : తెలంగాణలో బీజేపీ సరికొత్త ఆపరేషన్!
సంబంధిత వార్తలు

VC Sajjanar | ఎటు పోతున్నది ఈ సమాజం?.. మానవత్వానికే మచ్చతెచ్చే ఇలాంటి సంస్కృతి మారాలి: సీపీ సజ్జనర్
ఆగస్టు 6, 2026

Faridabad Teacher | 30 సెకన్లలో 34 కత్తిపోట్లు.. స్కూల్ టీచర్‌పై వ్యక్తి పైశాచిక దాడి
ఆగస్టు 4, 2026

Haryana | స్కూల్లో మొబైల్ ఫోన్ నిషేధం.. టీచర్‌పై స్క్రూడ్రైవర్‌తో దాడి
జులై 21, 2026
తాజావార్తలు
- ●పదవుల మోజు పక్కనపెట్టండి.. పునాదులు తవ్వండి: ఢిల్లీ వేదికగా కమలనాథుల నయా ‘మిషన్ 2028’!
- ●Amazon Great Freedom Sale 2026 | అమెజాన్ గ్రేట్ ఫ్రీడం సేల్ షురూ.. భారీ డిస్కౌంట్ ధరలకు ఫోన్లు..
- ●US Senate | భారత్‌పై 100 శాతం టారిఫ్‌లు.. కీలక బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం
- ●HYDRAA | హైడ్రా రిక్రూట్మెంట్కు పోటెత్తిన యువత.. సరూర్‌నగర్ స్టేడియం వద్ద ఉద్రిక్తత
- ●Road Accident | బస్సు బోల్తా.. ఏడుగురు మృతి
- ●Niharika Konidela | బంగారు బోనం ఎత్తిన మెగా డాటర్ నిహారిక కొణిదెల

పదవుల మోజు పక్కనపెట్టండి.. పునాదులు తవ్వండి: ఢిల్లీ వేదికగా కమలనాథుల నయా ‘మిషన్ 2028’!

Amazon Great Freedom Sale 2026 | అమెజాన్ గ్రేట్ ఫ్రీడం సేల్ షురూ.. భారీ డిస్కౌంట్ ధరలకు ఫోన్లు..

US Senate | భారత్‌పై 100 శాతం టారిఫ్‌లు.. కీలక బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం

HYDRAA | హైడ్రా రిక్రూట్మెంట్కు పోటెత్తిన యువత.. సరూర్‌నగర్ స్టేడియం వద్ద ఉద్రిక్తత



