త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Assam | ఎస్ఐఆర్ త‌ర్వాత అస్సాంలో పెరిగిన 2.19 ల‌క్ష‌ల మంది ఓట‌ర్లు..

Assam | ఓట‌ర్ల ప్ర‌త్యేక స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ (SIR) త‌ర్వాత బీజేపీ పాలిత రాష్ట్రం అస్సాంలో (Assam) ఓట‌ర్ల సంఖ్య భారీగా పెరిగింది. ప్ర‌త్యేక సారాంశ స‌వ‌ర‌ణ (SSR) ముసాయిదా జాబితాను (Draft Electoral Roll) రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం గురువారం విడుద‌ల చేసింది. ఇందులో 2,18,771 ఓట్లర్లు పెరిగారు.

G

National | Published On Nov 13, 2026, 7.21 am IST

Assam | ఎస్ఐఆర్ త‌ర్వాత అస్సాంలో పెరిగిన 2.19 ల‌క్ష‌ల మంది ఓట‌ర్లు..
Advertisement

Assam | త్రినేత్ర న్యూస్‌: ఓట‌ర్ల ప్ర‌త్యేక స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ (SIR) త‌ర్వాత బీజేపీ పాలిత రాష్ట్రం అస్సాంలో (Assam) ఓట‌ర్ల సంఖ్య భారీగా పెరిగింది. ప్ర‌త్యేక సారాంశ స‌వ‌ర‌ణ (SSR) ముసాయిదా జాబితాను (Draft Electoral Roll) రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం గురువారం విడుద‌ల చేసింది. ఇందులో 2,18,771 ఓట్లర్లు పెరిగారు. దీంతో ప్ర‌స్తుతం రాష్ట్రంలో మొత్తం ఓట‌ర్ల సంఖ్య 2,51,76,910కి చేరింది. ప్రత్యేక ఓటర్ల సవరణ తర్వాత ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో విడుదలైన తుది జాబితా కంటే ఇది 2.18 లక్షల మంది ఓటర్లు అదనం కావ‌డం గ‌మ‌నార్హం. తాజా ముసాయిదా ప్ర‌కారం మొత్తం ఓట‌ర్ల‌లో 1,25,87,650 మంది పురుషులు కాగా, 1,25,88,939 మంది మహిళా ఓటర్లు, 321 మంది థర్డ్-జెండర్లు ఉన్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 10న విడుదలైన తుది ఓటర్ల జాబితాలో (Voter List) 2,49,58,139 మంది ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత జరిగిన సవరణ ప్రక్రియలో 4,12,344 కొత్త పేర్లను చేర్చగా, 1,93,573 పేర్లను తొలగించారు. దీంతో నికరంగా 2,18,771 మంది ఓటర్లు పెరిగారు. తాజా జాబితాలో 2,05,962 మంది దివ్యాంగ ఓటర్లు ఉండగా, 18 నుంచి 19 ఏండ్ల‌ వయసు గల యువ ఓటర్లు 2,87,233 మంది ఉన్నారు. ఇక 85 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న ఓటర్ల సంఖ్య 1,22,198గా ఉంది. 63,237 మంది సర్వీస్ ఓటర్లు, ఆరుగురు ప్రవాస (ఓవర్సీస్) ఓటర్లు కూడా ఉన్నారు. ముసాయిదా ఓట‌ర్ల జాబితాపై డిసెంబర్ 11 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌లను దాఖలు చేయవచ్చని అధికారులు తెలిపారు. తుది ఓటర్ల జాబితాను 2027 జనవరి 4న విడుదల చేయనున్నారు.

Advertisement
Advertisement