PM Modi | ఆందోళన వద్దు.. మీకు నేనున్నా: ఎంపీలతో ప్రధాని మోదీ
PM Modi | ఎన్డీయే కూటమిలోకి చేరిన ఎంపీలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. శుక్రవారం ఉదయం పార్లమెంట్ సమావేశాలకు ముందు అల్పాహారం (breakfast) సందర్భంగా దాదాపు 45 మంది ఎంపీలతో భేటీ అయ్యారు.
PM Modi | ఎన్డీయే కూటమిలోకి చేరిన ఎంపీలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. శుక్రవారం ఉదయం పార్లమెంట్ సమావేశాలకు ముందు అల్పాహారం (breakfast) సందర్భంగా దాదాపు 45 మంది ఎంపీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి పలు కీలక సూచనలు చేశారు. కొత్త పార్టీ అని ఎలాంటి ఆందోళన చెందొద్దని సూచించారు. మీకు నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు. ఎన్డీయే కుటుంబంలో ప్రతీ వ్యక్తికీ గౌరవం, రాజకీయాల్లో అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఎంపీకి తన పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
అదే సమయంలో తమ రాష్ట్రాల అభివృద్ధికి ఎంపీలంతా కృషి చేయాలని సూచించారు. తద్వారా దేశం కూడా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఏ అవసరం వచ్చినా నేరుగా పీఎంఓను సంప్రదించొచ్చని సూచించారు. ప్రజలకు, యువతకు నిరంతరం అందుబాటులో ఉంటూ.. వారి కోసం పనిచేయాలని తెలిపారు. పార్లమెంట్ ‘ప్రజాస్వామ్యానికి సర్వోన్నత దేవాలయం’ అని.. దాని చరిత్రను తెలుసుకోవాలని సూచించారు. లోక్‌సభ చర్చల్లో చురుగ్గా పాల్గొనాలని.. ప్రతిపక్ష సభ్యులతో సత్సంబంధాలు కొనసాగించాలని ప్రధాని మోదీ ఎంపీలకు సూచించారు.
అమ్మను జాగ్రత్తగా చూసుకో.. ఎంపీకి కీలక సూచన
శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) నుంచి ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde) వర్గంలో చేరిన ఎంపీలు, తృణమూల్ రెబల్స్‌తో దాదాపు గంటపాటూ ప్రధాని సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీలందరినీ వ్యక్తిగతంగా పలకరించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్ర పవార్ క్షేమ సమాచారం గురించి ఆమె కుమారుడు, ఎంపీ పార్థ్ పవార్‌ను అడిగి తెలసుకున్నారు. అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. పార్థ్ పవార్ తండ్రి.. మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈ ఏడాది జనవరిలో విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. దాంతో ఆ స్థానంలో ఆయన సతీమణి సునేత్రా పవార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
Also Read..
ఐదు నెలలుగా భర్తతో సంబంధమే లేదు.. ఆత్మహత్యకు ప్రేరేపించడం ఎలా అవుతుంది..?
ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇక పూర్తిగా జెమిని ఏఐ.. గూగుల్ అసిస్టెంట్‌కు గుడ్‌బై..
ప్రజల గొంతుకలను అణచివేసేందుకే సోషల్ మీడియా కొత్త నిబంధనలు : కేజ్రీవాల్
తాజావార్తలు
- ●Harish Rao | సిగ్గుచేటు.. ఫేక్ అకౌంట్ గురించి అసెంబ్లీలో చెప్పిన సీఎం రేవంత్: హరీశ్ రావు
- ●Apple iPhone Duo | రూ.2.99 లక్షల నుంచి ఐఫోన్ డ్యుయో.. యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ ఇదే..
- ●Legislative Council Session | పాటలు పాడుతూ.. శాసన మండలిలో కొనసాగుతున్న బీఆర్ఎస్ ఆందోళన
- ●Revanth Reddy | Joining 80’s trend.. రెట్రో లుక్‌లో సీఎం రేవంత్
- ●బియ్యం కాగితంపై మొదలై.. వాల్ స్ట్రీట్ స్క్రీన్లకు చేరిన జపనీస్ ‘క్యాండిల్స్టిక్’ విప్లవం!
- ●Stock Markets | క్రూడ్ ధరల సెగ.. ఫ్లాట్‌గా దేశీయ స్టాక్ మార్కెట్లు..

Harish Rao | సిగ్గుచేటు.. ఫేక్ అకౌంట్ గురించి అసెంబ్లీలో చెప్పిన సీఎం రేవంత్: హరీశ్ రావు

Apple iPhone Duo | రూ.2.99 లక్షల నుంచి ఐఫోన్ డ్యుయో.. యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ ఇదే..

Legislative Council Session | పాటలు పాడుతూ.. శాసన మండలిలో కొనసాగుతున్న బీఆర్ఎస్ ఆందోళన

Revanth Reddy | Joining 80’s trend.. రెట్రో లుక్‌లో సీఎం రేవంత్






