త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

oxygen cylinder explodes | పేలిన ఆక్సిజ‌న్ సిలిండ‌ర్‌.. ఒక‌రు మృతి

oxygen cylinder explodes | ఢిల్లీలోని ఓఖ్లా (Okhla) ఫేజ్‌-1లో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ పేలింది. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు ప్రాణాలు కోల్పోగా.. న‌లుగురు వ్య‌క్తులు గాయ‌ప‌డ్డారు.

D

National | Published On Sep 9, 2026, 1.20 pm IST

oxygen cylinder explodes | పేలిన ఆక్సిజ‌న్ సిలిండ‌ర్‌.. ఒక‌రు మృతి
Advertisement

oxygen cylinder explodes | త్రినేత్ర‌.న్యూస్ : ఢిల్లీ (Delhi)లో ప్ర‌మాదం సంభ‌వించింది. ఓఖ్లా (Okhla) ఫేజ్‌-1లో ఒక క‌మ్యూనిటీ హాల్ స‌మీపంలో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ పేలింది (oxygen cylinder explodes). ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు ప్రాణాలు కోల్పోగా.. న‌లుగురు గాయ‌ప‌డ్డారు. ఉద‌యం 11 గంట‌ల స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. స‌మాచారం అందుకున్న పోలీసులు, స‌హాయ‌క బృందాలు హుటాహుటిన ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. గాయ‌ప‌డిన వారిని వెంట‌నే చికిత్స నిమిత్తం స‌మీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. సిలిండ‌ర్ పేలుడుకు గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు. దీనిపై ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. కాగా, రెండు రోజుల క్రితం వివేక్ విహార్ ప్రాంతంలో ఎల్‌పీజీ సిలిండ‌ర్ పేల‌డంతో ఇద్ద‌రు వ్య‌క్తులు గాయ‌ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న CBD శాదరా ప‌రిధిలోని వివేక్ విహార్ పోలీసు స్టేష‌న్ వెనుక ఉన్న ఓ గుడిసెలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అనిల్ దాస్ (35), అతని భార్య ఖుష్బూ (30) తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఇప్పుడు ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ పేలి ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు.

Also Read..

సూర‌త్ టెక్స్‌టైల్ మార్కెట్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. దుకాణాలు ధ్వంసం

ఆ మెజిస్ట్రేట్‌కు ఎంత ధైర్యం..? లా విద్యార్థికి నోటీసులు ఇవ్వ‌డంపై సుప్రీం ఆగ్ర‌హం

అదానీ ఎయిర్‌పోర్ట్స్‌కు భారీ పెట్టుబడి.. రూ.9,825 కోట్ల సమీకరణ..

Advertisement
Advertisement