Borewell drilling | బోరుబావులు తవ్వేందుకు 300 అడుగుల వరకు అనుమతివ్వాలి
Borewell drilling | బోరుబావులు తవ్వేందుకు (Borewell drilling) 300 అడుగుల వరకు అనుమతివ్వాలని తెలంగాణ రిగ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ముస్కు అంజిరెడ్డి (Musku Anjireddy) కోరారు.
- జి.ఓ. నంబర్ 259ను సవరించాలి
- కార్మికుల ఉపాధికి రక్షణ కల్పించాలి
- పాత బోర్లకు ఉచిత రిజిస్ట్రేషన్ చేయాలి
- రిగ్ వాహనాలను సీజ్‌చేయడం నిలిపేయాలి
- తెలంగాణ రిగ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ముస్కు అంజిరెడ్డి
Borewell drilling | త్రినేత్ర న్యూస్: బోరుబావులు తవ్వేందుకు (Borewell drilling) 300 అడుగుల వరకు అనుమతివ్వాలని తెలంగాణ రిగ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ముస్కు అంజిరెడ్డి (Musku Anjireddy) కోరారు. పర్మిట్లు కలిగిన రిగ్ వాహనాలను అకారణంగా అడ్డుకోవడం, వేధించడం, సీజ్ చేయడం వంటి చర్యలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలన్నారు. పాత బోర్లకు ఉచిత రిజిస్ట్రేషన్ కోసం అవకాశం కల్పించాలన్నారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బోరుబావుల తవ్వకాల రంగం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని నివారించాలి. ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికులు, డ్రైవర్లు, వ్యాపారుల ఉపాధిని కాపాడాలి. ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ నంబర్ 259ను తక్షణమే సవరించి, ఆచరణ సాధ్యమైన నిబంధనలు అమలు చేయాలి. బోరుబావుల తవ్వకాలపై విధించిన ఆంక్షల కారణంగా రిగ్ కార్మికులు, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి పనిచేస్తున్న డ్రైవర్లు, వాల్వ్ కార్మికులు, నిర్మాణ రంగంపై ఆధారపడిన మేసన్లు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ రంగం స్తంభిస్తే నిర్మాణ రంగంపైనా తీవ్ర ప్రభావం పడుతుంది.
గతంలో తవ్విన బోరుబావులకు ఎలాంటి జరిమానాలు లేకుండా ఒకేసారి ఉచిత రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా అనుమతులు మంజూరు చేయాలి. గడువులోగా అనుమతి రాకపోతే డీమ్డ్ అప్రూవల్ విధానాన్ని అమలు చేయాలి. ఎండిపోయిన బోరు బావులకు తిరిగి తవ్వకాలు చేపట్టేందుకు కొత్త అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఆన్‌లైన్‌లో సమాచారం అందిస్తే సరిపోయేలా నిబంధనలు రూపొందించాలి.
259 జీవోలో మార్పులు చేయాలి
భూగర్భ జలాల పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టే చర్యలకు రిగ్ ఓనర్లు పూర్తిస్థాయిలో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణతో పాటు కార్మికుల జీవనోపాధిని కూడా దృష్టిలో ఉంచుకుని విధానాలు రూపొందించాలని కోరారు. జి.ఓ. నంబర్ 259లో అవసరమైన మార్పులు చేసి, బోరుబావుల రంగాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారు విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి జి.నర్సిరెడ్డి, 41/2 రిగ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి ఓరుగంటి లక్ష్మీనారాయణ, అడ్వైజర్ శ్రీనివాసరెడ్డి, డి. కృష్ణ, మోహన్ రెడ్డి, కె.జంగయ్య గౌడ్, జగన్ మోహన్ రెడ్డి, అశోక్ రెడ్డి పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jaguar Land Rover | భారత్లో తొలిసారిగా జేఎల్ఆర్ ఎలక్ట్రిక్ కార్లు.. రేంజ్ రోవర్ సిరీస్లో కొత్త మోడళ్లు..
- ●TGPSC Group 1 Mains Controversy | శిక్షణలో 35% ట్రైనీ డీఎస్పీలు ఫెయిల్.. గ్రూప్-1 అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
- ●బస్స్టేషన్లకు 'మోడల్' హంగులు!
- ●Supreme Court | డిజిటల్ అరెస్టు మోసాలకు చెక్.. వాట్సాప్కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- ●Gajjela Kantham | జనవరి 5న ఉద్యమకారులతో సభ నిర్వహిస్తం
- ●Anthropic | ఆంథ్రోపిక్ నుంచి రెండు పవర్ఫుల్ ఏఐ మోడల్స్.. వేయి ఏఐ ఏజెంట్లను ఒకేసారి వాడొచ్చు..

Jaguar Land Rover | భారత్లో తొలిసారిగా జేఎల్ఆర్ ఎలక్ట్రిక్ కార్లు.. రేంజ్ రోవర్ సిరీస్లో కొత్త మోడళ్లు..

TGPSC Group 1 Mains Controversy | శిక్షణలో 35% ట్రైనీ డీఎస్పీలు ఫెయిల్.. గ్రూప్-1 అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

బస్స్టేషన్లకు 'మోడల్' హంగులు!

Supreme Court | డిజిటల్ అరెస్టు మోసాలకు చెక్.. వాట్సాప్కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..




