త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | నోయిడా ఎయిర్‌పోర్టుకు ప్ర‌ధాని మోదీ పేరు.. యూపీ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం

PM Modi | నోయిడాలోని జేవార్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం (Noidas Jewar Airport) పేరును న‌రేంద్ర మోదీ (PM Modi) ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టుగా మారుస్తూ యూపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

D

National | Published On Oct 9, 2026, 3.41 pm IST

PM Modi | నోయిడా ఎయిర్‌పోర్టుకు ప్ర‌ధాని మోదీ పేరు.. యూపీ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం
Advertisement

PM Modi | త్రినేత్ర న్యూస్ : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (Uttar Pradesh) ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. నోయిడాలోని జేవార్ (Noidas Jewar Airport) అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం పేరును న‌రేంద్ర మోదీ (PM Modi) ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు, నోయిడా-జేవార్ (Narendra Modi International Airport, Noida-Jewar)గా మారుస్తూ యోగి స‌ర్కార్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన తీర్మానానికి రాష్ట్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.

ల‌క్నోలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఈ విష‌యాన్ని సీఎం యోగి ఆదిత్య‌నాథ్ (CM Yogi Adityanath0 అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ విమానాశ్రయం భవిష్యత్తులో ఉత్తరప్రదేశ్‌లోనే అతిపెద్ద విమానాశ్రయంగానే కాకుండా, దేశంలోనే ఒక ప్రధాన ఏవియేషన్ హబ్‌గా అవ‌త‌రించ‌నుంద‌ని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ప్ర‌భుత్వ అధినేత‌గా 25 సంవత్సరాల నిరంతర ప్రజా సేవను పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

కాగా, రూ. 11,282 కోట్ల వ్యయంతో ఈ ఎయిర్‌పోర్టును నిర్మించారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత దేశంలోనే ఇది రెండో అతిపెద్ద‌ అంతర్జాతీయ విమానాశ్రయం. వైడ్-బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ల్యాండింగ్‌కు అనుకూలం 3,900 మీటర్లు పొడ‌వైన ర‌న్‌వేతో ఈ ఎయిర్‌పోర్టును అత్యాధునిక సౌక‌ర్యాల‌తో నిర్మించారు. స్విస్ సంస్థ జూరిచ్ ఎయిర్‌పోర్ట్ ఇంటర్నేషనల్ AGకి చెందిన‌ అనుబంధ సంస్థ యమునా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ దీనిని నిర్మించింది. ఈ ఏడాది మార్చి 28న ప్ర‌ధాన మంత్రి చేతుల మీదుగా ఈ ఎయిర్‌పోర్టును ప్రారంభించారు. జూన్ 15న క‌మ‌ర్షియ‌ల్ విమానాల రాక‌పోక‌లు ప్రారంభ‌మ‌య్యాయి.

Also Read..

రాష్ట్ర‌ప‌తిని క‌ల‌వ‌నున్న ఇండీ కూట‌మి ఎంపీలు

స‌ర్ మీద దేశ‌మంతా కొట్లాడుతుంటే.. కేసీఆర్ ఎందుకు మాట్లాడ్త‌లే

ఆంథ్రోపిక్‌తో డీల్.. హెక్సావేర్ షేర్లకు జోష్..

Advertisement
Advertisement