Parliament Session | పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం.. లోక్‌సభ ముందుకు మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు
Parliament Session | దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. దేశ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగే అవకాశం ఉన్న మూడు ప్రధాన బిల్లులపై చర్చ కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు (Parliament Special Session) ప్రారంభమయ్యాయి.
Parliament Session | దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. దేశ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగే అవకాశం ఉన్న మూడు ప్రధాన బిల్లులపై చర్చ కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు (Parliament Special Session) ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ (Lok Sabha) ప్రారంభమైంది. సమావేశాలు ప్రారంభం కాగానే మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లును కేంద్రం సభలో ప్రవేశపెట్టింది. మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. దీనిపై చర్చను ప్రారంభించారు.
ఇక ఈ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లును కేంద్రం ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ బిల్లుపై వదంతులు వ్యాప్తి చేయడాన్ని ఆపాలంటూ ప్రతిపక్షాలకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు సూచించారు. పునర్విభజన సాకుతో మహిళా రిజర్వేషన్‌ను వ్యతిరేకించొద్దని కోరారు. ఇక తొలి రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రసంగించే అవకాశం ఉంది. ఇవాళ మధ్యహ్నం 3 గంటల నుంచి 3:30 గంటల మధ్య సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నట్లు తెలిసింది.
Also Read..
డీలిమిటేషన్.. ఆ 68 మంది మద్దతే కీలకం
మహిళా బిల్లుకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయడం పెద్ద కుట్ర: కల్వకుంట్ల కవిత
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






