త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhagwant Mann | అత్యాచారం కేసును తొక్కిపెట్టేందుకు రూ.5 కోట్లు డిమాండ్‌.. పంజాబ్ సీఎం భార్య‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

Bhagwant Mann | పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్ (Bhagwant Mann) భార్య గుర్‌ప్రీత్ కౌర్ (Gurpreet Kaur)పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు వెలుగులోకి వ‌చ్చాయి. ఓ అత్యాచారం కేసును తొక్కిపెట్టేందుకు ఆమె నిందితుడి నుంచి రూ.5కోట్లు డిమాండ్ చేసిన‌ట్లు ఓ మాజీ న్యాయ‌మూర్తి ఎన్‌హెచ్‌ఆర్‌సీ (NHRC)కి ఫిర్యాదు చేశారు.

D

National | Published On Aug 22, 2026, 12.37 pm IST

Bhagwant Mann | అత్యాచారం కేసును తొక్కిపెట్టేందుకు రూ.5 కోట్లు డిమాండ్‌.. పంజాబ్ సీఎం భార్య‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు
Advertisement

Bhagwant Mann | త్రినేత్ర‌.న్యూస్ : పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్ భార్య గుర్‌ప్రీత్ కౌర్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఓ అత్యాచారం కేసులో నిందితుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు ఆమె రూ.5 కోట్లు డిమాండ్ చేసిన‌ట్లు ఆరోపిస్తూ పంజాబ్-హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజిత్ సింగ్ జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌కు (NHRC) ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదును ఎన్‌హెచ్‌ఆర్‌సీ తీవ్రంగా ప‌రిగణించింది. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)ను ఆదేశించింది. ఆరోప‌ణ‌ల‌పై పూర్తి వివ‌రాలు సేక‌రించి.. తీసుకున్న చ‌ర్య‌ల‌పై నివేదిక‌ను రెండు వారాల్లోగా క‌మిష‌న్‌కు స‌మ‌ర్పించాల‌ని స్ప‌ష్టం చేసింది. అంతేకాదు, ఈ అంశాన్ని కేంద్ర‌ హోం శాఖ‌లోని మ‌హిళా భ‌ద్ర‌తా విభాగం దృష్టికి కూడా తీసుకెళ్లింది. నివేదిక అందిన త‌ర్వాత త‌దుప‌రి చ‌ర్య‌ల‌పై నిర్ణ‌యం తీసుకుంటామని క‌మిష‌న్ స్ప‌ష్టం చేసింది.

Also Read..

సీజేపీ త‌నిఖీల‌తో వెలుగులోకి రాజ‌స్థాన్ ప్ర‌భుత్వ బ‌డుల దుస్థితి.. 611 పాఠ‌శాల‌ల‌కు సొంత భ‌వ‌నాలు లేవ‌ని అంగీక‌రించిన స‌ర్కార్‌

వృద్ధులే ల‌క్ష్యంగా రూ.63 కోట్ల‌ భారీ మోసం.. అమెరికాలో భారతీయుడి అరెస్ట్‌

కుదిరితే బీఆర్ఎస్‌..లేదంటే జనసేన.. వ‌చ్చే ఎన్నిల్లో పోటీకి సిద్ధ‌మ‌వుతున్న బండ్ల గణేశ్‌

Advertisement
Advertisement