K Shobha Reddy | సీఎం గారూ అపాయింట్‌మెంట్ ఇవ్వండి ప్లీజ్.. ట్రోల్స్‌పై కే శోభారెడ్డి ఆవేదన
K Shobha Reddy | అడ్వర్టైజింగ్ రంగంలో కాంట్రాక్ట్ కోసం న్యాయబద్ధంగా అవకాశం ఇవ్వమని అడిగితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడైన ఒక వ్యక్తి గెస్ట్ హౌస్‌కు రావాలని పిలిచాడంటూ కె.శోభా రెడ్డి( K Shobha Reddy ) అనే మహిళా వ్యాపారవేత్త ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
K Shobha Reddy | త్రినేత్ర.న్యూస్ : అడ్వర్టైజింగ్ రంగంలో కాంట్రాక్ట్ కోసం న్యాయబద్ధంగా అవకాశం ఇవ్వమని అడిగితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడైన ఒక వ్యక్తి గెస్ట్ హౌస్‌కు రావాలని పిలిచాడంటూ కె.శోభా రెడ్డి( K Shobha Reddy ) అనే మహిళా వ్యాపారవేత్త ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తనకు జరిగిన అవమానంపై ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. అయితే ఆమె పోస్టుపై రకరకాల స్పందనలు వచ్చాయి. కొందరు కొన్ని పార్టీలతో అంటగట్టారు. మరికొందరు పెయిడ్ ఆర్టిస్ట్, పేటీఎం బ్యాచ్ అని నోరు పారేసుకున్నారు. ఈ కామెంట్స్‌పై శోభా రెడ్డి ఓ వీడియో సందేశం ఇచ్చారు. శనివారం రాత్రి 11.04 గంటలకు ఎక్స్‌లో వీడియో పోస్టు చేశారు.
వీడియోలోని సారాంశం ఇదే..
నాకు జరిగిన అవమానంపై ఎక్స్ వేదికగా స్పందిస్తే.. రకరకాలుగా ఊహాగానాలతో ట్వీట్లు చేస్తున్నారు. నెగెటివ్‌గా కామెంట్స్ పెడుతున్నారు. నాకు ఏ పార్టీలతో సంబంధం లేదు. ఇష్యూను ఇష్యూలాగా చూడండి. ఒక అమ్మాయి బయటకు వచ్చిందంటే.. దాంట్లో ఎంత జెన్యూనిటీ ఉంది.. ఆమెకు ఎట్ల హెల్ప్ చేస్తామనేది చూడండి కానీ పార్టీలతో అంటగట్టకండి. ఏ పార్టీ వారు ఏ ఇష్యూ గురించి మాట్లాడొద్దా..? ఒక ఇష్యూ వచ్చినప్పుడు అందరూ స్పందించి తగిన న్యాయం చేయాలని బాధితులు కోరుకుంటారు.
ఆ వ్యక్తి గురించి ఎక్స్‌పోజ్ చేయాలనుకోలేదు..
తన పట్ల దురుసుగా ప్రవర్తించిన ఆ వ్యక్తి గురించి ఎక్స్‌పోజ్ చేయాలనుకోలేదు. అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, వర్క్ ఆపార్చునిటీ కోసం ఎంపీలు, ఎమ్మెల్యేలను అప్రోచ్ అయ్యాను. సీఎం సబ్జెక్ట్ కాబట్టి.. సీఎంను అప్రోచ్ అవ్వండని అన్నారు. సచివాలయానికి వెళ్తే ఆ ఫ్లోర్‌కు పర్మిషన్ ఇవ్వరు.. ఎంఏయూలో ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చాను. ఎవరూ పట్టించుకోలేదు. అధికారులు సరిగ్గా ఉంటే ఇలా జరగదు. వృత్తిపరంగా ఎదగాలని కోరుకుని అడిగాను. పది మందికి ఉపాధి ఇవ్వాలనే ఆశతో.. అప్రోచ్ అయ్యాను. యస్ ఆర్ నో చెప్పకుండా మిస్ బిహేవ్ చేశారు. నేను చాలా తక్కువగా చెబుతున్నా.. వాట్ ఈస్ వాట్ ఏంటో నాకు తెలుసు. నేను ఆ పర్సన్‌ను బ్లేమ్ చేయాలనుకోలేదు.. నేను బ్లేమ్ కావాలనుకోవడం లేదు.
మున్సిపల్ శాఖలో భారీ కుంభకోణం
నా పర్సనల్ ఇష్యూ.. ఈ ప్రాసెస్‌లో ఇంత ఇబ్బంది పడుతున్నా.. ఈక్వల్ అపార్చునిటీస్ ఇవ్వండి అని అడిగాను. పాజిటివ్‌గా స్పందిస్తారనుకున్నా. సీఎం సర్ టైమ్ ఇస్తారని అనుకున్నా. కానీ పార్టీలకు లింకులు పెట్టి.. మీరు పెయిడ్ ఆర్టిస్టు, పేటీఎం బ్యాచ్ అని ట్రోల్ చేస్తున్నారు.. నేను పార్టీకి సంబంధం లేదు.. నేను ఒక వుమెన్. అడ్వర్టైజింగ్ ఏజెన్సీ నడుపుతన్న వుమెన్‌ని. మున్సిపల్ శాఖలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు ఈ శాఖలో ఎంత కుంభకోణం జరుగుతుందో తెలుసుకోండి. ఆ తర్వాత ఎదుటివారిని ఇష్టమొచ్చినట్టు అనండి.
ఆ ముగ్గురు కానే కాదు..
కొందరు పోల్స్ పెట్టారు. ఫహీమ్ ఖురేషీ, రోహిన్ రెడ్డి, బల్మూర్ వెంకట్ అని పెట్టారు. వారితో కూడా మాట్లాడాను. టైమ్ వచ్చినప్పుడు ఇస్తామన్నారు. రెండేండ్లు అవుతుంది ఫాలో అప్ చేశాను. వీళ్లతో అయితలేదు అని ఇంకొకరిని అప్రోచ్ అయితే మిస్ బిహేవ్ చేశాడు.
అవినీతికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి.. సీఎం సార్
సీఎం నాకు అపాయింట్‌మెంట్ ఇస్తారని ఆశిస్తున్నా. జనగామ జిల్లా పాలకుర్తి వద్ద పేదకరిం నుంచి వచ్చాను. ఫ్యామిలీ బాధ్యతలు తెలిసిన దాన్ని. అట్లెట్ల మాట్లాడుతారు. ప్రాబ్లం బయటకు ఎక్స్‌పోజ్ చేసుకోవద్దా.. మాట్లాడితే పార్టీలకు అంటగడుతారా... సమస్య ఏంటో తెలుసుకుని పరిష్కరించాలి. నేను మాట్లాడే ప్రతి దానికి ఆధారాలు ఉన్నాయి. ఇది ట్రూ. ఒకరు ఉన్నారు.. టైమ్ వచ్చినపపుడు చెబుతా. ఉమెన్ డిగ్నీటినీ కాపాడండి.. ఊహాగానాలతో పార్టీలకు ముడిపెట్టకండి. ఇప్పటికీ భయం ఉంది.. నన్ను కూడా టార్గెట్ చేస్తారని. ప్లీజ్ అర్థం చేసుకోండి.. సీఎం సార్ ఒక్క అపాయింట్‌మెంట్ ఇవ్వండి.. మీ శాఖలో జరుగుతున్న అవినీతికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి.. అవన్నీ మీ ముందర పెడతా.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అని శోభా రెడ్డి వేడుకున్నారు.
@revanth_anumula @TelanganaCMO CM Sir Please help me 🙏 pic.twitter.com/ffytZXCQef
— shobhareddykalvala (@shobhareddyk) September 20, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Neem Tree | నల్లమలలో వేప చెట్లకు వింత తెగులు..
- ●Kadem Project | కళకళలాడుతున్న 'కడెం'.. నిండు కుండలా ప్రాజెక్టు
- ●Khairatabad ganesh | ఖైరతాబాద్ గణేశ్.. నిన్న ఒక్కరోజే 4 లక్షల మంది దర్శనం
- ●Horoscope | సెప్టెంబర్ 21 రాశిఫలాలు.. ఈ రాశి వారికి సహోద్యోగులతో సవాళ్లు..!
- ●UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?
- ●T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర

Neem Tree | నల్లమలలో వేప చెట్లకు వింత తెగులు..

Kadem Project | కళకళలాడుతున్న 'కడెం'.. నిండు కుండలా ప్రాజెక్టు

Khairatabad ganesh | ఖైరతాబాద్ గణేశ్.. నిన్న ఒక్కరోజే 4 లక్షల మంది దర్శనం

Horoscope | సెప్టెంబర్ 21 రాశిఫలాలు.. ఈ రాశి వారికి సహోద్యోగులతో సవాళ్లు..!




