త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | పెద్ది అంతిమ‌యాత్ర‌కు ఓరుగ‌ల్లు మొత్తం క‌దిలింది.. ఆ చివరి ప్రయాణమే ఆయన జీవితానికి అసలైన కొలమానం

KTR | పెద్ది అంతిమ‌యాత్ర‌కు ఓరుగ‌ల్లు మొత్తం క‌దిలింద‌ని.. ల‌క్ష‌లాది మందితో సాగిన‌ ఆ చివ‌రి ప్ర‌యాణ‌మే ఆయ‌న జీవితానికి అస‌లైన కొల‌మానం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎంతకాలం బతికామన్నది కాకుండా, ఎలా బతికామన్నదానికి పెద్ది జీవితమే ఒక‌ ఉదాహరణ అని కొనియాడారు. ఉద్యమ బిడ్డకు ఉద్యమ గడ్డ ఇచ్చిన గౌరవమిదని పేర్కొన్నారు.

S

Telangana | Published On Aug 10, 2026, 4.51 pm IST

KTR | పెద్ది అంతిమ‌యాత్ర‌కు ఓరుగ‌ల్లు మొత్తం క‌దిలింది.. ఆ చివరి ప్రయాణమే ఆయన జీవితానికి అసలైన కొలమానం
Advertisement
  • ఉద్య‌మ బిడ్డ‌కు ఉద్య‌మ గ‌డ్డ ఇచ్చిన గౌర‌వ‌మిది
  • ఎలా బ‌తికామ‌న్న‌దానికి పెద్ది జీవిత‌మే ఒక ఉదాహ‌ర‌ణ‌
  • నర్సంపేట మెడికల్‌ కాలేజీకి పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు పెడతాం
  • నర్సంపేట మట్టిలో, పాకాల జలాల్లో పెద్ది పేరు చిర‌స్థాయిగా నిలిచిపోతుంది
  • నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదిన కర్మ సంస్మరణ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

KTR | త్రినేత్ర‌.న్యూస్: పెద్ది అంతిమ‌యాత్ర‌కు ఓరుగ‌ల్లు మొత్తం క‌దిలింద‌ని.. ల‌క్ష‌లాది మందితో సాగిన‌ ఆ చివ‌రి ప్ర‌యాణ‌మే ఆయ‌న జీవితానికి అస‌లైన కొల‌మానం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎంతకాలం బతికామన్నది కాకుండా, ఎలా బతికామన్నదానికి పెద్ది జీవితమే ఒక‌ ఉదాహరణ అని కొనియాడారు. ఉద్యమ బిడ్డకు ఉద్యమ గడ్డ ఇచ్చిన గౌరవమిదని పేర్కొన్నారు. న‌ర్సంపేట మెడిక‌ల్‌ కాలేజీకి పెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డి పేరు పెడ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు. న‌ల్ల‌బెల్లిలో సోమ‌వారం నిర్వ‌హించిన‌ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగ‌త‌ పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదిన కర్మ సంస్మరణ సభలో కేటీఆర్ మాట్లాడుతూ భావోద్వేగానికి గుర‌య్యారు. ఈ సంద‌ర్భంగా పెద్ది చిత్రపటానికి పూలమాలలు వేసి ఘ‌న‌ నివాళులర్పించారు.

పెద్ది సుదర్శన్‌రెడ్డి పెద్ద పెద్ద పదవులు అలంకరించకపోయినా, తెలంగాణ ఉద్యమానికి మరియు ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా పోరాటాలకు నాయకత్వం వహించిన మహోన్నత ప్రజా నాయకుడని కొనియాడారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి అంతిమయాత్రకు ఓరుగల్లు గడ్డ మొత్తం కదిలివచ్చిందని, కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా 12 గంటల పాటు లక్షలాది మంది ప్రజలు తరలిరావడం ఆయన వారి గుండెల్లో సంపాదించుకున్న అపారమైన స్థానానికి సజీవ సాక్ష్యమని తెలిపారు. ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడికి ఉద్యమ బిడ్డగా, ఆ ఉద్యమ గడ్డ ఇచ్చిన అత్యున్నత గౌరవమిదని పేర్కొన్నారు.

పెద్ది సుదర్శన్‌రెడ్డి మాజీ ముఖ్యమంత్రి లేదా మాజీ మంత్రి కాకపోయినా, పదిసార్లు ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఆయన అంతిమయాత్రకు అంతటి భారీ జనసందోహం రావడం ఆయనలోని ఉద్యమ బలానికి, నిబద్ధతకు నిదర్శనమని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవను గుర్తుచేసుకుంటూ, చివరి రోజుల్లోనూ దేవాదుల నీటి కోసం, ఢిల్లీలో పోరాడుతున్న విద్యార్థుల నిరసనలకు మద్దతుగా నగరంలో ధర్నాలు చేపట్టేందుకు ఆయన చూపిన తపనను వివరించారు.

జూలై 26న పెద్ది అస్వస్థతకు గురైన సమయంలో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు తరలించామని, అమెరికా, లండన్‌లోని నిపుణులైన వైద్యుల సలహాలు తీసుకుంటూ కాపాడుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డినా ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నర్సంపేట నియోజకవర్గానికి పెద్ది సుదర్శన్‌రెడ్డి చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని కేటీఆర్‌ కొనియాడారు.

ఒక్కసారే ఎమ్మెల్యేగా పని చేసినా, కరోనా మహమ్మారి, తీవ్ర ఆర్థిక సంక్షోభం వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా నర్సంపేటలో ఇంటింటికీ పైపులైన్‌ ద్వారా గ్యాస్‌ సరఫరా కార్యక్రమాన్ని అమలు చేశారని గుర్తు చేశారు. బడ్జెట్‌ పరిమితులు ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్‌, వ్యవసాయ మంత్రులను ఒప్పించి నర్సంపేట రైతుల కోసం రూ.100 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టును పట్టుబట్టి సాధించి అసాధారణ అభివృద్ధిని సాధించారని తెలిపారు.

రాబోయే రెండేళ్లలో కేసీఆర్‌ నాయకత్వంలో బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పెద్ది ఆశయాలకు అనుగుణంగా నర్సంపేటను అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తామని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. నర్సంపేటలో త్వరలోనే ఏర్పాటు చేయనున్న మెడికల్‌ కాలేజీకి పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు పెట్టి ఆయన జ్ఞాపకాలను భవిష్యత్తు తరాలకు చిరస్థాయిగా నిలుపుతామని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎల్లప్పుడూ కొండంత అండగా ఉంటుందని, సూర్యచంద్రులు ఉన్నంతకాలం నర్సంపేట మట్టిలో, పాకాల జలాల్లో పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు నిలిచిపోతుందని పేర్కొన్నారు. సూర్య‌చంద్రులు ఉన్నంతకాలం నర్సంపేట మట్టిలో, పాకాల జలాల్లో పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు నిలిచిపోతుందని పేర్కొన్నారు.

Advertisement
Advertisement