Nepal Floods | నేపాల్ వరదల్లో హైదరాబాద్ మహిళ గల్లంతు.. అమెరికా నుంచి ఇండియాకు భర్త
Nepal Floods | నేపాల్‌లో బీభత్సం సృష్టించిన వరదల్లో హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ గల్లంతయ్యారు. తన భార్య గల్లంతైన విషయం తెలుసుకున్న భర్త.. అమెరికా నుంచి ఇండియాకు బయల్దేరారు.
Nepal Floods | త్రినేత్ర.న్యూస్ : నేపాల్‌లో బీభత్సం సృష్టించిన వరదల్లో హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ గల్లంతయ్యారు. తన భార్య గల్లంతైన విషయం తెలుసుకున్న భర్త.. అమెరికా నుంచి ఇండియాకు బయల్దేరారు. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో వరదల్లో చిక్కుకున్న 80 మంది ఇషా ఫౌండేషన్ సభ్యుల్లో తన భార్య శ్రీదేవి వేజెళ్ల కూడా ఉందని భర్త దీపక్ దండు మీడియాకు వెల్లడిస్తూ బోరున విలపించారు.
శ్రీదేవి కైలాస మానస సరోవర్ యాత్ర ముగించుకుని.. భారత్‌కు తిరిగి వస్తున్న సమయంలో నేపాల్ - టిబెట్ సరిహద్దులోని గ్యిరోంగ్ ఇమ్మిగ్రేషన్ కార్యాలయంలో ఉండగా.. వరద పోటెత్తింది. దీంతో వరద నీరు ఒక్కసారిగా ఇమ్మిగ్రేషన్ భవనాన్ని చుట్టుముట్టి కొట్టుకుపోయినట్లు సమాచారం. అప్పటి వరకు ఆమెతో భర్త దీపక్ ఫోన్‌లో మాట్లాడారు. వరదలు సంభవించిన అనంతరం కమ్యూనికేషన్ లేకుండా పోయిందన్నారు భర్త.
శ్రీదేవి, దీపక్ దండు దంపతులకు 13 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. శ్రీదేవితో కలిసి అతడు హైదరాబాద్‌కు వచ్చినప్పటికీ కుటుంబ సభ్యుల వద్దే ఉండిపోయాడు. ప్రస్తుతం తన కుమారుడు కూడా వార్తలు విని తీవ్రంగా కలత చెందుతున్నాడని దీపక్ తెలిపారు. తన భార్యకు కైలాస మానస సరోవర్ యాత్ర చేయాలన్నది ఎన్నాళ్ల నుంచో ఉన్న కోరిక అని దీపక్ కన్నీటిపర్యంతమవుతూ చెప్పారు. ‘‘ఆమెతో కలిసి నేనూ యాత్రకు రావాల్సింది. కానీ వీలు కాలేదని’’ పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●iPhone 17 Pro Max | ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్.. రూ.రూ.74,990కే ఫోన్..!
- ●Pawan Kalyan Keralam Visit | 'థాంక్యూ కేరళం': ఆయుర్వేద చికిత్స ముగిశాక పవన్ కల్యాణ్ ఎమోషనల్ పోస్ట్.. కేరళ సీఎం ఏమన్నారంటే?
- ●Konda Surekha | నేన్ గెలవంగనే నా ఎనకాల్నే టీఆర్ఎస్లకొచ్చిండు.. ఆ జెండాతోటి మళ్ల ఇటొచ్చిండు
- ●BRICS Summit 2026 Delhi | ముగిసిన 18వ బ్రిక్స్ సదస్సు: ఢిల్లీ నుంచి స్వదేశాలకు బయలుదేరిన పుతిన్, జిన్‌పింగ్
- ●Ayodhya Case | అయోధ్య రామాలయం చోరీ కేసులో చార్జిషీట్‌కు రంగం సిద్ధం!
- ●Anwar Ibrahim Rahul Gandhi Meeting | ఢిల్లీలో ఆసక్తికర భేటీ: రాహుల్ గాంధీ, ప్రియాంకలతో మలేషియా ప్రధాని బ్రేక్‌ఫాస్ట్

iPhone 17 Pro Max | ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్.. రూ.రూ.74,990కే ఫోన్..!

Pawan Kalyan Keralam Visit | 'థాంక్యూ కేరళం': ఆయుర్వేద చికిత్స ముగిశాక పవన్ కల్యాణ్ ఎమోషనల్ పోస్ట్.. కేరళ సీఎం ఏమన్నారంటే?

Konda Surekha | నేన్ గెలవంగనే నా ఎనకాల్నే టీఆర్ఎస్లకొచ్చిండు.. ఆ జెండాతోటి మళ్ల ఇటొచ్చిండు

BRICS Summit 2026 Delhi | ముగిసిన 18వ బ్రిక్స్ సదస్సు: ఢిల్లీ నుంచి స్వదేశాలకు బయలుదేరిన పుతిన్, జిన్‌పింగ్






