త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lava Smart 4 | రూ.8,499కే లావా స్మార్ట్‌ఫోన్.. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16..

Lava Smart 4 | భారత మార్కెట్లో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ విభాగాన్ని మరింత విస్తరిస్తూ దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా కొత్త స్మార్ట్ 4 ఫోన్‌ను విడుదల చేసింది. ఇటీవల స్మార్ట్ 4 ప్లస్‌ను విడుదల చేసిన సంస్థ తాజాగా స్మార్ట్ 4ను తీసుకొచ్చింది.

S

Technology | Published On Aug 10, 2026, 5.19 pm IST

Lava Smart 4 | రూ.8,499కే లావా స్మార్ట్‌ఫోన్.. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16..
Advertisement

Lava Smart 4 | భారత మార్కెట్లో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ విభాగాన్ని మరింత విస్తరిస్తూ దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా కొత్త స్మార్ట్ 4 ఫోన్‌ను విడుదల చేసింది. ఇటీవల స్మార్ట్ 4 ప్లస్‌ను విడుదల చేసిన సంస్థ తాజాగా స్మార్ట్ 4ను తీసుకొచ్చింది. తొలిసారి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వినియోగ‌దారులు, యువత‌ను ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్న ఈ ఫోన్‌లో అవసరమైన ఫీచర్లు, మెరుగైన బ్యాటరీ సామర్థ్యం, భౌతిక దృఢత్వంపై సంస్థ దృష్టి పెట్టింది. లావా స్మార్ట్ 4లో 6.56 ఇంచుల క్యుహెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఇది 960 * 540 పిక్స‌ల్స్ రిజల్యూషన్‌తోపాటు 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఫోన్ యునిసోక్ ఎస్సీ9863ఎ ప్రాసెసర్ స‌హాయంతో పనిచేస్తుంది. ఇందులో 3జీబీ ర్యామ్‌తోపాటు మరో 3జీబీ వర్చువల్ ర్యామ్‌ను ర్యామ్ ఎక్స్‌పాన్షన్ ద్వారా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఫోన్ ఆండ్రాయిడ్ 16 గో ఎడిషన్ ఆధారంగా పనిచేస్తుంది.

భారీ బ్యాట‌రీ..

వెనుక భాగంలో ఎల్ఈడీ ఫ్లాష్ క‌లిగిన 8 మెగాపిక్స‌ల్ ప్రధాన కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను అందించారు. లావా స్మార్ట్ 4లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది యూఎస్‌బీ టైప్ సి పోర్ట్ ద్వారా 10 వాట్ల ఛార్జింగ్‌కు స‌పోర్ట్ ఇస్తుంది. ఫోన్‌కు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా లభించింది. ఎంఐఎల్-ఎస్‌టీడీ-810హెచ్ ప్రమాణాలకు అనుగుణంగా ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. దీంతో రోజువారీ వినియోగంలో ఫోన్ మరింత దృఢంగా ఉండేలా ప‌నిచేస్తుంది.

ధ‌ర వివ‌రాలు..

లావా స్మార్ట్ 4లో 32జీబీ అంతర్గత స్టోరేజ్ ఉంది. మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 512జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇందులో డ్యుయల్ సిమ్, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.2, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎం రేడియో, బాటమ్ పోర్టెడ్ స్పీకర్ కూడా ఉన్నాయి. లావా స్మార్ట్ 4ను కోణార్క్ గోల్డ్, అజంతా గ్రే రంగుల్లో అందిస్తున్నారు. దీని ధరను రూ.8,499గా నిర్ణయించారు. ఈ ఫోన్ లావా రిటైల్ స్టోర్లు, సర్వీస్ ప్రొవైడర్ నెట్‌వర్క్‌ల ద్వారా అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన భౌతిక స్టోర్లలో ఫైనాన్సింగ్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది.

Advertisement
Advertisement