Rashmika Mandanna | షూటింగ్ అంటేనే వణికిపోయా – మైసాపై రష్మిక మందన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కెరీర్‌లో ఫస్ట్ టైమ్ షూటింగ్ అంటేనే వణికిపోయానని రష్మిక మందన్న అన్నది. కొండలపైకి పరిగెత్తడం, వాటర్‌ఫాల్స్ పై నుంచి కిందికి దూకడం..ఇలా ఈ సినిమా కోసం చాలానే రిస్కీ స్టంట్స్ చేశానని చెప్పింది. మైసా సినిమాను ఉద్దేశించి రష్మిక చేసిన కామెంట్లు వైరల్ అవుతోన్నాయి.
Entertainment | Published On Sep 21, 2026, 11.06 am IST
Rashmika Mandanna | మైసా కోసం చాలా రిస్కీ స్టంట్స్ చేసినట్లు నేషనల్ క్రష్ రష్మిక మందన్న చెప్పింది. ఆమె హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ నవంబర్ 27న థియేటర్లలోకి రాబోతుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్నారు. మైసా టీజర్ ఆదివారం రిలీజైంది.ఈ టీజర్‌లో రష్మిక చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
లైఫ్‌నే ఇచ్చేశా....
టీజర్ లాంఛ్ వేడుకలో రష్మిక మందన్న మాట్లాడుతూ..... ఇప్పటివరకు నాలోని ఎమోషనల్ యాంగిల్‌ను అందరూ చూశారు. ఇందులో కొత్త పాత్ర చేశా. ఇంత యాక్షన్ ఎప్పుడూ చేయలేదు. ఏదైనా పాత్ర ఎంచుకున్నప్పుడు అందులో కొత్తదనం ఉండాలని నేను ఫీల్ అవుతాను. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాలో ఎమోషనల్‌గా ఏముంటుందో అంతా ఆ ఫిల్మ్‌లో ఇచ్చాను. ‘మైసా’ కోసం నా లైఫ్‌నే ఇచ్చేశాను. డైరెక్టర్ రవీంద్ర నాతో చాలా రిస్కీ స్టంట్స్ చేయించారు. కథ అద్భుతంగా అనిపించింది. కానీ అదే ఇమాజినేషన్‌ను రియల్‌గా చేయాలంటే ఎంత కష్టమో అర్థమైంది" అని తెలిపింది.
కేరళలోని అడవుల్లో...
"కేరళలో దట్టమైన అడవులు, కొండ ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ చేశాం. కొండపైకి రియల్‌గా పరిగెత్తుకుంటూ వెళ్లమని... వాటర్‌ఫాల్స్ నుంచి దూకమని చెప్పేవారు. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ షూటింగ్‌కి వెళ్లాలంటే వణుకు పుట్టింది. అండర్‌వాటర్ సీక్వెన్స్ ఉంది. ఇందులో రోజుకు ఎనిమిది గంటల పాటు నీటిలోనే ఉన్నాను. అలాగే మట్టి బురదలో పేరుకుపోయే ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంది. అది కూడా రియల్‌గా చేయించారు. ఇందులో డ్యాన్స్ కూడా ఉంది. ఆ డ్యాన్స్ చేసినప్పుడు హిప్ ఇంజూరీ అయింది. డాక్టర్ స్కాన్ చూసి ఇది ఏదో ఫుట్‌బాల్ ప్లేయర్‌కి ఇంజూరీ అయినట్టుగా ఉంది అని చెప్పారు. డూప్‌లేకుండా అన్ని సీన్లు నాతో రియల్‌గా చేయించారు డైరెక్టర్.(నవ్వుతూ). నాతో పాటు ప్రతి ఒక్కరూ ఎంతో హార్డ్ వర్క్ చేసిన సినిమా ఇది అని రష్మిక మందన్న అన్నది.
సీతారామం సినిమాకు పనిచేశా
"ఈ కథ రాస్తున్నప్పుడే రష్మిక గారు హీరోయిన్‌గా చేయాలని ఫిక్స్ అయిపోయాను. ‘సీతారామం’లో నేను పని చేశాను. అప్పుడే తను నా కొత్త హీరోయిన్ అనుకున్నాను. ఇప్పటివరకు మీరు క్యూట్‌గా, స్వీట్‌గా ఉండే రష్మికను చూశారు. ఈ సినిమాలో రష్మిక ఫేస్ మీద బ్లడ్ పెడితే ఎలా ఉంటుందో అది చూస్తారు" అని డైరెక్టర్ పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Mysaa Teaser | ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు – రష్మిక మందన్న మైసా టీజర్ రిలీజ్
సెప్టెంబర్ 20, 2026

Rashmika Mandanna | సుబ్బులక్ష్మి బయోపిక్కు రష్మిక రాంగ్ ఛాయిస్ – ట్రోల్స్‌పై నేషనల్ క్రష్ రియాక్షన్
సెప్టెంబర్ 19, 2026

Ranabaali | రణబాలి షూటింగ్ కంప్లీట్ -పెళ్లి ఫొటోతో విరోష్ జోడీ సర్ప్రైజ్
సెప్టెంబర్ 17, 2026
తాజావార్తలు
- ●Stock Markets | మార్కెట్లకు విదేశీ పెట్టుబడుల అండ.. 478 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..
- ●K Shobha Reddy | సీఎం గారూ అపాయింట్మెంట్ ఇవ్వండి ప్లీజ్.. ట్రోల్స్‌పై కే శోభారెడ్డి ఆవేదన
- ●Neem Tree | నల్లమలలో వేప చెట్లకు వింత తెగులు..
- ●Kadem Project | కళకళలాడుతున్న 'కడెం'.. నిండు కుండలా ప్రాజెక్టు
- ●Khairatabad ganesh | ఖైరతాబాద్ గణేశ్.. నిన్న ఒక్కరోజే 4 లక్షల మంది దర్శనం
- ●Horoscope | సెప్టెంబర్ 21 రాశిఫలాలు.. ఈ రాశి వారికి సహోద్యోగులతో సవాళ్లు..!

Stock Markets | మార్కెట్లకు విదేశీ పెట్టుబడుల అండ.. 478 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..

K Shobha Reddy | సీఎం గారూ అపాయింట్మెంట్ ఇవ్వండి ప్లీజ్.. ట్రోల్స్‌పై కే శోభారెడ్డి ఆవేదన

Neem Tree | నల్లమలలో వేప చెట్లకు వింత తెగులు..

Kadem Project | కళకళలాడుతున్న 'కడెం'.. నిండు కుండలా ప్రాజెక్టు



