Movie Collections | నాగబంధం వర్సెస్ రావు బహదూర్ – ఈ వారం రిలీజైన సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ దేనికి వచ్చాయంటే?
ఈ వారం సత్యదేవ్ రావు బహదూర్‌తో పాటు విరాట్ కర్ణ నాగబంధం సినిమాలు థియేటర్ల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. మూడు రోజుల్లో ఈ సినిమాలకు వచ్చిన కలెక్షన్స్ ఎంతంటే?
Entertainment | Published On Jul 6, 2026, 6.17 pm IST
Movie Collections | ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విరాట్ కర్ణ నాగబంధం, సత్యదేవ్ రావుబహదూర్ పోటీపడ్డాయి. మైథలాజికల్ యాక్షన్‌గా నాగబంధం తెరకెక్కగా... సైకలాజికల్ డ్రామాగా రావుబహదూర్ రూపొందింది. ఈ రెండు సినిమాల్లో కలెక్షన్స్ పరంగా టాప్‌లో ఏది ఉందంటే?
రికవరీ...
నాగబంధం మూడు రోజుల్లో 12.80 కోట్ల గ్రాస్...6.10 కోట్ల షేర్ కలెక్షన్స్‌ను సాధించింది. ఇరవై ఎనిమిది కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ ఇప్పటివరకు ఇరవై ఐదు శాతం లోపే రికవరీ సాధించింది. రోజురోజుకు కలెక్షన్స్ తగ్గుముఖం పడుతోన్న నేపథ్యంలో నాగబంధం లాభాల్లోకి అడుగుపెట్టడం అనుమానంగానే కనిపిస్తోంది.
దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకు అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటించారు. శరణ్య, జగపతిబాబు, రిషబ్ కీలక పాత్రల్లో కనిపించారు.
సనాతన ధర్మం...
మైథాలజీ అంశాలకు సనాతన ధర్మం కాన్సెప్ట్‌ను జోడించి దర్శకుడు ఈ సినిమాను రూపొందించారు. కాన్సెప్ట్ బాగున్నా ఎంగేజింగ్‌గా చెప్పడంలో తడబడిపోవడం మైనస్‌గా మారింది. ఇమేజ్ ఉన్న హీరో కాకపోవడం కూడా కలెక్షన్స్ తక్కువగా రావడానికి ఓ కారణంగా చెబుతున్నారు.
రావు బహదూర్...
సత్యదేవ్ రావుబహదూర్ సినిమా ఎనిమిదిన్నర కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మూడు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 8.10 కోట్ల గ్రాస్, 3.90 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ దక్కించుకుంది. లాభాల్లోకి అడుగుపెట్టడానికి మరో 4.60 కోట్ల దూరంలో ఉంది.
మహేష్‌బాబు ప్రొడ్యూసర్ కావడం, అగ్రెసివ్ ప్రమోషన్స్ ఈ సినిమాకు హెల్పయ్యాయి. సైకలాజికల్ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి వెంకటేష్ మహా దర్శకత్వం వహించాడు.
దీపా థామస్...
రావు బహదూర్ సినిమాలో దీపా థామస్ హీరోయిన్‌గా నటించింది. స్మరణ్ సాయి మ్యూజిక్ అందించాడు. కాన్సెప్ట్‌తో పాటు సత్యదేవ్ యాక్టింగ్‌కు ప్రశంసలు వస్తున్నాయి. రెగ్యులర్ ఆడియెన్స్ కథకు కనెక్ట్ కావడం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
రావుబహదూర్ అనుమానం...
రాజవంశీయుడైన రామప్ప రావు బహదూర్ క్యాన్సర్ కారణంగా చివరి దశలో ఉంటాడు. అతడిని ఓ అనుమానం చాలా కాలంగా వెంటాడుతుంది. అదేమిటి? రామప్ప లైఫ్‌లోకి వచ్చిన రేణుక ఎవరు అనే అంశాలతో ఈ మూవీ రూపొందింది. ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య తర్వాత సత్యదేవ్, వెంకటేష్ మహా కాంబినేషన్‌లో వచ్చిన సెకండ్ మూవీ ఇది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Etela Rajender | రేవంత్ మూర్ఖపు ప్రయత్నాలు బంజేయ్.. వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్‌లు ఆన్ జేయి
- ●KTR | మీరు వడ్ల బస్తాలు మోస్తుంటే.. రేవంతేమో డబ్బుల బస్తాలు మోస్తుండు
- ●Telangana SIR Process Status | తెలంగాణలో జోరుగా SIR ప్రక్రియ: పంపిణీలో టాప్.. డిజిటైజేషన్లో ఢమాల్, జిల్లాల వారీగా రిపోర్ట్ ఇదే!
- ●Jalalabad Renamed Parshurampuri | జలాలాబాద్ ఇక నుంచి పరశురాంపురి
- ●Cult.fit IPO | పెట్టుబడిడారులకు అలర్ట్.. రూ.4వేల కోట్ల ఐపీఓకు కల్ట్.ఫిట్ సిద్ధం..
- ●Grace Antony | వాటే ట్రాన్స్ఫర్మేషన్ - బొద్దుగుమ్మ నుంచి ముద్దుగుమ్మగా మారిన మలయాళ బ్యూటీ!

Etela Rajender | రేవంత్ మూర్ఖపు ప్రయత్నాలు బంజేయ్.. వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్‌లు ఆన్ జేయి

KTR | మీరు వడ్ల బస్తాలు మోస్తుంటే.. రేవంతేమో డబ్బుల బస్తాలు మోస్తుండు

Telangana SIR Process Status | తెలంగాణలో జోరుగా SIR ప్రక్రియ: పంపిణీలో టాప్.. డిజిటైజేషన్లో ఢమాల్, జిల్లాల వారీగా రిపోర్ట్ ఇదే!

Jalalabad Renamed Parshurampuri | జలాలాబాద్ ఇక నుంచి పరశురాంపురి






