త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

van swept away | నీటి ప్ర‌వాహంలో కొట్టుకుపోయిన వ్యాన్‌.. తొమ్మిది మంది మృతి

van swept away | మ‌ధ్య‌ప్ర‌దేశ్ (Madhya Pradesh)లోని రాజ్‌గ‌ఢ్ (Rajgarh) జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తున్న కాలువ‌ను దాటే క్ర‌మంలో ఓ వ్యాను వ‌ర‌ద ప్ర‌వాహంలో కొట్టుకుపోయింది (van swept away).

D

National | Published On Aug 10, 2026, 5.21 pm IST

van swept away | నీటి ప్ర‌వాహంలో కొట్టుకుపోయిన వ్యాన్‌.. తొమ్మిది మంది మృతి
Advertisement

van swept away | మ‌ధ్య‌ప్ర‌దేశ్ (Madhya Pradesh)లోని రాజ్‌గ‌ఢ్ (Rajgarh) జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. భారీ వ‌ర్షాల కార‌ణంగా ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తున్న కాలువ‌ను దాటే క్ర‌మంలో ఓ వ్యాను వ‌ర‌ద ప్ర‌వాహంలో కొట్టుకుపోయింది (van swept away). ఈ ఘ‌ట‌న‌లో బాలిక‌ స‌హా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. సారంగ్‌పూర్ ప‌ట్ట‌ణం స‌మీపంలోని ప‌ద‌న బైపాస్ క‌ల్వ‌ర్టు (Padana bypass culvert) వ‌ద్ద సోమ‌వారం ఉద‌యం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్ర‌మాద స‌మ‌యంలో వ్యాన్‌లో 11 మంది ఉన్నారు. భారీ వ‌ర్షాల కార‌ణంగా వాగులు, వంక‌లు ప్ర‌మాద‌క‌ర‌స్థాయిలో పొంగి పొర్లుతున్నాయి. వ‌ద‌ర ప్ర‌వాహం ఎక్కువ‌గా ఉండ‌టంతో ముందుకు వెళ్లొద్ద‌ని స్థానికులు, స్థానిక యంత్రాంగం ఎంత‌చెప్పినా డ్రైవ‌ర్ వినిపంచుకోలేదు. దీంతో వ‌ర‌ద ఉద్ధృతికి వ్యాన్ నీటిలో కొట్టుకుపోయింది. ఇద్ద‌రు ప్ర‌యాణికులు నీటిలో దూసుకుంటూ ప్రాణాల‌తో బ‌య‌ట‌పడ్డారు. ప్ర‌మాద స‌మాచారం అందుకున్న రెస్య్కూ టీమ్ హుటాహుటిన ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టింది. తొమ్మిది మంది మృత‌దేహాల‌ను బ‌య‌ట‌కు తీసింది.

Also Read..

సభ సజావుగా సాగేందుకు సహకరించండి.. రాజ‌కీయ పార్టీల‌కు స్పీక‌ర్‌ ఓం బిర్లా భావోద్వేగ విజ్ఞ‌ప్తి

విప‌క్షాల నిర‌స‌న‌ల మ‌ధ్యే.. ట్రైబ్యునల్స్‌ సంస్కరణల బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం

1970ల నాటి ద్రవ్యోల్బణం మళ్లీ రానుందా.. బంగారం ధరలు భారీగా పెర‌గ‌నున్నాయా..?

Advertisement
Advertisement