HIV Cases | అస్సాం జైళ్లలో హెచ్ఐవీ కలకలం.. 4 నెలల్లో 200 మందికి పాజిటివ్
HIV Cases | అస్సాం జైళ్లలో హెచ్ఐవీ కేసులు అసాధారణ రీతిలో పెరుగుతున్నాయి. గత నాలుగు నెలల్లో నిర్వహించిన సాధారణ ఆరోగ్య పరీక్షల్లో 31 జైళ్లలో మొత్తం 226 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్‌గా (HIV-positive) నిర్ధారణ అయింది.
HIV Cases | త్రినేత్ర.న్యూస్ : అస్సాం జైళ్లలో హెచ్ఐవీ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ జైళ్లలో భారీ సంఖ్యలో ఖైదీలు హెచ్ఐవీ (HIV) బారిన పడటం కలకలం రేపుతోంది. గత నాలుగు నెలల్లో నిర్వహించిన సాధారణ ఆరోగ్య పరీక్షల్లో 31 జైళ్లలో మొత్తం 226 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్‌గా (HIV-positive) నిర్ధారణ అయింది.
అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 31 జైళ్లలో ఖైదీలకు హెచ్‌ఐవీ స్క్రీనింగ్ నిర్వహించగా, ఏప్రిల్-జులై మధ్య కాలంలో గుర్తించిన కేసుల్లో సుమారు 95 శాతం కేసులు ఇంట్రావీనస్ డ్రగ్ యూజ్ (ఇంజెక్షన్ ద్వారా మాదకద్రవ్యాలు తీసుకోవడం) వల్లే సోకినట్లు తేలింది. రాష్ట్రంలోని మొత్తం 226 మంది హెచ్‌ఐవీ పాజిటివ్ ఖైదీల్లో 202 మంది యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ART) పొందుతున్నారు.
శ్రీభూమి జిల్లా జైలులో గత వారం హెచ్‌ఐవీ సోకిన ఖైదీల సంఖ్య భారీగా పెరిగింది. జైలు అధికారుల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఈ జైలులో 445 మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో ఏకంగా 11 మందికి హెచ్ఐవీ సోకినట్లు తేలింది. వీరిలో ఎక్కువ మంది మత్తుపదార్థాల కేసుతో సంబంధం ఉన్నవారేనని జైలు అధికారులు తెలిపారు. బాధితుల్లో ఒకరు మహిళా ఖైదీ ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఈ జైలు అధికారిక సామర్థ్యం 187 మంది మాత్రమే అయినప్పటికీ.. ప్రస్తుతం అక్కడ 445 మంది ఖైదీలను ఉంచడం గమనార్హం. ఫలితంగా జైలులో ఓవర్‌క్రౌడింగ్ సమస్య మరోసారి చర్చనీయాంశంగా మారింది.
అస్సాం జైళ్లలో ఖైదీలకు హెచ్ఐవీ సోకడం పట్ల ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (CM Himanta Biswa Sarma) స్పందించారు. ఈ ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిపారు. జైలులో ఉన్న సమయంలో ఇన్ఫెక్షన్ ఎలా సోకిందనే దానిపై వివరంగా విచారణ జరుపుతామని సీఎం స్పష్టం చేశారు.
Also Read..
బాబర్ పుట్టిన దేశం నుంచే ప్రధానికి అత్యున్నత పురస్కారం.. సంఘ్ సభ్యులు ఆలోచించుకోండి : ఒవైసీ
నేపాల్ వరదల్లో హైదరాబాద్ మహిళ గల్లంతు.. అమెరికా నుంచి ఇండియాకు భర్త
తాజావార్తలు
- ●Nepal Floods | నేపాల్ వరదల్లో హైదరాబాద్ మహిళ గల్లంతు.. అమెరికా నుంచి ఇండియాకు భర్త
- ●RS Praveen Kumar | రేవంత్ మీద మీకున్న నమ్మకం నిజంగా సూపర్.. సీతక్క గారు
- ●Stock Markets | అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- ●Musi River Rejuvenation | మూసీకి జీవం.. జంట జలాశయాలకు గోదావరి జలాలు
- ●Nurse Murdered case | అత్యాచారాన్ని అడ్డుకోబోయిన నర్సు.. అయినా దారుణ హత్య
- ●Harish Rao | కృష్ణా జలాల తరలింపుపై రేవంత్ మౌనం.. తెలంగాణకు తీరని ద్రోహం : హరీశ్‌రావు

Nepal Floods | నేపాల్ వరదల్లో హైదరాబాద్ మహిళ గల్లంతు.. అమెరికా నుంచి ఇండియాకు భర్త

RS Praveen Kumar | రేవంత్ మీద మీకున్న నమ్మకం నిజంగా సూపర్.. సీతక్క గారు

Stock Markets | అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Musi River Rejuvenation | మూసీకి జీవం.. జంట జలాశయాలకు గోదావరి జలాలు






