త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Charlapalli–Tiruchanur Train | ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. చర్లపల్లి – తిరుచానూరు ఎక్స్‌ప్రెస్‌ ఇక సూపర్‌ఫాస్ట్‌!

Charlapalli–Tiruchanur Train | రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. చర్లపల్లి – తిరుచానూరు – చర్లపల్లి మధ్య నడిచే రైలును మెయిల్‌-ఎక్స్‌ప్రెస్‌ కేటగిరీ నుంచి సూపర్‌ఫాస్ట్‌ కేటగిరీగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.

P

Telangana | Published On Nov 10, 2026, 6.05 pm IST

Charlapalli–Tiruchanur Train | ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. చర్లపల్లి – తిరుచానూరు ఎక్స్‌ప్రెస్‌ ఇక సూపర్‌ఫాస్ట్‌!
Advertisement

Charlapalli–Tiruchanur Train | రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. చర్లపల్లి – తిరుచానూరు – చర్లపల్లి మధ్య నడిచే రైలును మెయిల్‌-ఎక్స్‌ప్రెస్‌ కేటగిరీ నుంచి సూపర్‌ఫాస్ట్‌ కేటగిరీగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పుతో రైలుకు కొత్త నంబర్లు కేటాయించడంతోపాటు చర్లపల్లి నుంచి బయలుదేరే సమయాన్ని యథాతథంగా ఉంచి, తిరుచానూరు నుంచి తిరుగు ప్రయాణంలో బయలుదేరే సమయాన్ని 55 నిమిషాలు ముందుకు మార్చింది. ఈ నిర్ణయం 2027 జనవరి ఒక‌టి నుంచి అమల్లోకి రానుంది.

కొత్త నంబర్లతో రైళ్ల రాకపోకలు

ప్రస్తుతం చర్లపల్లి నుంచి తిరుచానూరుకు 17047 నంబరుతో నడుస్తున్న రైలుకు 12729 నంబరును, తిరుచానూరు నుంచి చర్లపల్లికి 17048 నంబరుతో నడుస్తున్న రైలుకు 12730 నంబర్‌ను కేటాయి కేటాయించారు. ఇకపై ఈ రెండు రైళ్లు సూపర్‌ఫాస్ట్‌ కేటగిరీలో ప‌రుగులు తీయ‌నున్నాయి. కొత్త మార్పుల ప్రకారం.. చర్లపల్లి నుంచి రాత్రి 6.55 గంటలకు బయలుదేరాల్సిన రైలు సమయం యథాతథంగా ఉంటుంది. తిరుచానూరుకు ఉదయం 8 గంటలకు చేరుకుంటుంది. తిరుచానూరు నుంచి చర్లపల్లికి వచ్చే రైలు గతంలో ఉదయం 7 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, ఇకపై ఉదయం 6 గంటలకే బయలుదేరనుంది. చర్లపల్లికి సాయంత్రం 4.55 గంటలకు చేరుకుంటుంది. ఈ మార్పు ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకునేందుకు ఉపయోగపడనుంది.

ప్రయాణికులకు మరింత ఊరట

రైలును సూపర్‌ఫాస్ట్‌ కేటగిరీగా మార్చడం, కొత్త నంబర్లు కేటాయించడం ద్వారా రైలు సేవల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా తిరుగు ప్రయాణంలో బయలుదేరే సమయాన్ని ముందుకు మార్చడంతో ప్రయాణికులు ఎంతో వీలు క‌లుగ‌నుంది. గ‌మ్య‌స్థానానికి ముందే చేరుకునేందుకు ఉప‌యోగ‌ప‌డ‌నుంది. సూపర్‌ఫాస్ట్‌ హోదాతో ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉండటంతో ఈ మార్పు ప్రయాణికులకు ఊరటనివ్వనుంది. ఈ మార్పులన్నీ జ‌న‌వ‌రి ఒక‌టి నుంచి అమల్లోకి వ‌స్తాయ‌ని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే వివ‌రించింది. కాబట్టి చర్లపల్లి – తిరుచానూరు మధ్య ప్రయాణించే ప్రయాణికులు కొత్త రైలు నంబర్లు, మారిన బయలుదేరే సమయాలను గమనించాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.

Advertisement
Advertisement