త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Vakiti Srihari | 4.21 లక్షల మంది మత్స్యకారులకు రూ.5ల‌క్ష‌ల‌ ప్రమాద బీమా : మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి

Minister Vakiti Srihari | రాష్ట్రంలోని 4,21,767 మంది నమోదిత మత్స్యకారులకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి గ్రూప్‌ ప్రమాద బీమా పథకం (GAIS) అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.

P

Telangana | Published On Aug 10, 2026, 4.57 pm IST

Minister Vakiti Srihari | 4.21 లక్షల మంది మత్స్యకారులకు రూ.5ల‌క్ష‌ల‌ ప్రమాద బీమా : మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి
Advertisement

Minister Vakiti Srihari | రాష్ట్రంలోని 4,21,767 మంది నమోదిత మత్స్యకారులకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి గ్రూప్‌ ప్రమాద బీమా పథకం (GAIS) అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం, జీవనోపాధి భద్రత, సామాజిక రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు మత్స్యకారుడు మృతి చెందడం, శాశ్వత వైకల్యానికి గురైన సందర్భంలో కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ఉద్దేశమన్నారు.

రూ.5 లక్షల వరకు పరిహారం

18 నుంచి 70 ఏళ్ల వయస్సు కలిగిన 4,21,767 మంది నమోదిత మత్స్యకారులు ఈ పథకం పరిధిలోకి వస్తారని మంత్రి వెల్లడించారు. ఒక్కో లబ్ధిదారునికి రూ.79.96 చొప్పున బీమా ప్రీమియం ఉండగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో ప్రీమియం చెల్లిస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.21,34,79,673 చెల్లించనుందని, దీంతో అర్హులైన మత్స్యకారులపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదని స్పష్టం చేశారు. బీమా పథకం కింద ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత సంపూర్ణ వైకల్యం సంభవించినా రూ.5 లక్షల చొప్పున పరిహారం అందుతుంది. శాశ్వత పాక్షిక వైకల్యానికి రూ.2.50 లక్షలు, ప్రమాదవశాత్తు ఆసుపత్రిలో చికిత్స పొందితే గరిష్ఠంగా రూ.25 వేల వరకు వైద్య సహాయం అందనుంది.

జూన్‌ 1 నుంచి పాలసీ అమలు

2026 జూన్‌ 1 నుంచి అమల్లోకి వచ్చే పాలసీ కాలంలో అర్హులైన ప్రతి మత్స్యకారుడికి నిరంతర బీమా రక్షణ అందేలా మత్స్యశాఖ చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. ప్రమాద సమయంలో మత్స్యకారుల కుటుంబాలకు అండగా నిలవడంతో పాటు, వారి భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాల్లో గ్రూప్‌ ప్రమాద బీమా పథకం కీలకమైందని వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదిత మత్స్యకారులు, వారి కుటుంబాలకు సామాజిక భద్రత, ఆర్థిక రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

Advertisement
Advertisement