త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Faria Abdullah | బోనాల వేడుక‌లో కంట‌త‌డి పెట్టిన జాతిర‌త్నాలు హీరోయిన్‌ – తెలంగాణ క‌ల్చ‌ర్‌కు ఫిదా

తెలంగాణ క‌ల్చ‌ర్‌కు జాతిర‌త్నాలు హీరోయిన్ ఫిదా అయ్యింది. ఆదివారం మ‌హంకాళి బోనాల జాత‌ర‌లో ఫ‌రియా అబ్దుల్లా పాల్గొన్న‌ది. ఈ జాత‌ర‌లో తెలంగాణ క‌ల్చ‌ర్ గురించి చెబుతూ ఫ‌రియా అబ్దుల్లా క‌న్నీళ్లు పెట్టుకుంది.

N

Entertainment | Published On Aug 10, 2026, 4.54 pm IST

Faria Abdullah | బోనాల వేడుక‌లో కంట‌త‌డి పెట్టిన జాతిర‌త్నాలు హీరోయిన్‌ – తెలంగాణ క‌ల్చ‌ర్‌కు ఫిదా
Advertisement

Faria Abdullah | తెలంగాణ సంస్కృతి, సంప్ర‌దాయాల‌కు జాతిర‌త్నాలు హీరోయిన్ ఫ‌రియా అబ్దుల్లా ఫిదా అయ్యింది. తెలంగాణ గొప్ప‌త‌నాన్ని వివ‌రిస్తూ జాతిర‌త్నాలు బ్యూటీ ఎమోష‌న‌ల్ అయ్యింది. హైద‌రాబాద్‌లోని లాల్ ద‌ర్వాజా మ‌హంకాళి బోనాల జాత‌ర‌లో  ఆదివారం ఫ‌రియా అబ్దుల్లా పాల్గొన్న‌ది. ఈ బోనాల జాత‌ర‌లో డ్యాన్స్ చేసింది. స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టింది. అంత‌కుముందు అమ్మ‌వారికి తానే స్వ‌యంగా బోనాన్ని స‌మ‌ర్పించింది. బోనం ఎత్తుకొని మ‌హంకాళి అమ్మ‌వారిని ద‌ర్శించుకుంది.

ఎమోష‌న‌ల్‌...

మ‌హంకాళి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం మాట్లాడే క్ర‌మంలో ఫ‌రియా అబ్దుల్లా భావోద్వేగానికి గురై క‌న్నీళ్లు పెట్టుకుంది. "తెలంగాణ క‌ల్చ‌ర్ అంటేనే కుల‌మ‌తాలు, ప్రాంత భేదాలు లేకుండా అంద‌రిని క‌లుపుకుపోవ‌డం, అంద‌రితో క‌లిసి ఉండ‌టం" అని జాతిర‌త్నాలు హీరోయిన్ అన్న‌ది "చాలా బెస్ట్ క‌ల్చ‌ర్ ఇద‌ని" చెప్పింది. ఫ‌రియా స్పీచ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌...

లాల్ ద‌ర్వాజా బోనాల జాత‌ర‌కు సెలిబ్రిటీలు క్యూ క‌డుతున్నారు. ఆదివారం విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ఆనంద్ దేవ‌ర‌కొండ‌తో పాటు డైరెక్ట‌ర్ సందీప్ వంగా మ‌హంకాళి ఆల‌యాన్ని సంద‌ర్శించారు.

జాతిర‌త్నాలుతో...

జాతిర‌త్నాలు మూవీతో హీరోయిన్‌గా తెలుగు చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌య‌మైంది ఫ‌రియా అబ్దుల్లా. న‌వీన్ పొలిశెట్టి హీరోగా న‌టించిన ఈ మూవీలో చిట్టి అనే అల్ల‌రిత‌న‌, అమాయ‌క‌త్వం క‌ల‌బోసిన పాత్ర‌లో క‌నిపించింది. జాతిర‌త్నాలు స‌క్సెస్ కావ‌డంతో ఫ‌రియా తెలుగులో చాలానే అవ‌కాశాలు ద‌క్కించుకుంటోంది. ర‌వితేజ రావ‌ణాసుర‌, గాయ‌ప‌డ్డ సింహం, ఆ ఒక్క‌టీ అడ‌క్కుతో పాటు మరికొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించింది.  ప్ర‌స్తుతం ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇస్తూ రూపొందిస్తోన్న సిగ్మాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. సందీప్ కిష‌న్ హీరోగా న‌టించిన ఈ మూవీ త్వ‌ర‌లో  థియేటర్లలోకి రాబోతుంది.

Advertisement
Advertisement