త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maheshkumar Goud | స‌ర్ మీద దేశ‌మంతా కొట్లాడుతుంటే.. కేసీఆర్ ఎందుకు మాట్లాడ్త‌లే

Maheshkumar Goud | స‌ర్ మీద దేశమంతా కొట్లాడుతుంటే బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ ఎందుకు మాట్లాడ్త‌లేర‌ని టీపీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్‌గౌడ్ ప్ర‌శ్నించారు. బీజేపీకి కేసీఆర్ ఎందుకు భ‌య‌ప‌డుతున్నార‌న్నారు.

S

Telangana | Published On Oct 9, 2026, 3.36 pm IST

Maheshkumar Goud | స‌ర్ మీద దేశ‌మంతా కొట్లాడుతుంటే.. కేసీఆర్ ఎందుకు మాట్లాడ్త‌లే
Advertisement
  • ఆయ‌న బీజేపీకి ఎందుకు భ‌య‌ప‌డుతున్న‌రు
  • బీజేపీకి వ్య‌తిరేకంగా మాట్లాడితే కేటీఆర్‌ను అరెస్టు చేస్తార‌ని భ‌యం
  • కిష‌న్‌రెడ్డితో లోపాయ‌కారి ఒప్పందం చేసుకున్న‌రేమో
  • ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ వ‌య‌సును లెక్క చేయ‌కుండా కొట్లాడుతున్న‌రు
  • టీపీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్య‌లు

Maheshkumar Goud | త్రినేత్ర న్యూస్‌: స‌ర్ మీద దేశమంతా కొట్లాడుతుంటే బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ ఎందుకు మాట్లాడ్త‌లేర‌ని టీపీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్‌గౌడ్ ప్ర‌శ్నించారు. బీజేపీకి కేసీఆర్ ఎందుకు భ‌య‌ప‌డుతున్నార‌న్నారు. హ‌రీశ్ రావు, కేటీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నార‌ని నిల‌దీశారు. బీజేపీకి వ్య‌తిరేకంగా మాట్లాడితే ఈ ఫార్ములా కేసులో అరెస్టు చేస్తార‌నే భ‌యంతో సైలెంట‌య్యార‌ని ఎద్దేవా చేశారు. ఖ‌ర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ వ‌య‌సును లెక్క చేయ‌కుండా కొట్లాడుత‌న్నార‌ని కొనియాడారు. బీజేపీ మిత్ర ప‌క్షాలు సైతం మౌనంగా ఉన్నాయ‌న్నారు. గాంధీభ‌వ‌న్‌లో శుక్ర‌వారం ఆయ‌న మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌పై సూటి ప్ర‌శ్న‌లు సంధించారు.

బీఆర్ఎస్‌లో ఉలుకు, ప‌లుకు లేదు

స‌ర్ (SIR) ప్రక్రియ మీద దేశ వ్యాప్తంగా బీజేపీ, దాని మిత్ర పక్షాలు తప్ప అన్ని పార్టీలు రోడ్డెక్కాయి. మోదీ, అమిత్ షా రాజకీయ తీరుపై పోరాటం చేస్తుంటే తెలంగాణ బీఆర్ఎస్‌ పాత్ర ఎక్క‌డుంది. తెలంగాణలో బీఆర్ఎస్‌ ఎందుకు మౌనంగా ఉంది. సీఈసీ తప్పిదం చేస్తుంటే హరీష్ రావు, కేటీఆర్ ఎందుకు మాట్లాడట్లేదు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మాట్లాడిన పాపాన పోలేదు. బీఆర్ఎస్‌లో ఉలుకు, ప‌లుకు లేదు. నిరసన కార్యక్రమం చేయలేదు. బీజేపీతో బీఆర్ఎస్‌ లోపాయికారి ఒప్పందం ఉంది. కాళేశ్వరంలో సీబీఐ అరెస్టు చేస్తదేమో అని భయం. ముషీరాబాద్‌లో ప్రింటెడ్ ఫామ్ మీద సంతకం పెడుతున్నారు. స‌ర్‌లో దళితుల, మైనారిటీ, గిరిజనుల ఓట్లు తొలగిస్తున్నారు. వెస్ట్ బెంగాల్ లో రోహింగ్యాల పేరుతో మమత బెనర్జీ గెలవకుండా ఆపారు. బీహార్‌లో ఆర్జేడీని గెలవకుండా ఆపారు.

స్టేట్ సీఈసీ ఒప్పుకున్నరు

ఉండటానికి ఇల్లు లేదన్న కేటీఆర్ కు ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయి. ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఏక్కడివ‌ని ప్రజలు అడుగుతున్నారు. బండారం బయట పడుతుందని బీఆర్ఎస్‌ నాయకులు స‌ర్‌పై మాట్లాడట్లేదు. జ్ఞానేశ్వర్ కుమార్ ను తొలగించే వరకు నిరసన ర్యాలీలు ఉంటాయి. రాహుల్ గాంధీ ప్రధాని కావాలనుకుంటే 2009లో అయ్యేవాడు. శాశ్వతంగా అధికారంలో ఉండాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను తొలగించారు. జ్ఞానేశ్వర్ కుమార్ లాంటి తొత్తులను సీఈసీగా పెట్టుకుంది. 36 వేల బీఎల్‌వో ఫామ్స్ ఇస్తే స్టేట్ సీఈసీ తప్పిదం వల్ల‌ తక్కువ చూపించారు. తప్పు జరిగిందని స్టేట్ సీఈసీ ఒప్పుకున్నారు. వివిధ కారణాలతో రాష్ట్రంలో 90 లక్షల ఓట్లు తొలగిస్తున్నారు. టీఎన్‌ శేషన్, లింగ్డో, కృష్ణమూర్తి హయాంలో స‌ర్‌ న్యాయంగా జరిగింది.

నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ‌, పంజాబ్‌

ప్రకాష్ రాజ్ మాట్లాడే మాటల్లో వాస్తవం లేదు. దేశంలో అర్హత ఉన్న ప్రతి ఓటు కాపాడటమే కాంగ్రెస్ ధ్యేయం. స‌ర్‌పై ఏడాది నుంచి తీవ్రంగా కసరత్తు చేస్తున్నాం. బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ, పంజాబ్. రాష్ట్రంలో దురుద్దేశ పూర్వకంగా స‌ర్‌ ప్రక్రియ జరుగుతుంది. ప్రజా క్షేత్రంలో నిరసనలు తెలపడం తప్పు కాదు. బీఆర్ఎస్ నేతలు స‌ర్‌విషయంలో ధర్నాలు చేయట్లేదు. బీజేపీ, కిషన్ రెడ్డితో బలమైన లోపాయికారి ఒప్పందంతో బీఆర్ఎస్ స‌ర్‌పై మాట్లాడట్లేదని మాకు అనుమానం ఉంది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలపై ప్రశ్నించే ఏ పార్టీకైనా మద్దతు ఇస్తాం అని మ‌హేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement