Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ మొదలైన యుద్ధం ఎఫెక్ట్..
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు మళ్లీ ప్రారంభం కావడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు మళ్లీ పతనంలో కొనసాగుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం సోమవారం భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. యుద్ధ ఉద్రిక్తతలు, చమురు ధరలు పెరగడం వంటి కారణాల వల్ల పెట్టుబడిదారులపై తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది.
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు మళ్లీ ప్రారంభం కావడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు మళ్లీ పతనంలో కొనసాగుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం సోమవారం భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. యుద్ధ ఉద్రిక్తతలు, చమురు ధరలు పెరగడం వంటి కారణాల వల్ల పెట్టుబడిదారులపై తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. అయితే దీని ప్రభావం బంగారం, వెండిపై కూడా పడింది. అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1.08 శాతం తగ్గి 4,661 డాలర్ల వద్ద ఉండగా, వెండి ధర 0.26 శాతం తగ్గి 80.09 డాలర్ల వద్ద ఉంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 642 పాయింట్లు పడిపోయి 1,51,888 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 34 పాయింట్లు తగ్గి 2,61,888 వద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,213 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,21,704 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,52,130 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,21,300 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.2,200 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,945 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,11,560గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,39,450 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,94,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2వేలు తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,410 ఉండగా, 8 గ్రాముల ధర రూ.91,280గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,14,100 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,41,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.1,600 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,75,000 ఉండగా, తులం ధర రూ.2,750గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ ధరలో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,85,000 ఉండగా, తులం ధర రూ.2,850 గా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. బులియన్ మార్కెట్లలో అనిశ్చితి..
జులై 6, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు మంచి సమయం..
జులై 4, 2026

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో పెట్టుబడిదారుల జోరు.. ఒక్క రోజులోనే రూ.32వేలు పెరిగిన పసిడి ధర..
జులై 3, 2026
తాజావార్తలు
- ●Divyabharathi | హాట్ ఫొటోలతో రచ్చ చేసిన సుడిగాలి సుధీర్ హీరోయిన్
- ●Uttam Kumar Reddy | 2028 జూన్ కల్లా ఎస్ ఎల్ బీసీని పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ●Corporation chairmens tenure | రేపటితో 34 కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవీ కాలం పూర్తి..
- ●Ponnam Prabhakar | రాముడి పేరుతో దోచుకున్నందుకు బీజేపీ క్షమాపణ చెప్పాలి
- ●RGI Airport | ప్రయాణీలకు యూడీఎఫ్ షాక్.. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న జీఎంఆర్..!
- ●Sandeep Vanga | ప్రభాస్ స్పిరిట్ కంటే ముందే సందీప్ వంగా కొత్త మూవీ రిలీజ్ - రోమాంచకం గ్లింప్స్ వచ్చేసింది

Divyabharathi | హాట్ ఫొటోలతో రచ్చ చేసిన సుడిగాలి సుధీర్ హీరోయిన్

Uttam Kumar Reddy | 2028 జూన్ కల్లా ఎస్ ఎల్ బీసీని పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Corporation chairmens tenure | రేపటితో 34 కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవీ కాలం పూర్తి..

Ponnam Prabhakar | రాముడి పేరుతో దోచుకున్నందుకు బీజేపీ క్షమాపణ చెప్పాలి



