త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Weather | తెలంగాణ‌లో రెండురోజులు భారీ వ‌ర్షాలు.. కొత్త‌గూడెం జిల్లాకు రెడ్ అలెర్ట్‌

TG Weather | తెలంగాణ‌లో రెండురోజుల పాటు భారీ నుంచి అత్యంత వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. ఈ మేర‌కు ప‌లు జిల్లాల‌కు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. తూర్పు తెలంగాణ‌ను ఆనుకొని ఉన్న కోస్తాంధ్ర‌పై ఉన్న అల్ప‌డీనం ఆరు గంట‌లుగా గంట‌కు ఆరు కిలోమీట‌ర్ల వేగంతో దాదాపు ఉత్త‌ర దిశ‌గా నెమ్మ‌దిగా క‌దిలింద‌ని తెలిపింది.

P

Telangana | Published On Nov 4, 2026, 4.37 pm IST

TG Weather | తెలంగాణ‌లో రెండురోజులు భారీ వ‌ర్షాలు.. కొత్త‌గూడెం జిల్లాకు రెడ్ అలెర్ట్‌
Advertisement

TG Weather | తెలంగాణ‌లో రెండురోజుల పాటు భారీ నుంచి అత్యంత వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. ఈ మేర‌కు ప‌లు జిల్లాల‌కు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. తూర్పు తెలంగాణ‌ను ఆనుకొని ఉన్న కోస్తాంధ్ర‌పై ఉన్న అల్ప‌డీనం ఆరు గంట‌లుగా గంట‌కు ఆరు కిలోమీట‌ర్ల వేగంతో దాదాపు ఉత్త‌ర దిశ‌గా నెమ్మ‌దిగా క‌దిలింద‌ని తెలిపింది. ప్ర‌స్తుతం ఖ‌మ్మానికి నైరుతి దిశ‌లో సుమారు ప‌ది కిలోమీట‌ర్లు, నందిగామ‌కు ఉత్త‌ర‌-వాయువ్య దిశ‌లో 50 కిలోమీట‌ర్లు, రెంట‌చింత‌ల‌కు వాయువ్యంగా 90 కిలోమీట‌ర్లు, న‌ల్గొండ‌కు తూర్పు-ఈశాన్య దిశ‌లో 90 కిలోమీట‌ర్లు, విజ‌య‌వాడ‌కు వాయువ్య దిశ‌లో 90 కిలోమీట‌ర్లు, భ‌ద్రాచ‌లంకు ప‌శ్చిమ నైరుతి దిశ‌లో వంద కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీకృత‌మై ఉంద‌ని తెలిపింది. ఉత్త‌ర‌దిశ‌గానే ప్ర‌యాణిస్తూ.. రాబోయే ఆరుగంట‌ల్లో బ‌ల‌హీన‌ప‌డి అల్ప‌పీడ‌న ప్రాంతంగా మారే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది.

ఈ క్ర‌మంలో బుధ‌వారం భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో అక్క‌డ‌క్క‌డ భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. ఈ క్ర‌మంలో రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఖ‌మ్మంలో అతిభారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అలాగే, ములుగు, కొత్త‌గూడెం, ఖ‌మ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులు గంట‌కు 40-50 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయ‌ని తెలిపింది. మంచిర్యాల‌, క‌రీంన‌గ‌ర్‌, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి, న‌ల్గొండ‌, సూర్యాపేట‌, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌నుమ‌కొండ‌, జ‌న‌గాం, సిద్దిపేట‌, యాద్రాద్రి భువ‌న‌గిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని పేర్కొంది. అలాగే, గురువారం క‌రీంన‌గ‌ర్‌, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి, ములుగు, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, ఖ‌మ్మం, న‌ల్గొండ‌, సూర్యాపేట‌, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌నుమ‌కొండ‌, జ‌నగాం, రంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షాలు కురుస్తాయంటూ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ.

Advertisement
Advertisement