త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tribunals Reforms Bill | విప‌క్షాల నిర‌స‌న‌ల మ‌ధ్యే.. ట్రైబ్యునల్స్‌ సంస్కరణల బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం

Tribunals Reforms Bill | కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 'ట్రైబ్యునల్స్‌ సంస్కరణల బిల్లు-2026' (Tribunals Reforms Bill, 2026)కు లోక్‌స‌భ (Lok Sabha ) ఆమోదం తెలిపింది. ప‌లు అంశాల‌పై విప‌క్షాల నిర‌స‌న‌ల మ‌ధ్యే ఎలాంటి చ‌ర్చా లేకుండానే ఈ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఈ బిల్లు చట్టంగా మారితే ప్రస్తుతం అమల్లో ఉన్న 'ట్రైబ్యునల్స్ సంస్కరణల చట్టం-2021 రద్దై.. నేషనల్ ట్రైబ్యునల్స్ కమిషన్ (National Tribunals Commission) ఏర్పాటవుతుంది.

D

National | Published On Aug 10, 2026, 4.06 pm IST

Tribunals Reforms Bill | విప‌క్షాల నిర‌స‌న‌ల మ‌ధ్యే.. ట్రైబ్యునల్స్‌ సంస్కరణల బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం
Advertisement

Tribunals Reforms Bill | కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 'ట్రైబ్యునల్స్‌ సంస్కరణల బిల్లు-2026' (Tribunals Reforms Bill, 2026)కు లోక్‌స‌భ (Lok Sabha ) ఆమోదం తెలిపింది. ట్రిబ్యునల్స్‌ పనితీరును మెరుగుపరచడంతో పాటు వాటి అధ్య‌క్షులు, సభ్యుల అర్హతలు, నియామక ప్రక్రియలో సమర్థత, పారదర్శకతను పెంచి స్వయంప్రతిపత్తి, పారదర్శకత, ఏకరూపతను తీసుకురావడమే ల‌క్ష్యంతో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈ బిల్లును రూపొందించారు.

కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అయితే, విద్యార్థుల‌పై పోలీసుల చ‌ర్య‌ల‌ను నిర‌సిస్తూ ప్ర‌తిప‌క్షాలు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగారు. దీంతో ఎలాంటి చ‌ర్చా లేకుండానే ఈ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఈ బిల్లు చట్టంగా మారితే ప్రస్తుతం అమల్లో ఉన్న 'ట్రైబ్యునల్స్ సంస్కరణల చట్టం-2021 రద్దై.. నేషనల్ ట్రైబ్యునల్స్ కమిషన్ (National Tribunals Commission) ఏర్పాటవుతుంది. ఈ క‌మిష‌న్‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లేదా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారు. ఇందులో ఛైర్‌పర్సన్‌తో పాటు ఇద్దరు న్యాయ నిపుణులు, ఇద్దరు సాంకేతిక రంగ నిపుణులు మొత్తం న‌లుగురు స‌భ్యులు ఉంటారు.

Also Read..

వందేమాత‌రం కాదు.. త‌మిళ్ తాయ్ వాళ్తు ఫస్ట్‌.. త‌మిళ‌నాడు అసెంబ్లీ ఏక‌గ్రీవ తీర్మానం

స్టాక్ మార్కెట్లలో నీరసం.. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు..

హుజూరాబాద్‌లో 394 ఇళ్ల ప‌ట్టాలు ఇచ్చాం.. ప్ర‌తిప‌క్షాలు పొర్లుదండాలు పెట్టినా ప‌థ‌కాలు ఆపం

Advertisement
Advertisement