త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RS Praveen Kumar | రేవంత్ మీద మీకున్న న‌మ్మ‌కం నిజంగా సూప‌ర్.. సీత‌క్క గారు

RS Praveen Kumar | సీఎం రేవంత్ రెడ్డి ఏదైనా చేస్తామంటే.. ఫ‌టాఫ‌ట్ చేస్తాడు.. కాదు అనుకుంటే చేతులెత్తి న‌మస్కారిస్తామ‌న్న మంత్రి సీత‌క్క వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ స్పందించారు.

S

Telangana | Published On Aug 31, 2026, 4.25 pm IST

RS Praveen Kumar | రేవంత్ మీద మీకున్న న‌మ్మ‌కం నిజంగా సూప‌ర్.. సీత‌క్క గారు
Advertisement

RS Praveen Kumar | త్రినేత్ర‌.న్యూస్ : సీఎం రేవంత్ రెడ్డి ఏదైనా చేస్తామంటే.. ఫ‌టాఫ‌ట్ చేస్తాడు.. కాదు అనుకుంటే చేతులెత్తి న‌మస్కారిస్తామ‌న్న మంత్రి సీత‌క్క వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ స్పందించారు. ఫ‌టాఫ‌ట్ సీఎం రేవంత్ రెడ్డి మీద మీకున్న న‌మ్మ‌కం నిజంగా సూప‌ర్ సీత‌క్క గారు అని ఆయ‌న పేర్కొన్నారు.

కానీ.. నిన్న ఒక ఆదివాసీ బిడ్డ, గురుకుల పాఠశాలలో చదువుకొని నర్స్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని హైదరాబాద్‌లో ప్రైమ్ కేర్ హాస్పిటల్‌లో అత్యంత క్రూరంగా చంపబడితే కనీసం హోం మంత్రి అయి కూడా నేర స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోతే ఎట్ల? అని ఆర్ఎస్పీ నిల‌దీశారు. ఫటాఫట్‌గా పైసలు సంపాయించడం, ఢిల్లీకి మూటలు చేరవేయడంలో దిట్టలు.. కానీ ప్రజల ప్రాణాలు రక్షించడం మీకు చేతకాదు అని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ మండిప‌డ్డారు.

Advertisement
Advertisement