Allu Arjun | గ్యాంగ్‌స్టర్‌గా అల్లు అర్జున్ – ఏఏ 23 టైటిల్ ఇదేనా?
అల్లు అర్జున్ లోకేష్ కనగరాజ్ మూవీపై మరో కొత్త రూమర్ వినిపిస్తోంది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా ఈ పాన్ ఇండియన్ మూవీ తెరకెక్కుతోన్నట్లు సమాచారం. ఈ సినిమాకు గ్యాంగ్‌స్టర్ అనే వర్కింగ్ టైటిల్‌ను ఖరారు చేసినట్లు చెబుతోన్నారు.
Entertainment | Published On Nov 10, 2026, 5.39 pm IST
Allu Arjun |ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాపై ఓ కొత్త రూమర్ హల్‌చల్ చేస్తోంది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న 23వ సినిమా ఇది. ఈ ఏడాది జనవరిలో ఈ పాన్ ఇండియన్ మూవీని అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. కానీ ఇప్పటివరకు బన్నీ మూవీ కథ, జానర్‌తో పాటు షూటింగ్ మొదలయ్యది ఎప్పుడనే దానిపై మేకర్స్ ఎలాంటి అప్‌డేట్‌ను రివీల్ చేయలేదు. సూపర్ హీరో బ్యాక్‌డ్రాప్, పోలీస్ కథ అంటూ రకరకాల పుకార్లు వినిపించాయి.
గ్యాంగ్‌స్టర్...
ఎట్టకేలకు అల్లు అర్జున్ లోకేష్ కనగరాజ్ మూవీ జానర్ కన్ఫామ్ అయినట్లు సమాచారం. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతోన్నట్లు తెలిసింది. ఈ సినిమాకు గ్యాంగ్‌స్టర్ అనే వర్కింగ్ టైటిల్‌ను కూడా ఖరారు చేసినట్లు చెబుతున్నారు. ఇందులో అల్లు అర్జున్ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
మాస్ యాక్షన్...
లోకేష్ కనగరాజ్ శైలి మాస్ హంగులు, హీరోయిజం, ఎలివేషన్లతో చాలా పవర్‌ఫుల్‌గా బన్నీ పాత్ర ఉండబోతున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ మేకోవర్, లుక్ కొత్తగా ఉంటాయని అంటున్నారు. మాస్ యాక్షన్ సినిమాలు లోకేష్ కనగరాజ్‌కు స్టార్ డైరెక్టర్‌గా ఇమేజ్‌ను తీసుకొచ్చాయి. అల్లు అర్జున్ సినిమా విషయంలో ప్రయోగాల జోలికి పోకుండా తనకు అచ్చొచ్చిన రూట్‌నే ఫాలో కావాలని ఫిక్సైనట్లు చెబుతోన్నారు.
ప్రీ ప్రొడక్షన్ పనులు...
ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతోన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ పాన్ ఇండియన్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
1300 కోట్ల బడ్జెట్...
ప్రస్తుతం రాకా సినిమాతో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు 1300 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sreeleela | డీప్‌ఫేక్ బారిన పడిన శ్రీలీల – మరో నటి వీడియోను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి…
నవంబర్ 10, 2026

Renu Desai | మగాడు ఎన్ని పెళ్లిళ్లయినా చేసుకోవచ్చు – రేణుదేశాయ్ పాత కామెంట్లు ఇప్పుడు వైరల్
నవంబర్ 10, 2026

OTT | పెళ్లి ఇష్టం లేదని ప్రియుడితో వధువు లేచిపోతే – ఓటీటీలోకి అనుపమ పరమేశ్వరన్ తెలుగు కామెడీ మూవీ
నవంబర్ 10, 2026
తాజావార్తలు
- ●Borewell drilling | బోరుబావులు తవ్వేందుకు 300 అడుగుల వరకు అనుమతివ్వాలి
- ●GSITI Hyderabad | జీఎస్ఐ శిక్షణ సంస్థలో రూ.9.12 కోట్లతో 3 ఆధునిక వసతులు.. ప్రారంభించిన కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్
- ●Singareni | జెన్కోకు రోజుకు 75 వేల టన్నుల బొగ్గు
- ●Jaguar Land Rover | భారత్‌లో తొలిసారిగా జేఎల్ఆర్ ఎలక్ట్రిక్ కార్లు.. రేంజ్ రోవర్ సిరీస్‌లో కొత్త మోడళ్లు..
- ●TGPSC Group 1 Mains Controversy | శిక్షణలో 35% ట్రైనీ డీఎస్పీలు ఫెయిల్.. గ్రూప్-1 అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
- ●బస్స్టేషన్లకు 'మోడల్' హంగులు!

Borewell drilling | బోరుబావులు తవ్వేందుకు 300 అడుగుల వరకు అనుమతివ్వాలి

GSITI Hyderabad | జీఎస్ఐ శిక్షణ సంస్థలో రూ.9.12 కోట్లతో 3 ఆధునిక వసతులు.. ప్రారంభించిన కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్

Singareni | జెన్కోకు రోజుకు 75 వేల టన్నుల బొగ్గు

Jaguar Land Rover | భారత్‌లో తొలిసారిగా జేఎల్ఆర్ ఎలక్ట్రిక్ కార్లు.. రేంజ్ రోవర్ సిరీస్‌లో కొత్త మోడళ్లు..



