త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Adani Enterprises | అదానీ ఎయిర్‌పోర్ట్స్‌కు భారీ పెట్టుబడి.. రూ.9,825 కోట్ల సమీకరణ..

Adani Enterprises | అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ కీలక ప్రకటన చేసింది. సంస్థకు చెందిన విమానాశ్రయ విభాగం అదానీ ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (ఏఏహెచ్‌ఎల్‌)లో భారీగా నిధుల సమీకరణకు మార్గం సుగమమైంది. ప్రముఖ దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి సుమారు రూ.9,825 కోట్లు అంటే దాదాపు 100 కోట్ల డాలర్లను కొత్త ఈక్విటీ మూలధనంగా సమీకరించేందుకు ఏఏహెచ్‌ఎల్‌ బైండింగ్‌ ఒప్పందాలు కుదుర్చుకుంది.

S

Business | Published On Sep 9, 2026, 12.31 pm IST

Adani Enterprises | అదానీ ఎయిర్‌పోర్ట్స్‌కు భారీ పెట్టుబడి.. రూ.9,825 కోట్ల సమీకరణ..
Advertisement

Adani Enterprises | అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ కీలక ప్రకటన చేసింది. సంస్థకు చెందిన విమానాశ్రయ విభాగం అదానీ ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (ఏఏహెచ్‌ఎల్‌)లో భారీగా నిధుల సమీకరణకు మార్గం సుగమమైంది. ప్రముఖ దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి సుమారు రూ.9,825 కోట్లు అంటే దాదాపు 100 కోట్ల డాలర్లను కొత్త ఈక్విటీ మూలధనంగా సమీకరించేందుకు ఏఏహెచ్‌ఎల్‌ బైండింగ్‌ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ లావాదేవీతో ఏఏహెచ్‌ఎల్‌ ప్రీ-మనీ ఈక్విటీ విలువ సుమారు 18 బిలియన్‌ డాలర్లుగా నిర్ణయించినట్లు అదానీ గ్రూప్‌ వెల్లడించింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌, గుర్తించిన పెట్టుబడిదారుల మధ్య బుధ‌వారం షేర్‌హోల్డర్స్‌ అగ్రిమెంట్‌ కుదిరింది. ఏఏహెచ్‌ఎల్‌ కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా నిధులను సమీకరించనుంది. మొత్తం పెట్టుబడిదారుల వాటా మూడు దశల్లో పెట్టుబడి పూర్తయిన తర్వాత ఏఏహెచ్‌ఎల్‌లో సుమారు 5.54 శాతంగా ఉండనుంది. చివరి దశ పెట్టుబడి జూలై 2027 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.

కొత్త ఈక్విటీ షేర్ల జారీ..

ఈ పెట్టుబడి కన్సార్టియంలో ఆల్ఫా వేవ్‌ గ్లోబల్‌, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌, టెమాసెక్‌, బ్లాక్‌రాక్‌ నిర్వహించే నిధులు ఉన్నాయి. ఒప్పందంలో ఆల్ఫా వేవ్ 3 ఎల్‌పీ, పీఐ ఆపర్చునిటీస్‌ ఫండ్‌-ఐ స్కీమ్‌-2, పీఐ ఆపర్చునిటీస్‌ ఫండ్‌-2, టెమాసెక్‌కు చెందిన జాంగ్‌సాంగ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ పీటీఈ లిమిటెడ్‌, అలాగే బ్లాక్‌రాక్‌ గ్లోబల్‌ అలొకేషన్‌ పోర్ట్‌ఫోలియో, బ్లాక్‌రాక్‌ గ్లోబల్‌ ఫండ్స్‌-గ్లోబల్‌ అలొకేషన్‌ ఫండ్‌, బ్లాక్‌రాక్‌ స్ట్రాటజిక్‌ ఇన్‌కమ్‌ ఆపర్చునిటీస్‌ పోర్ట్‌ఫోలియో, బ్లాక్‌రాక్‌ గ్లోబల్‌ ఫండ్స్‌-ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ గ్లోబల్‌ ఆపర్చునిటీస్‌ ఫండ్‌ వంటి సంస్థలు ఉన్నాయి. ఇది అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఇప్పటికే ఉన్న వాటాను పెట్టుబడిదారులకు విక్రయించే లావాదేవీ కాదు. ఏఏహెచ్‌ఎల్‌ నేరుగా కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా మూలధనాన్ని సమీకరించనుంది. ప్రస్తుతం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఏఏహెచ్‌ఎల్‌లో 100 శాతం వాటాను కలిగి ఉంది. కొత్త షేర్ల జారీ పూర్తయిన తర్వాత పెట్టుబడిదారులు కలిపి సుమారు 5.54 శాతం వాటాను పొందుతారు. అంటే ఇది ఏఏహెచ్‌ఎల్‌కు నేరుగా కొత్త మూలధనం వచ్చే ప్రైమరీ ఈక్విటీ ఇన్ఫ్యూజన్‌ అన్నమాట.

అన్ని హ‌క్కులూ ఏఏహెచ్ఎల్‌కే..

షేర్‌హోల్డర్స్‌ అగ్రిమెంట్‌లో పెట్టుబడిదారుల హక్కులు, బాధ్యతలకు సంబంధించిన కీలక నిబంధనలు ఉన్నాయి. భవిష్యత్తులో డైరెక్టర్లను నియమించే హక్కులు, ఏఏహెచ్‌ఎల్‌ కొత్త షేర్లు జారీ చేసినప్పుడు ప్రాధాన్యంగా వాటిని సబ్‌స్క్రైబ్‌ చేసుకునే హక్కు, సంస్థ మూలధన నిర్మాణంలో మార్పులను నియంత్రించే హక్కులు వంటి అంశాలు ఇందులో ఉన్నట్లు దాఖలు చేసిన పత్రాల్లో పేర్కొన్నారు. ఈ హక్కులు తొలి దశ పెట్టుబడి పూర్తయిన తర్వాత అమల్లోకి వస్తాయి. అనంతరం ఈ నిబంధనలను ఏఏహెచ్‌ఎల్‌ ఆర్టికల్స్‌ ఆఫ్‌ అసోసియేషన్‌లో పొందుపరచనున్నారు. సమీకరించే నిధులను ప్రధానంగా మూడు కీలక రంగాల్లో వినియోగించనున్నట్లు అదానీ గ్రూప్‌ తెలిపింది. ఏఏహెచ్‌ఎల్‌ ఆధ్వర్యంలోని విమానాశ్రయాల మౌలిక సదుపాయాలను విస్తరించడం, ఆధునీకరించడం మొదటి ప్రాధాన్యతగా ఉంది. దీంతో భవిష్యత్తులో ఏఏహెచ్‌ఎల్‌ నిర్వహించే విమానాశ్రయాల సామర్థ్యాన్ని ఏటా సుమారు 20 కోట్ల మంది ప్రయాణికులకు పెంచాలని లక్ష్యంగా నిర్ణ‌యించుకుంది.

Advertisement
Advertisement