త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Om Birla | సభ సజావుగా సాగేందుకు సహకరించండి.. రాజ‌కీయ పార్టీల‌కు స్పీక‌ర్‌ ఓం బిర్లా భావోద్వేగ విజ్ఞ‌ప్తి

Om Birla | వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభలో నిరంతరం గందరగోళం నెలకొన్న నేపథ్యంలో అన్ని పార్టీల‌కు లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా (Om Birla) భావోద్వేగ విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌జ‌ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌పై స‌మ‌గ్రంగా, ఫలవంతంగా చర్చించేందుకు వీలుగా స‌భా కార్య‌క‌లాపాలు స‌జావుగా జ‌రిగేలా అన్ని పార్టీలు త‌మ స‌హ‌కారాన్ని అందించాల‌ని కోరారు.

D

National | Published On Aug 10, 2026, 4.41 pm IST

Om Birla | సభ సజావుగా సాగేందుకు సహకరించండి.. రాజ‌కీయ పార్టీల‌కు స్పీక‌ర్‌ ఓం బిర్లా భావోద్వేగ విజ్ఞ‌ప్తి
Advertisement

Om Birla | పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ముగింపు ద‌శ‌కు చేరుకున్నాయి. మ‌రో మూడు రోజుల్లో స‌మావేశాలు ముగియ‌నున్నాయి. అయితే, ఈ స‌మావేశాలు ప్రారంభం నుంచి విప‌క్షాల ఆందోళ‌న‌ల‌తో ఉభ‌య‌స‌భలు దద్ద‌రిల్లుతున్నాయి. స‌భా కార్య‌క‌లాపాలు ఆశించిన రీతిలో ముందుకు సాగ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో అన్ని పార్టీల‌కు లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా (Om Birla) కీల‌క విజ్ఞ‌ప్తి చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాల‌ని కోరారు.

వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభలో నిరంతరం గందరగోళం నెలకొన్న నేపథ్యంలో సభ సజావుగా సాగేలా సహకరించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ (Business Advisory Committee) భేటీలో స్పీకర్ ఓం బిర్లా అన్ని రాజ‌కీయ‌ పార్టీల నేతలని కోరారు. సభ గౌరవాన్ని కాపాడాలని ఆయన భావోద్వేగంతో విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలపై చర్చకు సభ వేదిక కావాలని తెలిపారు. గందరగోళం వదిలి నిబంధనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ప్ర‌జ‌ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌పై స‌మ‌గ్రంగా, ఫలవంతంగా చర్చించేందుకు వీలుగా స‌భా కార్య‌క‌లాపాలు స‌జావుగా జ‌రిగేలా అన్ని పార్టీలు త‌మ స‌హ‌కారాన్ని అందించాల‌ని స్పీక‌ర్ విజ్ఞ‌ప్తి చేశారు.

ఇది కూడా చ‌ద‌వండి : వీబీ జీరామ్‌జీ ప‌థ‌కం.. తొలి నెల‌లోనే స‌గానికి ప‌డిపోయిన ఉపాధి ప‌నిదినాలు

అమిత్ షా స‌మాధాన‌మిస్తారు : రిజుజు

మ‌రోవైపు విద్యార్థుల నిర‌స‌న‌లు స‌హా ప్ర‌తిప‌క్షాలు లేవ‌నెత్తిన అన్ని అంశాల‌పై స‌మ‌గ్ర చ‌ర్చ‌కు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని కేంద్ర పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కిర‌ణ్ రిజుజు తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వ‌యంగా స‌మాధానం ఇస్తార‌ని లోక్‌స‌భ‌కు తెలిపారు. అయితే, చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాలు ఎలాంటి అంత‌రాయాలూ క‌లిగించ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. హోంమంత్రి ప్ర‌క‌ట‌నకు ఆటంకం క‌లిగించేలా స‌భ‌లో గంద‌రగోళం సృష్టించ‌కూడ‌ద‌ని తెలిపారు.

Also Read..

విప‌క్షాల నిర‌స‌న‌ల మ‌ధ్యే.. ట్రైబ్యునల్స్‌ సంస్కరణల బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం

వందేమాత‌రం కాదు.. త‌మిళ్ తాయ్ వాళ్తు ఫస్ట్‌.. త‌మిళ‌నాడు అసెంబ్లీ ఏక‌గ్రీవ తీర్మానం

ప్రభుత్వ వేదికపై పాలిటిక్స్ వద్దు: ఆ ఇండ్లు బరాబర్ కేసీఆర్ కట్టినవే

Advertisement
Advertisement