త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian student was killed | సాయం కోసం ఎదురుచూస్తుండ‌గా రోడ్డు ప్ర‌మాదం.. దుబాయ్‌లో భార‌తీయ విద్యార్థిని దుర్మ‌ర‌ణం

Indian student was killed | దుబాయ్ (Dubai)లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో 21 ఏళ్ల భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది (Indian student was killed). మృతురాలు దుబాయ్‌లోని కెన‌డియ‌న్ యూనివ‌ర్సిటీలో ఆర్కిటెక్చర్ ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువుతున్న కేర‌ళ‌కు చెందిన‌ నైఫా బ‌ల్కీస్ హ‌మీద్ (Naifa Balkies Hameed)గా గుర్తించారు.

D

National | Published On Nov 10, 2026, 1.31 pm IST

Indian student was killed | సాయం కోసం ఎదురుచూస్తుండ‌గా రోడ్డు ప్ర‌మాదం.. దుబాయ్‌లో భార‌తీయ విద్యార్థిని దుర్మ‌ర‌ణం
Advertisement

Indian student was killed | త్రినేత్ర న్యూస్ : ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళ్లి అక్క‌డ అనుకోని ప్ర‌మాదాలబారిన ప‌డి భార‌తీయులు ప్రాణాలు కోల్పోతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. తాజాగా దుబాయ్ (Dubai)లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో 21 ఏళ్ల భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది (Indian student was killed). దుబాయ్‌లోని కెన‌డియ‌న్ యూనివ‌ర్సిటీలో ఆర్కిటెక్చర్ ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువుతున్న నైఫా బ‌ల్కీస్ హ‌మీద్ (Naifa Balkies Hameed) కారులో క‌ళాశాల‌కు బ‌య‌ల్దేరింది. అయితే, అల్ ఖవానీజ్ (Al Khawaneej) ప్రాంతంలో ఆమె ప్ర‌యాణిస్తున్న కారు టైర్ పంక్చ‌ర్ కావ‌డంతో కింద‌కు దిగింది.

త‌న తండ్రికి ఫోన్ చేసి విష‌యం చెప్పింది. దీంతో కారును వ‌ర్క్‌షాప్‌కు పంపి టాక్సీలో కాలేజీకి వెళ్లాల‌ని తండ్రి సూచించ‌డంతో ఆమె రోడ్డు ప‌క్క‌న నిల‌బ‌డి సాయం కోసం ఎదురుచూస్తోంది. అదే స‌మ‌యంలో వేగంగా వ‌చ్చిన వాహ‌నం ఆమెను ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో హ‌మీద్ ప్రాణాలు కోల్పోయింది. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మృత‌దేహాన్ని ప‌రిశీలించారు. అనంత‌రం హ‌మీద్ కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం అందించారు. ఈ కేసుకు సంబంధించి నిందితుడైన కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారని, దర్యాప్తు కొనసాగుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు.

కాగా, కేరళ (Kerala)లోని తోడుపుజ (Thodupuzha)కు చెందిన హమీద్ కుటుంబం పిల్ల‌ల ఉన్న‌త చ‌దువుల కోసం దుబాయ్‌కి షిఫ్ట్ అయిన‌ట్లు తెలిసింది. హ‌మీద్ త‌న కుటుంబంతో క‌లిసి ఇటీవ‌లే కేర‌ళ‌లో జ‌రిగిన ఓ వివాహ వేడుక‌కు హాజ‌రైన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. అయితే ఆమె తండ్రి, తమ్ముడు, వదిన పెళ్లి వేడుకల నిమిత్తం అక్కడే ఉండిపోగా.. హ‌మీద్ మాత్రం క‌ళాశాల ఉండ‌టంతో త‌న త‌ల్లితోపాటూ దుబాయ్ వెళ్లార‌ని చెప్పారు. హ‌మీద్ తండ్రి ఓ పెద్ద వ్యాపార‌వేత్త అని.. ఆ కుటుంబం అక్క‌డే స్థిర‌ప‌డిన‌ట్లు వెల్ల‌డించారు.

Also Read..

బిలాంగింగ్ కాదు వైట్‌వాషింగ్ అని పెట్టాల్సింది.. సోనియా ఆత్మ‌క‌థ‌పై బీజేపీ విమ‌ర్శ‌లు

బాలీవుడ్ స్టార్స్ పేరుతో గాడిద‌ల అమ్మ‌కాలు.. రూ.72,000 పలికిన చుంకీ పాండే..!

ఎన్విడియా పతనం.. భారత ఇన్వెస్టర్లకు భారీ నష్టాల ముప్పు..?

Advertisement
Advertisement