Asaduddin Owaisi | బాబర్ పుట్టిన దేశం నుంచే ప్రధానికి అత్యున్నత పురస్కారం.. సంఘ్ సభ్యులు ఆలోచించుకోండి : ఒవైసీ
Asaduddin Owaisi | ప్రధాని మోదీ (PM Modi)కి ఉజ్బెకిస్థాన్ (Uzbekistan) అత్యున్నత పురస్కారం (Uzbek honour) లభించడంపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) తీవ్రంగా స్పందించారు. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ పుట్టిన దేశమే ప్రధానిని ఈ అవార్డుతో సత్కరించిందని చెప్పారు. ఈ మేరకు బీజేపీ, సంఘ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Asaduddin Owaisi | త్రినేత్ర.న్యూస్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)కి ఉజ్బెకిస్థాన్ (Uzbekistan) అత్యున్నత పురస్కారం (Uzbek honour) లభించిన విషయం తెలిసిందే. రెండు రోజుల పర్యటన నిమిత్తం మధ్య ఆసియా దేశానికి వెళ్లిన ప్రధానికి ఆ దేశ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయేవ్ 'ఒలియ్ దరాజలి దుస్త్లిక్' (Oliy Darajali Dustlik) పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఇది ఆ దేశపు అత్యున్నత పురస్కారం. ప్రధాని మోదీకి ఈ పురస్కారం లభించడంపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్‌తో ఆ దేశానికి ఉన్న చారిత్రక సంబంధాన్నిగుర్తుచేశారు.
బాబర్ పుట్టిన దేశం నుంచి ప్రధానికి ఈ గౌరవం దక్కడాన్ని ఒవైసీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ బీజేపీ, సంఘ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిరంతరం మొఘలులను, బాబర్‌ను విమర్శించే బీజేపీ, సంఘ్ పరివార్ నాయకులు.. దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. "భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్ పుట్టిన ఫెర్గానా వ్యాలీ ప్రస్తుత ఉజ్బెకిస్థాన్‌లోనే ఉంది. బాబర్ వచ్చిన దేశమే నేడు ప్రధానికి అత్యున్నత పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. ప్రధాని మోదీకి ఈ పురస్కారం దక్కడంపై నేను బీజేపీకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. రాజకీయ లబ్ధికోసం మీరు ఎప్పుడూ బాబర్ పేరును ప్రస్తావిస్తూ ఎన్నో రకాలుగా దూషించారు, అవమానించారు. కానీ ఇప్పుడు అదే దేశ ప్రజలు మీకు అవార్డు ఇచ్చి గౌరవిస్తున్నారు. దీనిపై సంఘ్ పరివార్ సభ్యులు, బీజేపీ కార్యకర్తలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇకనైనా బాబర్ పేరుతో చేసే విమర్శలు ఆగిపోతాయని ఆశిస్తున్నా" అని ఒవైసీ పేర్కొన్నారు.
అదే సమయంలో ఈ మధ్య కాలంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్కడికి వెళ్లినా ఏదో ఒక అవార్డుతోనే తిరిగి వస్తున్నారంటూ ఒవైసీ వ్యాఖ్యానించారు. అందుకు అభినందనలు తెలిపారు. ఒవైసీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. అంతర్జాతీయంగా మన దేశానికి, ప్రధానికి దక్కిన గౌరవాన్ని ఒవైసీ రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ మండిపడుతున్నారు.
కాగా, రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని ఉజ్బెకిస్థాన్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటన భారత్‌కు ఒక కీలకమైన విజయాన్ని అందించింది. ఆ దేశ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్‌తో ఆదివారం జరిగిన సమావేశంలో, దీర్ఘకాలిక యురేనియం (Uranium) సరఫరాకు సంబంధించి ఒక చారిత్రక ఒప్పందం కుదిరింది. ఇక ఈ పర్యటన సందర్భంగా ప్రధానిని ఆ దేశం అత్యున్నత పురస్కారం 'ఒలియ్ దరాజలి దుస్త్లిక్' (Oliy Darajali Dustlik)తో సత్కరించింది. ఈ పురస్కారం పట్ల ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. తన ఈ రెండు రోజుల పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపారు.
Also Read..
జమ్ముకశ్మీర్‌లో 'పాకిస్థాన్ పావురం' కలకలం.. కాలికి ఉన్న రింగ్‌పై ఏముందంటే?
కోర్టు గీర్టు అని ఆలస్యం చేయకుండా.. నడిరోడ్డుపై ఉరితీయాలి
సెప్టెంబర్ 5 కాక్రోచ్ పార్టీ ఢిల్లీ మార్చ్‌కు బ్రేక్ వేయలేం.. తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బీఆర్ఎస్ను బద్నాం చేయడం మీ అజ్ఞానానికి నిదర్శనం
ఆగస్టు 30, 2026

MIM | ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహమత్‌పై బహిష్కరణ వేటు.. అసదుద్దీన్ నోరు విప్పాలి: సల్మాన్ ఖాన్
ఆగస్టు 29, 2026

PM Modi | ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదాన్ని రూపుమాపాలి.. విదేశీ పర్యటకు బయల్దేరి వెళ్లిన ప్రధాని మోదీ
ఆగస్టు 29, 2026
తాజావార్తలు
- ●Harish Rao | ఆడబిడ్డల భద్రత ప్రశ్నార్థకంగా మారడం సిగ్గుచేటు : హరీశ్‌రావు
- ●Tim Cook | యాపిల్ ముఖ చిత్రాన్ని మార్చిన టిమ్ కుక్.. సీఈవోగా నేడే చివరి పని రోజు..
- ●Kathua Pigeon Caught | జమ్ముకశ్మీర్‌లో 'పాకిస్థాన్ పావురం' కలకలం.. కాలికి ఉన్న రింగ్‌పై ఏముందంటే?
- ●N Ramchander Rao | 22ఏ ఆంక్షలు ఎత్తివేయాలి
- ●Rashmika Mandanna | రష్మిక ఈజ్ బ్యాక్ - గాయం తర్వాత ఫస్ట్ టైమ్ కెమెరా ముందుకు - భర్తతో కలిసి షూటింగ్
- ●Ramchandar Rao | ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థులు రాసిన లేఖలు ఇస్తాం.. మీ అపాయింట్మెంట్ ఇవ్వండి

Harish Rao | ఆడబిడ్డల భద్రత ప్రశ్నార్థకంగా మారడం సిగ్గుచేటు : హరీశ్‌రావు

Tim Cook | యాపిల్ ముఖ చిత్రాన్ని మార్చిన టిమ్ కుక్.. సీఈవోగా నేడే చివరి పని రోజు..

Kathua Pigeon Caught | జమ్ముకశ్మీర్‌లో 'పాకిస్థాన్ పావురం' కలకలం.. కాలికి ఉన్న రింగ్‌పై ఏముందంటే?

N Ramchander Rao | 22ఏ ఆంక్షలు ఎత్తివేయాలి



