త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

రేవంత్‌రెడ్డి ముప్పై మాసాలు నిద్ర పోయిండు..

Jeevan Reddy | ‘ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే పరిణామాలపై గత ఆరు నెలలుగా హెచ్చరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు వరుణ యాగం చేయడం విస్మయం కలిగిస్తోంది. రేవంత్‌రెడ్డి ముప్పై మాసాలు నిద్ర పోయిండు’ అని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి విమర్శించారు. జ

P

Telangana | Published On Aug 10, 2026, 4.44 pm IST

రేవంత్‌రెడ్డి ముప్పై మాసాలు నిద్ర పోయిండు..
Advertisement
  • ప్రభుత్వం చేయాల్సిన పని చేయకుండా వరుణ యాగమా?
  • బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి ఆగ్ర‌హం

Jeevan Reddy | ‘ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే పరిణామాలపై గత ఆరు నెలలుగా హెచ్చరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు వరుణ యాగం చేయడం విస్మయం కలిగిస్తోంది. రేవంత్‌రెడ్డి ముప్పై మాసాలు నిద్ర పోయిండు’ అని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి విమర్శించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కురిసిన వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడం అదృష్టమని జీవన్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే దేవుడు కరుణించాడ‌ని, వర్షాలు ఇంకా వర్షాలు కురవాలని కోరుకుంటున్నామ‌న్నారు. యాగాలు చేయడం మంచిదేన‌న్న ఆయ‌న‌.. వాటి ద్వారా ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వం చేయాల్సిన మానవ ప్రయత్నాలు చేయకుండా యాగాలు చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. మహారాష్ట్రతో చర్చలు జరపాల్సి ఉంటే ప్రభుత్వం ఇప్పటి వరకు ఏం చేసిందని నిలదీశారు. నీటి సమస్యలను పరిష్కరించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. ఇప్పుడు యాగాలు చేయడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.

కేసీఆర్‌ దూరదృష్టితోనే కాళేశ్వ‌రం..

గతంలో ఆమోదం పొందిన ప్రాజెక్టులను పునఃపరిశీలించే అవకాశం లేదని జీవన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ దూరదృష్టితోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని, తెలంగాణకు భవిష్యత్తు చూపించారని పేర్కొన్నారు. ఇప్పటికే ఆమోదం పొందిన ప్రాజెక్టులపై గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు వద్ద చంద్రబాబునాయుడు అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ హక్కులను హరించే కుట్రలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. చంద్రబాబునాయుడు కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్రానికి నష్టం జరుగుతోందని విమర్శించారు. చంద్రబాబునాయుడు పట్ల రేవంత్‌రెడ్డికి ఉన్న గురుభక్తితో తెలంగాణ ప్రజల హక్కులను తాకట్టు పెడుతున్నారని జీవన్‌రెడ్డి ఆరోపించారు. గతంలో ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడంతో రేవంత్‌రెడ్డి నోరు మెదపలేదని, చంద్రబాబునాయుడు తెలంగాణ వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు.

చేతులెత్తేశారు.. దేవుడే చూసుకోవాలి..

‘చంద్రబాబు డైరెక్షన్‌కు అనుగుణంగా ఓటుకు నోటు అమలు చేసింది రేవంత్‌రెడ్డే. ఇప్పుడు గురుశిష్యులు మళ్లీ అవే కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. వారి అనుబంధంతో తెలంగాణ హక్కులు కాలరాస్తున్నారు’ అని ఆరోపించారు. వరుణ యాగంతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి జ్ఞానోదయం కావాలని జీవన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాలనలో చేయాల్సిన పనులు చేయకుండా దేవుడిపై భారం వేయడం సరికాదన్నారు. మోదీతో రేవంత్‌రెడ్డికి ఉన్న సాన్నిహిత్యంతో ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులు ఇప్పిస్తే సంతోషిస్తామని అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం చేస్తే ప్రజలు క్షమించరని జీవన్‌రెడ్డి హెచ్చరించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement