త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana SIR Process Status | తెలంగాణలో జోరుగా SIR ప్రక్రియ: పంపిణీలో టాప్.. డిజిటైజేషన్‌లో ఢమాల్, జిల్లాల వారీగా రిపోర్ట్ ఇదే!

తెలంగాణలో SIR ఎన్యూమరేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 90% ఫారాల పంపిణీ పూర్తయినా, డిజిటైజేషన్‌లో మాత్రం హైదరాబాద్, రంగారెడ్డి వెనుకబడ్డాయి.

J

Telangana | Published On Jul 6, 2026, 6.16 pm IST

Telangana SIR Process Status | తెలంగాణలో జోరుగా SIR ప్రక్రియ: పంపిణీలో టాప్.. డిజిటైజేషన్‌లో ఢమాల్, జిల్లాల వారీగా రిపోర్ట్ ఇదే!
Advertisement
  • రాష్ట్రవ్యాప్తంగా 90.52 శాతం ఎన్యూమరేషన్ ఫారాల (EFs) పంపిణీ పూర్తి
  • నిర్మల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వంద శాతం ఫారాలు అందజేత
  • రాష్ట్రవ్యాప్తంగా డిజిటైజేషన్ ప్రక్రియ కేవలం 7.80 శాతమే పూర్తి
  • హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో డిజిటైజేషన్ నత్తనడకన

Telangana SIR Process Status | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన SIR (Special Intensive Revision) ఎన్యూమరేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3.38 కోట్ల మంది ఓటర్లకు గాను.. ఇప్పటికే 90 శాతానికి పైగా ఎన్యూమరేషన్ ఫారాల (EFs) పంపిణీ పూర్తయింది. అయితే, క్షేత్రస్థాయిలో ఫారాల పంపిణీలో ఉన్న స్పీడ్.. ఆ డేటాను ఆన్‌లైన్ చేసే డిజిటైజేషన్ వర్క్‌లో మాత్రం కనిపించడం లేదు.

పంపిణీలో ఆ రెండు జిల్లాలు భేష్

తాజా స్టేటస్ రిపోర్ట్ ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా.. అధికారుల బృందాలు ఇప్పటివరకు 3,06,21,142 (90.52%) ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశాయి. ముఖ్యంగా నిర్మల్, జోగులాంబ గద్వాల జిల్లాల యంత్రాంగం 100 శాతం ఫారాల పంపిణీ పూర్తి చేసి ఆదర్శంగా నిలిచింది. పల్లెల్లో ఎన్యూమరేటర్లు చురుకుగా పనిచేస్తుండటంతో రూరల్ ఏరియాల్లో ప్రక్రియ వేగంగా పూర్తవుతోంది.

డిజిటైజేషన్‌లో వెనుకబాటు

డేటా కలెక్షన్‌లో స్పీడ్ ఉన్నప్పటికీ.. సేకరించిన సమాచారాన్ని కంప్యూటరైజ్ చేసే ప్రాసెస్ నత్తనడకన సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం 26,38,708 ఫారాలు (7.80%) మాత్రమే డిజిటైజ్ అయ్యాయి. ఈ డిజిటైజేషన్ విభాగంలో యాదాద్రి భువనగిరి జిల్లా 34.88 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో కుమురం భీమ్ ఆసిఫాబాద్ (27.91%), నల్గొండ (23.44%), ఖమ్మం (20.90%) జిల్లాలు ఉన్నాయి.

హైదరాబాద్, రంగారెడ్డిల్లో మరీ ఘోరం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో SIR ప్రక్రియ అత్యంత నెమ్మదిగా సాగుతోంది. రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్‌లో 47,36,669 మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటివరకు కేవలం 71.14 శాతం ఫారాల పంపిణీ మాత్రమే జరిగింది. రంగారెడ్డి జిల్లాలో 36.9 లక్షల మందికి గాను 87.35% ఫారాలు పంపిణీ చేశారు.

ఇక డిజిటైజేషన్ విషయానికి వస్తే అర్బన్ జిల్లాలు మరీ అట్టడుగున నిలిచాయి. మేడ్చల్ మల్కాజిగిరిలో అత్యల్పంగా కేవలం 1.08 శాతం డేటా మాత్రమే డిజిటైజ్ అవ్వగా.. రంగారెడ్డిలో 2.48 శాతం, వికారాబాద్‌లో 2.67 శాతం చొప్పున మాత్రమే ప్రాసెస్ కంప్లీట్ అయింది. డేటా ఎంట్రీ ఆపరేటర్ల కొరత, సాంకేతిక సమస్యల వల్లే ఈ ప్రక్రియ ఆలస్యమవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement