NHRC | ఐశ్వర్య మృతిపై స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ
NHRC | సికింద్రాబాద్‌లోని మెడికవర్ ఆస్పత్రిలో కిడ్నీలో రాళ్ల శస్త్రచికిత్స అనంతరం జూనియర్ న్యాయవాది టీ ఐశ్వర్య (28) మృతి చెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) స్పందించింది. ఈ ఘటనపై దాఖలైన ఫిర్యాదును విచారణకు స్వీకరించిన కమిషన్.. నాలుగు వారాల్లోగా చర్యల నివేదిక సమర్పించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది.
NHRC | సికింద్రాబాద్‌లోని మెడికవర్ ఆస్పత్రిలో కిడ్నీలో రాళ్ల శస్త్రచికిత్స అనంతరం జూనియర్ న్యాయవాది టీ ఐశ్వర్య (28) మృతి చెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) స్పందించింది. ఈ ఘటనపై దాఖలైన ఫిర్యాదును విచారణకు స్వీకరించిన కమిషన్.. నాలుగు వారాల్లోగా చర్యల నివేదిక సమర్పించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు న్యాయవాది, సామాజిక కార్యకర్త కారుపోతుల రేవంత్ ఈ నెల 14న కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిని కేసు నంబర్ 1052/36/2/2026గా నమోదు చేసిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ.. అక్టోబర్ 28న పరిశీలించింది. ఫిర్యాదు ప్రతులను సంబంధిత అధికారులకు పంపించి, తగిన చర్యలు తీసుకోవడంతోపాటు ఆంగ్లంలో రూపొందించిన చర్యల నివేదికను గడువులోగా సమర్పించాలని స్పష్టం చేసింది.
ఈ నెల 7న కిడ్నీలో రాళ్ల చికిత్స కోసం ఐశ్వర్య సికింద్రాబాద్‌లోని మెడికవర్ ఆస్పత్రిలో చేరారు. శస్త్రచికిత్స అనంతరం ఆమె మృతి చెందారు. అయితే, శస్త్రచికిత్స అవసరం, దాని వల్ల ఎదురయ్యే ప్రమాదాలను వైద్యులు సరిగా వివరించలేదని, రోగి నుంచి సమాచారంతో కూడిన సమ్మతి తీసుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐశ్వర్యను చూసేందుకు అనుమతించలేదని, వైద్య రికార్డులు అందించడంలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయని, చికిత్స పేరుతో భారీ మొత్తాలు డిమాండ్ చేశారని ఫిర్యాదుదారు ఆరోపించారు. ఈ ఘటనపై స్వతంత్ర వైద్య నిపుణులతో విచారణ జరిపించాలని రేవంత్ కోరారు. ఐశ్వర్యకు సంబంధించిన పూర్తి వైద్య రికార్డులను భద్రపరిచి, కుటుంబ సభ్యులకు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. విచారణలో బాధ్యులుగా తేలిన వారిపై చట్టపరమైన, క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంతోపాటు బాధిత కుటుంబానికి తగిన పరిహారం అందించాలని కోరారు. అదే ఆస్పత్రిలో ఇతర రోగుల మృతికి సంబంధించి వెలువడిన వార్తలపైనా విచారణ జరపాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కిడ్నీలో రాళ్ల చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన యువ న్యాయవాది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని రేవంత్ అన్నారు. చికిత్సకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడం, దాని వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన పొందడం, వైద్య రికార్డులు తీసుకోవడం ప్రతి రోగికి, వారి కుటుంబ సభ్యులకు ఉన్న హక్కులని పేర్కొన్నారు. ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదును విచారణకు స్వీకరించి సంబంధిత అధికారుల నుంచి నివేదిక కోరిన ఎన్‌హెచ్‌ఆర్‌సీకి రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో జవాబుదారీతనం పెరిగేలా తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం ఎన్‌హెచ్‌ఆర్‌సీ సంబంధిత అధికారుల నుంచి చర్యల నివేదిక కోరింది. ఈ ఘటనపై వచ్చిన ఆరోపణల నిజానిజాలు, బాధ్యతలపై తుది నిర్ధారణ విచారణ అనంతరం వెలువడాల్సి ఉంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Induja | కేటీఆర్‌పై పోలీసులకు బల్మూర్ వెంకట్ భార్య ఫిర్యాదు
- ●SIR Row | ఇండియా కూటమి ర్యాలీకి ‘కాక్రోచ్ జనతా పార్టీ’ మద్దతు
- ●Nirmala Sitharaman | వ్యాపారవేత్తల్లో విషం నింపొద్దు.. టాటా గ్రూప్‌పై రాహుల్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ఫైర్
- ●CM Revanth Reddy Delhi Tour | రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి: 'ఇన్వెస్ట్ తెలంగాణ' కర్టెన్ రైజర్ వేదికగా గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఫోకస్!
- ●TGPSC MPSO ASO Notification 2026 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్: TGPSC నుంచి మరో జాబ్ నోటిఫికేషన్!
- ●Telangana SC Categorization | ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కఠిన ఆదేశాలు: నియామకాలు, ప్రమోషన్లలో తప్పనిసరిగా అమలు చేయాల్సిందే!

Induja | కేటీఆర్‌పై పోలీసులకు బల్మూర్ వెంకట్ భార్య ఫిర్యాదు

SIR Row | ఇండియా కూటమి ర్యాలీకి ‘కాక్రోచ్ జనతా పార్టీ’ మద్దతు

Nirmala Sitharaman | వ్యాపారవేత్తల్లో విషం నింపొద్దు.. టాటా గ్రూప్‌పై రాహుల్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ఫైర్

CM Revanth Reddy Delhi Tour | రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి: 'ఇన్వెస్ట్ తెలంగాణ' కర్టెన్ రైజర్ వేదికగా గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఫోకస్!



